ఏ చట్టం ప్రకారం నిలువరిస్తున్నారు?
బాబుపై విరుచుకుపడిన ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అనేకమంది పాద యాత్రలు చేశారు. రోడ్లు తవ్వేసి మెత్తని తివాచీ వేయిం చుకొని చంద్రబాబు కూడా పాదయాత్రను చేపట్టారు. ఇవన్నీ 2009 తరువాత జరిగినవి కాదా? అప్పుడు ఏ రీతిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆ రూలు, నమూనా ఇస్తే నేనూ అదే దారిలో నడుస్తాను. అస్తమానూ మాకే రూల్స్ చెబుతారు... అంటే చట్టాలు, కోర్టులు వారికే చుట్టాలా? మాకు కాదా? అసలు ఏ రూలు ప్రకారం ఆపారు?’’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. గత నెల 26న అమలు చేసిన గృహ నిర్బంధం ఉత్తర్వులు బుధవారంతో ముగియడంతో గురువారం ఉదయం 9.30 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసం నుంచి పాదయాత్రను ప్రారం భించారు.ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ తప్పని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోక తప్పలేదు.