'వర్సిటీలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నం'
హైదరాబాద్ : హెచ్సీయూలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ శ్రీవాస్తవ్ వెల్లడించారు. మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. విద్యార్థులతో చర్చల ద్వారానే ప్రస్తుతం సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీవాస్తవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.