'ఆ డైమండ్ రింగ్ నాకెంతో ప్రత్యేకం'
లాస్ ఏంజిల్స్: అమెరికా అందాల నటి సోఫియా వెర్ గరా తన ఎంగేజ్ మెంట్ రింగ్ విశేషాలను పంచుకుంది. తమ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నది. 'మ్యాజిక్ మైక్' స్టార్ జోయ్ మంగనెల్లోతో గత డిసెంబర్లో ఈ భామ నిశ్చితార్ధం జరిగిందన్న విషయం అందరికి విదితమే. వచ్చే నెలలో జరగనున్న తన వివాహానికి రెడీ అవుతోంది సోఫియా. కాబోయే భర్త మంగనెల్లో గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ చెప్పుకొచ్చింది. ప్రపోజ్ చేసిన టైంలో రింగ్ గురించి తను పెద్దగా పట్టించుకోలేదట.
ఎంగేజ్మెంట్ గిఫ్ట్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పింది. డైమండ్ రింగ్ తమ ప్రేమకు నిదర్శనమని, అందుకే తనకు ఈ గిఫ్ట్ ఇచ్చాడని సోఫియా అంటోంది. మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేయడానికి భారీ ప్లానింగ్ జరుగుతోందని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న రెడ్ కార్పెట్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పింది. తమ కుటుంబం చాలా పెద్దదని, తమ పెళ్లి కోసం చేస్తున్న ఏర్పాట్లు ఎప్పటికీ గుర్తుగా నిలిచి పోతాయని అంటోన్నది. పెళ్లి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది సోఫియా.