Hillary Clinton supporters
-
హిల్లరీ వర్గీయులకు ఊహించని షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండడంతో హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు షాక్ తిన్నారు. గెలుపు దిశగా ట్రంప్ పయనిస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. హిల్లరీ గెలుపుపై ముందు నుంచి దీమాగా ఉన్న ఆమె మద్దతుదారులు ఫలితాల సరళిని చూసి అవాక్కవుతున్నారు. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడంతో హిల్లరీ వర్గీయులకు మింగుడు పడడం లేదు. మేజిక్ ఫిగర్ కు ట్రంప్ చేరువవుతుండడంతో హిల్లరీ మద్దతుదారులకు టెన్షన్ పెరిగిపోతోంది. సర్వేలన్నీ హిల్లరీ గెలుస్తారని వెల్లడించడంతో కౌంటింగ్ ముందు దీమాగా ఉన్న డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఫలితాల సరళితో డీలా పడిపోయారు. విచారణ వదనాలతో కన్పిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ వర్గీయులు సంబరాలకు రెడీ అవుతున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. -
ముస్లింలకు తుపాకులు అమ్మబోం!
అమెరికాలో తుపాకులు అమ్మే ఓ దుకాణం సరికొత్త వివాదానికి తెరతీసింది. ముస్లింలకు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులకు తాము తుపాకులు అమ్మబోమంటూ తన దుకాణంలో ఓ బోర్డు పెట్టింది. అంతేకాకుండా దినపత్రికల్లోనూ ఇదేవిధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పెన్సిల్వేనియా రూరల్ జాక్సన్ సెంటర్కు చెందిన పాల్ చాండ్లెర్ (54)కు ‘అల్ట్రా ఫైర్ఆర్మ్స్’ పేరిట తుపాకులు అమ్మే దుకాణం ఉంది. అయితే, తన దుకాణానికి తుపాకులు కొనేందుకు వచ్చే ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులను ఉత్తచేతులతో తిప్పిపంపుతున్నట్టు ఆయన తెలిపారు. 'దయచేసి ముస్లింలు, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు రావొద్దు. ఉగ్రవాదులకు తుపాకులు అమ్మడం క్షేమం కాదని మేం భావిస్తున్నాం' అన్న బోర్డును ఆయన తన దుకాణం తలుపులకు తగిలించారు. అతేకాకుండా స్థానిక దినపత్రికల్లోనూ ఈ ప్రకటన ఇచ్చారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీకి మద్దతు ఇచ్చేవారికి, ముస్లింలకు తుపాకులు అమ్మకుండా ఉండే స్వేచ్ఛ ఒక యాజమానిగా తనకు ఉందని, అందుకే వారు తన దుకాణానికి వస్తే.. వారికి అమ్మేందుకు తిరస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. అమెరికాలో తుపాకుల సంస్కృతి విచ్చలవిడిగా ఉన్న సంగతి తెలిసిందే. -
'ప్యాంట్ సూట్ పోజ్' తో హిల్లరీకి మద్దతు..
న్యూయార్క్ః అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కు రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆమెపై పెరుగుతున్న అభిమానాన్ని జనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా కొందరు డ్యాన్సర్లు హిల్లరీకి మద్దతుగా చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. 'ప్యాంట్ సూట్ పోజ్' అంటూ హిల్లరీకి మద్దతుగా ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు కొందరు న్యూ యార్క్ సిటీ లో ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ నిర్వహించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ ట్రేడ్ మార్క్ స్టైల్లో ' ప్యాంట్ సూట్' ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ నిర్వహించి ఆమెపై అభిమానాన్ని, మద్దతునూ చాటారు. మొత్తం 150 మందికి పైగా హిల్లరీ అభిమానులు కలర్ ఫుల్ ప్యాంట్ సూట్స్ ధరించి, యూనియన్ స్క్యేర్ ప్రాంతానికి చేరారు. అక్కడ జస్టిన్ టింబర్ లేక్ 'కాంట్ స్టాప్ ద ఫీలింగ్' పాటకు నృత్యాన్ని జోడించారు. తమ ప్రదర్శన వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, ఎవరైతే ఈ దేశం డోనాల్డ్ ట్రంప్ పాలనలోకి వెళ్ళకూడదనుకుంటున్నారో వారందరి తరపునా ఈ ఫ్లాష్ మాబ్ ను ప్రదర్శించినట్లు తెలిపారు. కొంత క్రియాశీలకంగా, మరికొంత కళాత్మకంగా హిల్లరీకి తమ మద్దతు తెలిపినట్లు కో కొరియోగ్రాఫర్ క్రిషాన్ జెరోమ్ ఫేస్ బుక్ లో వివరించారు. జాత్యాహంకారం, అసహ్యం, హోమోఫోబియో, క్లాసిజం, అన్యాయానికి వ్యతిరేకంగా... శాంతి, ప్రేమ, సమానత్వం పక్షాన ఈ డ్యాన్స్ నిర్వహించినట్లు క్రిషాన్ తెలిపారు. తమకు తెలిసిన రీతిలో హిల్లరీకి సహాయం అందించేందుకే ఈ ఫ్లాష్ మాబ్ నిర్వహించినట్లు ఈవెంట్ నిర్వాహకులు కొరియోగ్రాఫర్-చిత్ర నిర్మాత సెలియా రోల్సన్ హాల్, దర్శకుడు మియా లిడోఫ్ స్కై లు తెలిపారు. ర్యాలీలద్వారా ట్రంప్ కు మద్దతు అందుతుంటే.. తమకు తెలిసిన కళాత్మక మార్గంలో హిల్లరీకి మద్దతు తెలిపేందుకు ఈ విభిన్న ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నం ఆమెకు ఎన్నికల్లో విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నట్లు రోల్సన్ హాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ 'ప్యాంట్ సూట్ పోజ్' వీడియో హిల్లరీకి పెరుగుతున్న అమితమైన అభిమానాన్ని వ్యక్త పరుస్తోంది. -
'ప్యాంట్ సూట్ పోజ్' తో హిల్లరీకి మద్దతు..