Himachal accident
-
‘బియాస్’ మృతుడు అఖిల్‌కు అంతిమ వీడ్కోలు
వందలాదిగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు శోకసంద్రంగా మారిన గిర్మాజీపేట ఎల్బీనగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు వరంగల్ నగరంలోని గిర్మాజీపేట శోకసంద్రంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో అఖిల్ మృతిచెందగా... అతడి భౌతికకాయం మంగళవారం నగరానికి చేరుకుంది.తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు. వరంగల్ చౌరస్తా : తాము పడుతున్న కష్టాన్ని దిగమింగుతూ కుమారుడిని గొప్ప చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలులు కల్లలయ్యూరుు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారి ఇంటికి చేరాడు. 16 రోజుల ఎదురు చూపుల తర్వాత ఇంటికి చేరిన అఖిల్ అంత్యక్రియలు అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య మంగళవారం ముగిశారుు. వరంగల్‌లోని 21వ డివిజన్లోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు మౌనిక, కుమారుడు అఖిల్ ఉన్నారు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న అఖిల్ ఈనెల 3న స్టడీ టూర్ కోసం తోటి విద్యార్థులో కలిసి వెళ్లాడు. ఈ నెల 8న ిహ మాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఫొటోలు దిగుతుండగా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వచ్చిన నీళ్లలో అఖిల్‌తో సహా 24 మంది విద్యార్థులు కొట్టుకుపోరుున విషయం తెలిసిందే. రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిన 15 రోజుల తర్వాత అఖిల్ మృతదేహం లభించింది. సోమవారం అదేరాష్ట్రంలోని మండి జిల్లా కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి రోడ్డుమార్గంలో ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకుంది. అక్కడే ఉన్న వరంగల్ ఆర్డీఓ మధు, తహసీల్దార్ రవి అఖిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్‌లో సాయంత్రం 4.15 గంటలకు గిర్మాజీపేటలోని ఇంటికి మృతదేహం చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తూ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. వారి రోదనలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోరుుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారంతా అఖిల్‌ను కడసారి చూపు చూసుకోవాలని ఆతృతగా చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. మృతదేహం 15 రోజులపాటు నీళ్లలో ఉండటంతో దుర్వాసన రాకుండా పూర్తిగా ప్యాక్ చేసి, బాక్సులో పెట్టారు. దీంతో శవపేటికపై కప్పిన అఖిల్ ఫ్లెక్సీ వద్ద నివాళులు అర్పించారు. అప్పటికే బంధువులు, స్నేహితులు, స్థానికలు, నాయకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. అఖిల్ తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్, సునీత , అక్క మౌనిక, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జేసీ, అర్బన్ ఎస్పీ, ఇతర అధికారుల నివాళి అఖిల్ మృతదేహం వద్ద జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీఓ మధు, తహసీల్దార్ మధు నివాళులు అర్పించారు. పుష్ఫగుచ్చాలను శవపేటికపై పెట్టారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితోపాటు వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి.రమేష్‌బాబు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరిరమాదేవి, వైద్యురాలు ప్రమీల, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ నాయకులు, బాకం హరి శంకర్, ఎరుకల రఘునారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బండి కుమారస్వామి, చిన్న గోపి తదితరులు అఖిల్ భాతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బర్త్‌డే డ్రెస్ శవపేటికపై కప్పి అంతిమయూత్ర.. ఈ సారి బర్త్‌డేను తన ఫ్రెండ్స్‌తో జరుపుకుంటానని చెప్పి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని కొత్తదుస్తులు కొనుక్కొని పయనమైన అఖిల్ బర్త్‌డే చేసుకోకముందే కానరాని లోకాలకు చేరాడు. ఆ దుస్తులు అతడు ప్రయూణించిన బస్సులోనే ఉండిపోయూరుు. కళాశాల తరఫున వచ్చిన ముగ్గురు ప్రతినిధులు అఖిల్ కుటుంబ సభ్యులకు అతడి బ్యాగ్‌ను అప్పగించారు. అతడి బర్త్‌డే దుస్తులను శవపేటికపై కప్పి అంతిమయూత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు సంప్రదాయబద్ధంగా జిల్లేడుచెట్టుకు పెళ్లి చేసి అక్షింతలు వేశారు. -
ఇక వారిపై ఆశల్లేనట్టేనా?
