husband kills his wife
-
తాగుబోతు భర్తకు ఎదురుపడ్డ భార్య, మత్తులో ప్రాణాలు తీసి..
ముమ్మిడివరం: భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు నక్కావారిపేటలో సోమవారం రాత్రి ఈ హత్యోదంతం జరిగింది. నక్కవారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 ఏళ్ల కిందట ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గా ఈశ్వరి(32)తో పెళ్లయింది. వీరికి 12 ఏళ్ల భరత్, తొమ్మిదేళ్ల శరత్ అనే ఇద్దరు కుమారులున్నారు. నగర పంచాయతీలో రవీంద్ర కాంట్రాక్టు ప్రాతిపదికపై చెత్త తరలింపు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఆ సమయంలో రవీంద్ర యానాంలో మద్యం తాగుతున్నట్టు తెలుసుకుని గట్టిగా నిలదీసింది. తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం బయలుదేరింది. 200 మీటర్ల దూరం వెళ్లేసరికి భర్త ఎదురు పడ్డాడు. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీంద్ర భార్య దుర్గా ఈశ్వరిపై దాడిచేశాడు. అతడి పిడిగుద్దులకు ఆమె కింద పడింది. వెంటనే ఆమె తలను రోడ్డుకు వేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతదేహన్ని రోడ్డు పక్కన కాలువలో పడేసి రవీంద్ర ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయాన్నే పోలీస్స్టేషన్కు వెళ్లి తానే భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్సీ ఎం.మాధవరెడ్డి, సీఐ ఎం.జానకీరామ్, ఎస్సై కె.సురేష్బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించారు. -
దారుణం: భార్య ప్రాణం తీసిన సలాడ్..
లక్నో: భోజనంలో సలాడ్ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్ జలాల్పూర్లో చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళి (45), సుదేశ్ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ చదవండి: లాక్డౌన్తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య -
'రాయితో కొట్టి భార్యను చంపేశాడు'
ముదిగొండ (ఖమ్మం): అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన రాపోలు శ్రీను, కృష్ణవేణి (24) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, శ్రీను తరచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. గత నెల 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా భార్యను రాయితో బలంగా మోదటంతో ఆమె తలపై గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే శ్రీను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు భార్యను వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తరచూ తన కుమార్తెను అనుమానించేవాడని, అదే కారణంతో ఆమెను కొట్టి చంపాడని శ్రీనుపై కృష్ణవేణి తండ్రి సంపంగి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాములుది నల్లగొండ జిల్లా అనుముల గ్రామం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.