రాష్ట్రంలో తొమ్మిది చోట్ల మోడీ సభలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ర్టంలో తొమ్మిది బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నగరంలో నవ ంబరు 16న తొలి బహిరంగ సభ జరుగుతుంది. మల్లేBLP
శ్వరంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జనవరి 16లోగా అన్ని సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలనే విషయమై జిల్లా శాఖలతో చర్చించి రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుందని తెలిపారు.
దీనికి తోడు నవంబరు 20 నుంచి అన్ని లోక్సభ నియోజక వర్గాల్లో పార్టీ సమ్మేళనాలను నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా... మేధావులు, వృత్తి నిపుణులు, బీజేపీ మిత్రులతో కూడా సమావేశాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదే సందర్భంలో ఎన్డీఏ, యూపీఏల పాలనలను విశ్లేషించే పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్డీఏ హయాంలో ధరలు, ఇప్పటి రేట్లు, అప్పటి ప్రగతి, ఇప్పటి అభివృద్ధి గురించి ఇందులో వివరించామని వెంకయ్య నాయుడు వివరించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, ఎంపీ అనంత కుమార్లు పాల్గొన్నారు.