అమెరికన్ రెజ్లర్‌తో సంగ్రామ్ పోరు నేడు
న్యూఢిల్లీ: కె.డి.జాదవ్ స్మారక అంతర్జాతీయ కుస్తీ చాంపియన్‌షిప్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ కెవిన్ ర్యాడ్‌ఫోర్డ్ జూనియర్‌తో సంగ్రామ్ సింగ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. శుక్రవారం ఇద్దరి మధ్య ఆసక్తికర సమరం జరుగనుంది. ఈ రెజ్లింగ్ ఫైట్ కాస్త భిన్నమైన ఫార్మాట్లో ఆరు రౌండ్ల పాటు జరుగుతుంది.
ఒక్కో రౌండ్ మూడు నిమిషాల పాటు సాగుతుంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకం అందించిన దివంగత రెజ్లర్ జాదవ్ పేరిట నిర్వహించే ఈ ఈవెంట్ విజయవంతం కావాలని నిర్వాహకులు భావిస్తున్నారు.