kanyaka
-
రూ. 49కే ఓటీటీలో 'కన్యక' సినిమా
శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్‌పై Bcineet అనే స్ట్రీమింగ్ సంస్థ నిర్మించిన చిత్రం 'కన్యక'. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల అయింది. ఏపీలోని నకరికల్లు, నరసరావుపేట, చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుందని నిర్మాతలు KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు.కన్యక సినిమా ఆడియోతో పాటు ట్రైలర్ మెప్పించేలా ఉంది. ఈ చిత్రానికి రాఘవేంద్ర తిరువాయిపాటి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రాన్ని Bcineet OTTలో డైరెక్ట్‌గా చూడొచ్చని మేకర్స్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కన్యక చిత్రాన్ని చూడాలంటే కేవలం రూ. 49 చెల్లించి చూడొచ్చని నిర్మాతలు ప్రకటించారు. -
వాసవీ మాతకు స్వర్ణ కవచం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : స్థానిక అగ్రహారంలోని శ్రీ నగరేశ్వరస్వామి ఆలయంలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి కనకపు కవచం అందించనున్నట్టు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాసవీ సుబ్బారావు, సోమిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన స్వర్ణ శిల్ప కళాకారులు మూడు నెలల నుంచి కవచాన్ని రూపొందిస్తున్నారని, 10 రోజులుగా స్థానిక కన్యకాపరమేశ్వరి సత్రంలో ఉంటూ కవచానికి తుది మెరుగులు పెడుతున్నారని తెలిపారు. స్వర్ణ కవచంతో పాటు అమ్మవారికి రజత కవచం కూడా తయారు చేస్తున్నట్టు వివరించారు. ఈ కవచాలను విజయదశమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అలంకరించడానికి ఆలయానికి సమర్పిస్తామని తెలిపారు.