అంజలి- జై రియల్ జర్నీ కన్ఫాం?
జర్నీ సినిమాతో ఆకట్టుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ మధ్య కుటుంబ కలహాలు, వివాదాలతో హాట్ టాపిక్‌గా మారి ఫామ్ కోల్పోయింది.. ఇండస్ట్రీలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయి...కరియర్ లో కష్టాలను ఎదుర్కొంంటూ మెల్లిగా కరియర్‌ను నెట్టుకొస్తోంది ఈ గీతాంజలి భామ. అయితే ఆ తరువాత అంజలి లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ అయ్యింది 'జర్నీ' హీరో జై తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.
ఇపుడిదే వార్త మరోసారి తెరపైకి వచ్చింది. జ్యోతిక నటించిన ‘మగలిర్ ముట్టుమ్' అనే చిత్రం టీజర్ రిలీజ్ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ , జ్యోతిక భర్త విసిరిన దోశ ఛాలెంజ్ వీరిద్దరి సన్నిహిత స్నేహాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇంట్లో అందరి కోసం దోశెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అన్న సూర్య ఛాలెంజ్ ను ఈ రీల్ జంట స్వీకరించడం.. ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. వీరిద్దరి లవ్ రిలేషన్ షిప్ అనుమానానికి మరింత బలాన్నిచ్చింది. ఎంగెయుం ఎప్పొత్తుం సినిమాలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించిన ఈ జంట ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోనున్నారని కోలివుడ్ టాక్.
తమిళ నటుడు జై అంజలి కోసం దోశె వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి ప్రతిగా అంజలి యమ్మీ దోశె అంటూ స్పందించింది. ‘రుచికరమైన దోశె జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బావుంటుందో' అని అంజలి ట్వీట్ చేశారు. అదీ సంగతి. వీరిద్దరి ఈ ఆసక్తికర ట్వీట్స్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రీల్ జంట మధ్య సాన్నిహిత్యం మరింత ముదిరిందనీ, కలిసే వుంటున్నారని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి బాజాలు మోగనున్నాయంటూ కోలివుడ్ కోడై కూస్తోంది. అయితే గతంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో తమ ప్రేమ పుకార్లను ఖండించిన అంజలి, జై ..తాజా రూమర్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం ఇంట్లో దోశె వేసి ‘దోశె ఛాలెంజ్' అంటూ పలువురు సినీ ప్రముఖులను ట్యాగ్ చేశారు. దీనికి ట్విట్టర్ లో స్పందన భారీగానే వచ్చిన సంగతి తెలిసిందే. అటు లేటెస్ట్ మూవీ ఎనక్కు ఎంగుయుమ్ ఎప్పొత్తుం సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జై, ప్రస్తుతం బెలూన్ అనే తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Here we go na! #MMDosaChallenge completed succefully @vp_offl @Suriya_offl @yoursanjali
Yummm ,, Tasty dosa J ,, lovely to see your dearest one cooking fr you ☺️☺️#MMDosaChallenge #MagalirMattum https://t.co/E9C6sVcad9
— Anjali (@yoursanjali) February 7, 2017
#MMDosaWithLove #MagalirMattum #DosaChallenge