రూ. 49కే ఓటీటీలో 'కన్యక' సినిమా | Kanyaka Telugu Movie Streaming In Bcineet OTT, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

Kanyaka In Bcineet OTT: రూ. 49కే ఓటీటీలో 'కన్యక' సినిమా

Published Tue, Aug 27 2024 11:17 AM | Last Updated on Tue, Aug 27 2024 1:16 PM

Kanyaka Movie Streaming In Bcineet OTT

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్‌పై Bcineet అనే స్ట్రీమింగ్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'కన్యక'. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల అయింది. ఏపీలోని నకరికల్లు, నరసరావుపేట, చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుందని నిర్మాతలు  KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు.

కన్యక సినిమా ఆడియోతో పాటు ట్రైలర్‌ మెప్పించేలా ఉంది. ఈ చిత్రానికి రాఘవేంద్ర తిరువాయిపాటి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రాన్ని Bcineet OTTలో డైరెక్ట్‌గా చూడొచ్చని మేకర్స్‌ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. కన్యక చిత్రాన్ని చూడాలంటే కేవలం రూ. 49 చెల్లించి చూడొచ్చని నిర్మాతలు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement