నిరసనల మధ్య సీఎం పర్యటన
రుణాలు మాఫీ అన్నారు ఏమయిందని డ్వాక్రా మహిళలు ప్రశ్నలు
నిలదీయడానికి వెళ్తామంటే అడ్డుకుంటారా : పోలీసులపై పలువురి ఆగ్రహం
హామీలిచ్చి తప్పుకోవడం ఇదేమి పద్ధతంటూ ఆవేదన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
దళిత, గిరిజన గర్జన సభలో బాబును సత్కరించిన కారెం శివాజీ
సాక్షి, రాజమహేంద్రవరం :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో నిర్వహించిన సుడిగాలి పర్యటన నిరసనల మధ్య సాగింది. ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పలువురు మహిళలు పలు ప్రశ్నలతో సీఎంను నిలదీయడానికి ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఎం కూడా అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధితులు నినాదాలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో గురజాల అక్కమ్మతల్లి ఆలయాన్ని కొందరుక కూల్చివేసి స్థలాన్ని ఆక్రమించారని, న్యాయం చేయాలని సీఎం పాదయాత్ర సందర్భంగా గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన తెలి పారు. పోలీసులువ వీరిని మందలించి ప్లకార్డులను లాక్కున్నారు.
ఆలస్యంగా ప్రారంభం...
ముందుగా నిర్ణయించిన ప్రకారంకన్నా గంటన్నర ఆలస్యంగా పర్యటన సాగింది. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా రాజమహేద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఎం పరిపాలన భవనాన్ని ప్రారంభించి, 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ జైలులో వృత్తులు నేర్చుకుని విడదలైన తరువాత ఉపాధి పొందాలని సూచించారు. శాటిలైట్ సిటీలో జన చైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించే రైతు బజారు, చేపల మార్కెట్‌కు శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. బాబు జగ్జీవ¯ŒSరామ్, ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం చెరుకూరి కల్యాణ మండంలో తెలుగు దేశం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. మున్సిపల్ స్టేడియంలో డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మొబైల్ నగదు రహిత లావాదేవీలు జరిపేలా పరిజ్ఞానం పెంచుకోవాలంటూ తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో లైట్లు ఆ¯ŒS చేసి చూపాలని మహిళలను కోరారు. కారెం శివాజీ ఆధ్వర్యంలో జరిగిన దళితగిరిజన సభలో మాట్లాడుతూ దళిత సంక్షేమమే ధ్యే యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబును దళిత, గిరిజన నేతలు సన్మానించారు. సాయంత్రం దివా¯ŒSచెరువులో నగర వనాన్ని ప్రారంభించారు. అటవీ అకాడమీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్ భవనాలను ప్రారంభించారు. చివరగా జీఎస్ఎల్ డెంటల్ కళాశాలను ప్రారంభించారు. ఎంపీలు ఎం.మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, అప్పారావు, చైతన్యరాజు, మేయర్ పంతం రజనీశేషసాయి, జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒS తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళలతో ముఖాముఖి : స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి కార్యక్రమానికి అధికారులు ఉభయగోదావరి జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో భోజన ం, జనచైతన్య యాత్ర సభలో పాల్గొన్న ప్రజలకు పులిహోర ప్యాకెట్లు అందించిన నేతలు మహిళలకు బిస్కెట్లు పంచారు. అవికూడా అందిరికీ ఇవ్వకపోవడంతో చిన్నపిల్లతో వచ్చిన మహిళలు ఆకలితో ఇబ్బంది పడ్డారు. ప్రకటించిన విధంగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈపీల జీతం రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, శ్రీరాములు సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మార్గాని సత్యనారాయణ విజ్ఞాపన పత్రం ఇచ్చారు.