Karimnagar Express
-
తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్‌ప్రెస్
యార్డు లైన్లో మూడోసారి ఘటన అప్రమత్తత కావడంలో అధికారుల నిర్లక్ష్యం తిరుపతి : తిరుపతి రైల్వేస్టేషన్‌లోని యార్డు లైన్లో శనివారం రాత్రి కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఖాళీ బోగీలతో పట్టాలు తప్పింది. తిరుపతి యార్డు లైన్లలో ఖాళీ బోగీల రైళ్లు పట్టాలు తప్పడం ఇది మూడోసారి. రెండునెలల క్రితం వారం వ్యవధిలోనే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌లు ఇదే యార్డు లైన్లలో పట్టాలు తప్పాయి. ఆ రెండు సంఘటనలకు భిన్నంగా శనివారం రాత్రి జరిగిన ఘటనలో భారీ నష్టం వాటిల్లింది. ఇందులో ట్రాక్ ఎలక్ట్రికల్ పరికరాలతో సహా బోగీకి అమర్చిన బ్యాటరీ బాక్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పట్టాలు కూడా కొంతమేరకు విరిగిపోయాయి. పట్టాల మధ్య అమర్చిన సిమెంట్ దిమ్మెలు ఎక్కువ స్థాయిలో ధ్వంసమయ్యాయి. సుమారు రూ.25లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి 10.40 గంటలకు తిరుపతిలో బయలుదేరాల్సి వుంది. ఈ నేపధ్యంలో ఖాళీ బోగీలను యార్డులైన్లలలో నుంచి రాత్రి 9 గంటలకు రైలును ప్లాట్‌ఫారాలపైకి తరలిస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇంజన్ నుంచి మూడవ బోగి (జనరల్ బోగి) పూర్తిగా పట్టాలు తప్పడంతో పట్టాలకు అడ్డంగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు ధ్వంసమయ్యాయి. అలాగే బోగీల మధ్య పటిష్టత కోసం ఏర్పాటు చేసిన అయస్కాంత రాడ్లు కూడా విరిగిపోయాయి. ఇటీవల యార్డు లైన్లలో రైళ్లు పట్టాలు తప్పడం సర్వసాధారణంగా మారడాన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా మరో ఘటనకు అవకాశం కలిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి నుంచి రేణిగుంట మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర ఘటన జరగడంతో చిమ్మచీకట్లు కారణంగా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేయలేకపోయారు. రాత్రి 10:10 గంటలకు రేణిగుంట నుంచి బోగీలను మరమ్మతు చేసి పట్టాలపై నుంచి తొలగించేందుకు అవసరమైన యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్(ఏఆర్టీ) వాహనం వచ్చాక సహాయక చర్యలను ప్రారంభించారు. సంఘటన తెలిసిన వెంటనే స్టేషన్ మేనేజర్ సుభోద్‌మిత్ర, ఆర్పీఎఫ్ సీఐ నాగార్జునరావుతో పాటు రైల్వే పోలీసు సిబ్బంది, రైల్వే సేఫ్టీ, ఎలక్ట్రికల్, కోచ్ డిపో అధికారులు హుటాహుటిన చేరుకుని సంఘటన వివరాలను సేకరించారు. ప్రయాణికుల అవస్థలు కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా నడుస్తోంది. ఈనేపధ్యంలో శనివారం రాత్రి యార్డులైన్‌లో పట్టాలు తప్పడంతో రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన ఈరైలు సకాలానికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విజయవాడ వెళ్లాల్సినవారు రైల్వే స్టేషన్లో నిరీక్షించారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంట్లో ప్రవేశించిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు మరోసారి మొండిచేయి చూపారు. కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలని చేసిన ప్రతిపాదన ప్రస్తావనకే రాలేదు. ఇక కాజీపేటలో రైల్వే వ్యాగన్‌షెడ్ కోచ్ ప్యాక్టరీ మంజూరవుందని ఎన్నో కలలు కన్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్లో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధి ప్రస్తావనే రాలేదు. కాజీపేట మీదుగా వెళ్తున్న నాన్‌స్టాప్ రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పిస్తారని భావించిన ప్రయాణికుల ఆశలు గల్లంతయ్యాయి. పద్మావతి, కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరుపతికి రోజూ నడుపుతారనే ఆశలు ఫలిం చలేదు. కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ రూట్లలో కొత్త రైళ్ల ప్రస్తావనే రాలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మహిళలు, వికలాంగులకు అదనపు జనరల్ బోగీల విషయం పక్కన పెట్టారు. కాజీపేట జంక్షన్లో నిర్మించబోయే 24 బోగీల ఫిట్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో పెండింగ్‌లో పడినట్లయింది. ఈ ఫిట్‌లైన్ వస్తే కాజీపేట జంక్షన్ నుంచే నేరుగా రెండు కొత్త రైళ్లను ప్రారంభించవచ్చు. జిల్లాలోని పెండింగ్ రైల్వే లైన్లు, సర్వే అయిన రైల్వే లైన్లకు నిధుల మంజూరు, కొత్త రైళ్ల ప్రస్తావన కూడా బడ్జెట్లో చోటు చేసుకోలేదు. బల్లార్షా నుంచి విజయవాడకు వయా కాజీపేట మీదుగా వెళ్లే మూడో రైల్వే లైన్ మార్గానికి నిధులు మంజూరు కాలేదు. కాగా, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఖర్గే ప్రకటించారు. రైల్వే కార్మికులు, రైల్వే కార్మికుల పిల్లలకు ఎలాంటి రైల్వే పథకాలు లేకపోవడంతో కార్మికులకు నిరాశే మిగిలింది. మొత్తానికి ఖర్గే రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రైళ్లతో ఊరట కొత్తగూడెం-లక్నో ఎక్స్‌ప్రెస్ రైలు జిల్లా మీదుగా వారం లో మూడు రోజులు. అలాగే, కాజీపేట మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వరకు వీక్లి రైలును ప్రవేశపెడుతున్నట్లు ఖర్గే బడ్జెట్లో ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎలాంటి రైలు చార్జీలు, రవాణా చార్జీలు పెంచడం లేదని చెప్పడంతో ప్రయాణికులు కొంత ఊరట చెందారు. ఫలించని ఎంపీల ప్రతిపాదనలు జిల్లాలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రైల్వే బోర్డుకు పంపించిన ఎంపీల ప్రతిపాదనలు ఫలించలేదు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు కావాలని, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ లు, రైళ్ల పొడిగింపు అంశాలపై చేసిన ప్రతిపాదనలు ఖర్గే బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు.