గోవాడ సుగర్స్‌లో అవినీతిపై విచారణ
విచారణ అధికారిగా జేసీ నియామకం?
ఆరోపణలపై నిలదీసిన వైఎస్సార్సీపీ
తొలుత స్పందించని సర్కారు
మహాజన సభ నేపథ్యంలో నియామకానికి అంగీకారం
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతి రోపణలపై రాష్ర్టప్రభుత్వం విచారణ కమిటీని వేసినట్టు తెలిసింది. హుద్‌హుద్ తుఫాన్లో వ ఫ్యాక్టరీకి చెందిన పంచదార నిల్వల గొడౌన్ల పైకప్పులు దెబ్బతిని 2.15లక్షలక్వింటాళ్ల పంచదార బస్తాలు తడిపోయిన విషయం తెలిసిందే. ఇందులో కశింకోట సిడబ్ల్యుసి గొడౌన్లో తడిసిపోయిన 1.19లక్షల క్వింటాళ్ల పంచదార అమ్మకాలు, ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ వేసిన టెండర్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు తలెత్తాయి. సుమారు రూ.8కోట్ల మేర చేతులు మారాయంటూ వైఎస్సార్సీపీ,సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, రైతులు సంఘాలు, యువజన సంఘాలు ఆరోపించాయి. రిలేదీక్షలు, ఆందోళనలు కూడా చేశాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ 10వేల సభ్యరైతుల సంతకాలు కూడా సేకరించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ అవినీతి ఆరోపణపై విచారిచాలంటూ చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాల ఆందోళనపై ఇప్పటి వరకు మోనంగా ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే ఫిర్యాదును కూడా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఈనెల 30న ఫ్యాక్టరీ మహాజన సభ ఉంది. ఇందులో సభ్యరైతులు ఈ విషయమై ప్రశ్నించే అవకాశముంది. దీంతో కనీసం విచారణ కమిటీ వేసినా కొంత బయటపడవచ్చునని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిపై మరింత ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం విచారణకు ఒప్పుకున్నట్టు సమాచారం. జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి సోమవారం ఆదేశాలు రావడంతో జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించినట్టు తెలిసింది.