కశ్మీర్లో కొండచరియలు పడి 9 మంది మృతి
శ్రీనగర్/దోడా: భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లా, దివాల్కుండ్లో ఇంటిపై కొండ చరియలు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రానికి శిథిలాల నుంచి ఒక మహిళ, ఆమె కూతురు మృతదేహాలను బయటకు తీయగలిగామని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద కూరుకుపోయిన వారి జాడ తెలుసుకునేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. బారాముల్లా జిల్లాలో అడవిలోకి వెళ్లిన ఇద్దరిపై కొండచరియలు పడడంతో వారిద్దరూ మృతిచెందారు.