indravelli mandal
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఆ గ్రామంలో పెరుగుతున్న క్యాన్సర్, కిడ్నీ మరణాలు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): మండలంలోని శంకర్‌గూడ గ్రామస్తులను క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు పట్టి పీడీస్తున్నాయి. 15 ఏళ్లుగా గ్రామంలో సాధారణ మరణాల కంటే క్యాన్సర్, కిడ్నీ మరణాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యా ధులతో తక్కువ వయస్సు ఉన్న వారు మృతి చెందుతుండడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. అంతేకా కుం డా వ్యాధులు రావడానికి కారణాలు తె లియక సతమతమవుతున్నారు. మరణాలపై దృష్టి సారించాల్సిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 15 ఏళ్లలో క్యాన్సర్‌తో 16 మంది.. మండలంలోని శంకర్‌గూడ గ్రామ జనాభా సుమారు 450. గిరిజన గిరిజనేతర 95 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో వావల్కార్ లలితబాయి (45), గుట్టె ప్రకాష్(52), గుట్టె రామరావ్(62), దేవ్కతే అంజనాబాయి (45), అబ్దుల్ హక్(40), జాధవ్ దర్గాజీ (60), గుబ్నార్ నిలాబాయి(45), కోరెంగా మెగ్నాథ్(41), వవాల్కర్ లలిత(40), మదినే ముక్తబాయి (60), పెం దోర్ శ్యామ్‌బాయి(45), ఆడ కర్ణుబాయి(50)లు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కోడలు జవాదే బార్జబాయి(60), జవాదే బా లాజీ(42), జవాదే శకుంతలబాయి(40)లు సహితం క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. కాగా ఈ నెల 12న గుబ్నార్ సతీష్(34)లు క్యా న్సర్‌తో మృతి చెందాడు. వీరే కాకుండా పలు వురు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. దుర్గం పోశమ్మబాయి(60) క్యాన్సర్ వ్యాధితో మంచం ప ట్టగా, వవాల్కార్ గాయబాయి(50) క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ యశోధ ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో ముగ్గురు మృతి.. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో కుడా ఇప్పటి వరకు చరక్ వెంకటి(45), జయబాయ్ కొండబాయి(50), వవాల్కర్ సందిపాన్(45)లు మరణిం చారు. చరక్ విష్ణుకాంత్(40), మదినే ప్రేమ్బా యి(50), అర్జునే మలాన్బాయి(52), పాండ్గే రుఖ్మబాయి(48)లు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరి ఆరో గ్యం విషమించి గ్రామంలో మంచాలకు పరి మితమయ్యారు. తక్కువ వయస్సులోనే అనేక మంది మృతి చెందడంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని వాపోతున్నారు. వ్యాధులు రావడానికి కారణాలు..? క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు రావడానికి అసలు కారణాలు తెలియకపోవడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే గ్రామంలో వ్యాధులు రావడానికి ముఖ్యంగా చేతిపంపుల కలుషిత నీరే కారణమని, గ్రామంలో ఉన్న చేతి పంపుల్లో సున్నపు (తెల్లని) రంగుతో కూడిన బురద నీరు వస్తుందని, ఆ నీరు తాగిన వారు అనారోగ్యానికి గురి కావడంతో పాటు క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమిస్తే మరణిస్తున్నారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటివరకు మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి గ్రామంలో వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య నిపుణులు నీటిని పరీక్షించాలి మా గ్రామంలో ప్రతి ఏడాది క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి వైద్య నిపుణులతో గ్రామంలో తాగు నీటిని పరిక్షించాలి. వ్యాధులు రావడానికి గల అసలు కారణాలను గుర్తించాలి. – ఆత్రం అశోక్, గ్రామస్తుడు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం మా తల్లి వవాల్కర్ గాయబాయి గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యం ఖర్చులు భరించలేక పోతున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – వవాల్కర్ రమాకాంత్, గ్రామస్తుడు -
ఘోర రోడ్డు ప్రమాదం
ఇంద్రవెల్లి/ఆదిలాబాద్ రిమ్స్ : ఇంద్రవెల్లి మండలం ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. ఎస్సై హనోక్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల వైపు వెళ్తోంది. లక్సెట్టిపేట నుంచి ఐచర్ వాహనం బియ్యం లోడ్‌తో ఆదిలాబాద్ వైపు వెళ్తోంది. మండలంలోని ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ మధ్య ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్ రాంచందర్‌తోపాటు ప్రయాణికులు ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత(కేస్లాపూర్ పాఠశాల), నస్రీమ్‌బేగం(నార్నూర్ ఉర్దూ మీడియం పాఠశాల), రజితారెడ్డి(ఇంద్రవెల్లి ఏహెచ్ఎస్), సరస్వతీ(పిట్టబొం గరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు), ఆదిలాబాద్‌కు చెందిన శైలజ తీవ్రం గా గాయపడ్డారు. వీరితోపాటు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. శంకర్‌గూడ, ఇన్కార్‌గూడ గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108, ప్రైవేటు వాహనాల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘట న స్థలంలో క్షతగాత్రులను ఆది లాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న ఎంపీ గెడం నగేష్ పరామర్శించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమా దం జరిగిందని ఎస్సై హనోక్ తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. రిమ్స్‌లో చికిత్స రోడ్డు ప్రమాద క్షతగాత్రులు సుమారు 20 మందిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రి నిండిపోయింది. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత, నస్రీన్బేగంతోపాటు డ్రైవర్ రాంచందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ పరామర్శించారు. ప్రమాద బాధితులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఎమర్జెన్సీ వార్డు ఎదుట టూటౌన్ సీఐ బుచ్చిరెడ్డి, ఎస్సై రాములు బందోబస్తు ఏర్పాటు చేశారు.