►గుండెల్ని మెలిపెడుతున్న హిమాచల్ ఘోరం ►ఇంకో 18 మంది విద్యార్థుల కోసం కన్నవారి ఎదురుచూపులు ►రంగంలోకి మానవరహిత విమానాలు: మర్రి ►సైన్యం సాయం కూడా కోరాం: నాయిని మండి, సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నాయి. ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆదివారం హిమాచల్ దుర్ఘటనలో గల్లంతైన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలతో తిరిగొచ్చే అవకాశాలు దాదాపుగా మృగ్యంగానే కన్పిస్తున్నాయి. మండి జిల్లాలో లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా వచ్చి పడ్డ వరద ధాటికి బియాస్ నదిలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల్లో బుధవారం మరొకరు విగత జీవుడై దొరికారు. అతన్ని హైదరాబాద్ శివరాంపల్లికి చెందిన సాబేర్ హుస్సేన్‌గా గుర్తించారు. లార్జి డ్యామ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నదిలో లోతైన ప్రదేశంలో గజ ఈతగాళ్లు అతని మృతదేహాన్ని కనిపెట్టారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. శవాన్ని గుర్తు పట్టిన అతని తల్లి ఆయేషా బేగం గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఊరడించడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాన్ని రోడ్డు మార్గాన కులుమనాలికి తరలించారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాద్ చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం నలుగురు, మంగళవారం ఒక విద్యార్థి మృతదేహాలను వెలికితీయడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా ఆరుగురు విద్యార్థుల శవాలు దొరికాయి. మరో 18 మంది విద్యార్థులతో పాటు టూర్ ఆపరేటర్ ఆచూకీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వారందరి కుటుంబీకులూ బియాస్ నది వద్ద కంటిపై కునుకు కూడా లేకుండా నిస్సహాయంగా ఎదురుతెన్నులతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఎలాగైనా తమవారి జాడ తీయాలంటూ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని వారు వేడుకుంటున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. లార్జి-పండో డ్యామ్‌ల మధ్య 17 కి.మీ. దూరాన్ని ఏడు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, దుర్ఘటనకు సంబంధించి లార్జి డ్యామ్ అధికార వర్గాలపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ప్రాణాపాయం కలిగించడం), 304-ఎ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం) సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు మండి ఎస్పీ ఆర్ఎస్ నేగీ తెలిపారు. విద్యార్థులతో పాటు పర్యటనకు వెళ్లిన ఉపాధ్యాయుడు ఎ.ఆదిత్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వివరించారు. విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శల నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. అన్నీ ఆటంకాలే...: సహాయ చర్యలకు వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. బుధవారం మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపేశారు. బియాస్ నది నిండా బండలుండటం, పూడిక పేరుకుపోవడంతో పాటు ప్రవాహం ఉధృతంగా ఉండటం సమస్యగా మారాయని ఎన్డీఆర్ఎఫ్ బృందాల కమాండింగ్ అధికారి జైదీప్‌సింగ్ చెప్పారు. విద్యార్థులు బండల కిందో, పూడికలోనో చిక్కిపోయి ఉండొచ్చన్నారు. ‘‘ఆచూకీ చిక్కని విద్యార్థుల్లో ఎవరూ బతికుండే అవకాశాల్లేవు. బహుశా గురువారానికల్లా మృతదేహాలు నీటిపైకి తేలవచ్చని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గాలింపును ఉధృతం చేస్తామని స్థానికంగా మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉదయమే వీలైనంత త్వరగా రంగంలోకి దిగుతామని ‘సాక్షి’కి చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందన్నారు. తమ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వెలికితీత చర్యలను వేగవంతం చేసేందుకు కనీసం 500 మంది సైనికులను పంపాల్సిందిగా కోరినట్టు చెప్పారు. మానవరహిత విమానాలు సహా గాలింపుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జాతీయ విపత్తు సంస్థ (ఎన్డీ ఎంఏ) కూడా నిర్ణయించింది. బుధవారం ఎన్డీఎంఏ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘మానవరహిత విమానంతో ఉపరితలం నుంచి ఫొటోలు తీయడంతో పాటు నీటి అడుగున పని చేసే కెమెరాలను కూడా వినియోగిస్తాం. గువాహటి, కోల్‌కతా, పాట్నాల నుంచి అనుభవ జ్ఞులైన గజ ఈతగాళ్లను పిలిపిస్తున్నాం’’ అని మర్రి చెప్పారు. ఆయన గురువారం ఘటనా స్థలికి వెళ్తారని సమాచారం.