ఆపరేషన్ చేయాల్సిన చోట చేయకుండా..
జమ్మూకశ్మీర్: జమ్మూకాశ్మీర్లో వైద్యులు పెద్దతప్పిదం చేశారు. ఒక చోట చేయాల్సిన శస్త్ర చికిత్స మరోచోట చేసి అబాసుపాలయ్యారు. ఈ తప్పిదంతో ఆస్పత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసిన ఐదుగురిని డిస్మిస్ చేసింది. షాలిమార్ బాగ్కు చెందిన రవి రాయ్ అనే 24 చార్టెడ్ ఎకౌంటెంట్కి ఇంట్లో మెట్లు జారీపడి కుడికాలి చీలమండలంలో గాయమైంది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఫార్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పరీక్షలు, స్కానింగ్ చేసిన వైద్యులు కుడి కాలి చీలమండలం జాయింట్లో గాయమైనట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ మాత్రం ఎడమకాలి చీలమండలానికి చేశారు.
ఆపరేషన్ పూర్తయిన తర్వాత అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కుడికాలికి అవసరం అయితే, ఎడమకాలికి చికిత్స ఎలా చేస్తారని నిలదీశారు. దానికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఎలాంటి సమస్య లేకుండా తిరిగి మరోసారి ఎడమకాలికి చికిత్స చేస్తామని అన్నారు. పరీక్షలు చేసి, స్కానింగ్ చేసి, ఆఖరికి ఆపరేషన్ మాత్రం చేయాల్సిన కాలికి కాకుండా వేరే కాలికి చేసి తిరిగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ఆగ్రహంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించింది.