స్విమ్మింగ్ చాంప్ ధీరజ్ ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: సంగం సహోదయ క్లస్టర్ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ పీటర్స్ హైస్కూల్ విద్యార్థి ఎం.ధీరజ్ ఆదిత్య సత్తా చాటాడు. సైనిక్‌పురిలోని ఇండస్ వరల్డ్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో అతను 25 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందాడు. పదేళ్లలోపు బాలుర విభాగంలో జరిగిన ఈ పోటీలో హిమాన్షు (డీపీఎస్ నాచారం) రజతం నెగ్గగా, విఘ్నేశ్ (ఇండస్ వరల్డ్ స్కూల్) కాంస్య పతకం నెగ్గాడు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 14 స్కూలు జట్లు తలపడ్డాయి. స్విమ్మింగ్‌తో పాటు అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పదేళ్లలోపు బాలబాలికల విభాగం నుంచి అండర్-19 విభాగం వరకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. పెద్దసంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈవెంట్‌ను విజయవంతం చేశారని ఇండస్ వరల్డ్ స్కూల్ ప్రతినిధులు తెలిపారు.