రోడ్డు ప్రమాదంలో హాస్టల్ వార్డెన్ మృతి
చెన్నూరు(వైఎస్సార్ జిల్లా): గుర్తుతెలియని వాహనం ఢీకొని హాస్టల్ వార్డెన్ మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరులో శనివారం చోటుచేసుకుంది. కడపకు చెందిన ఫ్రాన్సిస్(55) స్థానిక ఎస్సీ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నేటి ఉదయం కడప నుంచి చెన్నూరు వచ్చిన ఆయన ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.