Increased demand
-
వామ్మో ఏమా చికెన్ ధరలు.. నెల క్రితం రూ.200, ఇప్పుడు ఏకంగా..!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. శుభకార్యాల వేళ ధర పెరగడంతో ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ధరలతోపాటు వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గటం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం చికెన్ కిలో ధర రూ.200 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 పెరిగిపోయింది. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్ వంటి పెద్ద ప్రాంగణాల్లో స్కిన్ రూ.290 స్కిన్లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తుండగా.. సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. వేసవి.. ఆపై శుభకార్యాలు వేసవి సీజన్లో సాధారణంగా చికెన్ ధర పెరగటం సహజం. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉండటం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవటం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. గుడ్డు ధరలూ పెరిగాయ్ కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోడిగుడ్లు అమ్మే దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత నెలలో పాతిక గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించారు. ఇప్పుడు 25 కోడిగుడ్లు రూ.135కు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తుండగా.. రిటైల్‌గా ఒక్కొక్కటి రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లో ఆదివారం 25 గుడ్లు రూ.127 ధర పలికాయి. -
పెట్రో, డీజిల్.. డబుల్!
నగరవాసులు పెట్రోల్, డీజిల్‌ను భారీగా వాడేస్తున్నారు. రోజుకు ఏకంగా 50 లక్షల లీటర్ల పెట్రోల్, 55 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. 2014లో రోజుకు 20 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగేవి. పెరుగుతున్న జనాభా, ప్రజా రవాణా మెరుగు పడకపోవడం కారణం. సాక్షి, హైదరాబాద్ : విశ్వ నగరం వైపు పరుగుతీస్తున్న హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ వినియోగం ఐదేళ్లలో రెండింతలైంది. పెరుగుతున్న జనవాహినికి తోడు ప్రజా రవాణా ఆశించినంత స్థాయిలో మెరుగు పడ లేదు. మెట్రో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో వచ్చినప్పటికీ వ్యక్తిగత వాహనాలు దూకుడు పెంచాయి. బ్యాంకులతో పాటు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తుండటంతో నగరవాసుల సొంత వాహనాల సంఖ్య అర కోటికిపైగా దాటింది. ఇవి కాలుష్యం వెదజల్లుతుండటంతో పర్యావరణ వేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపైన అమ్మకాలు ... హైదరాబాద్ మహా నగరంలో ఐదేళ్లలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు రెట్టింపయ్యాయి. 2014లో హైదరాబాద్ నగరంలో దినసరి అమ్మకాలు పరిశీలిస్తే పెట్రోలు సగటున 20 నుంచి 25 లక్షల లీటర్లు, డీజిల్ 30 నుంచి 33 లక్షల లీటర్లు ఉండగా, 2019 నాటికి పెట్రోల్ 42 నుంచి 50 లక్షల లీటర్లు, డీజిల్ 50 నుంచి 55 లక్షల లీటర్లకు చేరాయి. పెరుగుతున్న పెట్రోల్ ఉత్పత్తుల వినియోగానికి తోడు బంకుల సంఖ్య కూడా పెరిగింది ఐదేళ్ల క్రితం 447 ఉన్న పెట్రోల్ బంకుల సంఖ్య 650కు పైగా చేరగా, వాహనాల సంఖ్య 39 లక్షల నుంచి 61 లక్షలకు ఎగబాగింది. హైదరాబాద్ వాటా 60% పైనే.. రాష్ట్రంలోనే పెట్రో ఉత్పత్తుల వినియోగంలో హైదరాబాద్ మహానగర వాటా 60% పైనే ఉంటుంది. ఐదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నెలసరి పెట్రోల్ వినియోగం సగటున 92,473 కిలో లీటర్లు ఉండగా హైదరాబాద్ నగర వాటా 50,317 కిలో లీటర్లు. డీజిల్ వినియోగం రాష్ట్రం మొత్తం మీద 1,98,550 కిలో లీటర్లు ఉండగా అందులో హైదరాబాద్ నగర వాటా 79,371 కిలో లీటర్లు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు వినియోగం 1,32,219 కిలో లీటర్లు కాగా, నగర వాటా 95,512 కిలో లీటర్లు. అదేవిధంగా డీజిల్ వినియోగం 2,84,429 కిలో లీటర్లు ఉండగా అందులో నగర వాటా 1,14,461 కిలో లీటర్లు. ప్రతినిత్యం 200 ట్యాంకర్లపైనే నగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి బంకుల డిమాండ్‌ను బట్టి ప్రతిరోజు 150 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంటోంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉం టాయి. నగరంలో వివిధ రకాల వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే సుమారు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. పెట్రోల్‌లో 9వ స్థానం.. డీజిల్‌లో 10వ స్థానం దేశంలోనే పెట్రోల్ వినియోగంలో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉండగా, డీజిల్ వినియోగంలో 10వ స్థానంలో ఉన్నట్లు ఆయిల్ కంపెనీల నివేదికలు చెప్తున్నాయి. పెట్రోల్‌లో మహారాష్ట్ర, డీజిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లు మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. అగ్రభాగంలో ద్విచక్రవాహనాలు.. పెట్రోల్ వినియోగంలో ద్విచక్ర వాహనాలు అగ్రభాగంలో ఉన్నాయి. మొత్తం వినియో గంలో వీటిది 62.39 శాతం, కార్లు, జీపులు, 27.04%, 3 చక్రాల వాహనాలు 5.17%, ఇతర వాహనాలు 5.39% వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. డీజిల్ వినియోగంలో బస్సులు, హెవీ, లైట్ వాహనాలు 43.96 %, కార్లు, జీపులు 16.47%, మూడు చక్రాల ప్యాసింజర్ వాహనాలు 9.2 %, వాణిజ్య పరమైన వాహనాలు 6.59 % వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద రవాణాకు 76.28%, ఇతరాలకు 23.72 % డీజిల్ వినియోగిస్తున్నట్లు ఆయిల్ కంపెనీల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
అద్దెల మోత..!
రాజధానిలో సామాన్యుడికి భారంగా మారిన అద్దె ఇల్లు ఇళ్లు తక్కువగా ఉండడంతో పెరిగిన డిమాండ్ అద్దెలు పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వ్యాపార సముదాయాలకు మరింత డిమాండ్ ఆ గ్రామానికి కచ్చితమైన బస్సు సౌకర్యం లేదు.. రైలు మార్గం అంతకన్నా లేదు... వినోదానికి సినిమా థియేటర్లు లేవు... ఆహ్లాదానికి విశేషమైన పార్కులు, రిసార్టులు లేవు... అది పర్యాటక ప్రాంతమూ కాదు... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కానే కాదు... ఇక విశాలమైన రహదారులు లేవు.. సమస్యల్లేని డ్రైనేజీ వ్యవస్థ లేదు. కానీ అక్కడి అద్దెలు మాత్రం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇదీ గుంటూరు జిల్లా తుళ్లూరులో పరిస్థితి. - సాక్షి, గుంటూరు నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు పేరు ప్రకటించగానే అక్కడి స్థలాలకు భారీగా విలువ పెరిగిపోయింది. పంట పొలాలు ఎకరా కోట్లల్లో పలికింది. నివాస స్థలాలైతే కాస్మొపాలిటన్ సిటీలకు తీసిపోని ధరలు పలుకుతున్నాయి. మొదట్లో ఎకరం పొలం రూ. కోటి నుంచి కోటిన్నర వరకు పలికింది. అద్భుతమైన భవనాలు లేకున్నా రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఇంటి అద్దె నెలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు పలుకుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అయితే నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు చెబుతున్నారు. ఆరునెలలు అద్దె ముందుగానే చెల్లించాలని డిమాండ్చేస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే ఖాళీస్థలాలున్న కొంతమంది ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీస్థలాలను లీజుకు సైతం ఇస్తున్నారు. చివరకు పశువుల పాకలను సైతం కార్యాలయాలుగా మార్చి అద్దెలకు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల చిన్నపాటి వేతన జీవుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రానురాను అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమవుతుందని భావించిన అనేక మంది ఒక్క గది ఉన్న ఇంటిని సైతం రూ. 5వేల నుంచి 8 వేల వరకూ చెల్లిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఈ అద్దెలు భరించలేక అక్కడకి దగ్గరలో ఉన్న పల్లెల్లో అద్దెకు ఉంటూ రోజూ తుళ్లూరు వెళ్ళి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. తుళ్లూరు, సమీప ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అధికంగా జరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికులు అధిక ధరలు చెల్లించి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవీ కారణాలు ►రాజధాని ప్రాంతంలో ఇప్పటినుంచే వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించడం. ► బ్యాంకులు, వివిధ నగదు లావాదేవీల కార్యాలయాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తుండటం. ► రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, వివిధ వ్యాపార షోరూమ్లకోసం ఇప్పటినుంచే భవనాలను వెదుకుతుండటం. ► ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం... అందులో పనిచేసే సిబ్బంది ఇక్కడే మకాం పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడడం. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు ఇలా.. గుంటూరు నగరంలో సింగిల్ బెడ్రూమ్, లేదా మూడుగదులు ఉన్న ఇంటి అద్దె రూ. 5 వేల నుంచి 6 వేలవరకూ... డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శ్యామలానగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకూ... అరండల్‌పేట, బ్రాడీపేట, లక్ష్మీపురంలో రూ. 9 వేల నుంచి రూ. 14 వేల వరకూ... విద్యానగర్, ఎస్వీఎన్ కాలనీ, సిద్ధార్ధనగర్‌లో రూ. 7 వేల నుంచి రూ. 12 వేల వరకూ ఉన్నాయి. గుంటూరు వన్‌టౌన్‌లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉంది. మంగళగిరిలో సైతం అద్దెలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏరియాను బట్టి రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకూ ఉన్నాయి. మామూలు మూడు గదుల ఇల్లులే రూ. 5 వేలు అద్దె చెబుతున్నారు. విజయవాడలోని పటమటలో డబుల్బెడ్రూమ్ రూ. 12వేలు, ట్రిపుల్బెడ్రూమ్ 19వేలు, లబ్బీపేట, మొగల్రాజపురంలో రూ. పదివేలు, రూ. 16వేలు, మాచవరంలో రూ. 8,500, రూ. 14,000 ఉంది. ఇక వన్‌టౌన్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ. 9,500, ట్రిపుల్బెడ్రూమ్ రూ. 12,000 ఉన్నాయి. -
కాసులు కురిపిస్తున్న కందులు, మినుములు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మార్కెట్లో కందులు, మినుముల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నా యి. దీంతో ఈ పంటలు సాగుచేసిన రైతుల కు లాభాల పంట పండుతోంది. మన ప్రాం తంలో సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సీమాంధ్ర లో పంట నీటిపాలు కావడంతో మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ పెరిగింది. దీంతో కందులు, మినుములను సాగుచేసిన రైతులకు ఈ రెండు పంటలు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అంతర పంటగా సాగు... పసుపు, సజ్జ, ఎర్రజొన్న సాగుచేసే భూము ల్లో కంది పంటను అంతర్ పంటగానే రైతు లు సాగుచేస్తున్నారు. పంట పొలాల ఒడ్ల వెంబడి కంది పంటను సాగుచేయడం ఎం తో కాలంగా జరుగుతోంది. మినుము పం టను మాత్రం రైతులు ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు.బాల్కొండ,మోర్తాడ్,కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి మండలాల్లో కందులు, మినుములను రైతులు ఈ సీజనులో తక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. ధరలిలా.. గతంలో క్వింటాలు మినుములకు రూ.3 వేల ధర పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ.వెయ్యి ధర పెరిగింది. మినుములను నిజామాబాద్ మార్కెట్లోని వ్యాపారులు క్వింటాలుకు రూ.4 వేల ధర చెల్లిస్తున్నారు. కందులకు గతేడాది క్వింటాలుకు రూ.2,800 ధర లభించింది. ఈసారి క్వింటాలు కందులకు రూ.3 వేల నుం చి రూ.3,700 ధర పలుకుతోంది. రబీ సీజను లో కూడా పప్పు ధాన్యాలను సాగుచేసే వీలు ఉన్నా ఎక్కువ మంది రైతులు సజ్జ, ఎర్రజొన్న పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు. సజ్జ, ఎర్రజొన్న పంటలకు సీడ్ వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించడానికి గ్రామాలలో ధర ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. దీంతో నిజామాబాద్ మార్కెట్‌కు విక్రయానికి తక్కువ పరిమాణంలో మినుములు, కందుల వస్తున్నాయి. మార్కెట్లో పప్పు ధాన్యాలకు ధర పెరగడంతో ముందు, ముందు పప్పుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులకు పప్పు ధాన్యాల మద్దతు ధరను ప్రభుత్వం పెంచిన కారణంగా పప్పుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కందులు, మినుములకు భారీగా ధర పలుకుతుండటంతో రైతులు వీటిని నిలువ ఉంచకుండానే విక్రయిస్తున్నారు. వ్యాపారులు పోటీపడి నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.