కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి
విశాఖపట్నం: పాయకరావుపేట మండలం కేశవరంలో కెమికల్ ఫ్యాక్టరీలో ఈ తెల్లవారుజామున రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ, తుని ఆస్పత్రులకు తరలించారు.
మృతి చెందినవారిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సుబ్బారావు, వి.రాముగా గుర్తించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. నర్సీపట్నం ఆర్టీఓ సూర్యారావు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.