koheda
-
ఆసియాలోనే పెద్ద మార్కెట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ లే ఔట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్)కు టెండర్ అప్పగించామన్నారు. నమూనా లే ఔట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపామని, సోమవారం రెండు లే ఔట్లను పరిశీలించి, మార్పులు చేర్పులకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రముఖ మార్కెట్లైన ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్ కోట్, బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లేఔట్ల నమూనా తయారు చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో ఆర్ఆర్ఆర్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని ఆయన తెలిపారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్లో అపశ్రుతి.. కాబోయే జంటపై తేనెటీగల దాడి
ఇటీవలి కాలంలో ఫోటోషూట్లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్ షూట్ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్ పేరుతో ప్రమాదలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు. సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన అనురాగ్‌రెడ్డి, శివానికి వివాహం కుదిరింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఈనెల 11న కోహెడలోని ఔటర్ పరిసరాల్లోకి వచ్చారు. ఫొటో షూట్లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అదే రోజు సాయంత్రం డిశ్చార్జి అయినట్లు తెలిసింది. చదవండి: అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య? -
వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
కోహెడ రూరల్ (హుస్నాబాద్): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం) -
23లోగా తరలి వెళ్లాల్సిందే!.. ఎలా వెళ్లాలి?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23వ తేదీ వరకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పద్మహర్ష నేతృత్వంలో కమీషన్ ఏజెంట్ల సమావేశం ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ పరిధిలో నిర్వహించారు. సమావేశంలో పద్మహర్ష మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్ తరలింపు అనివార్యంగా మారిందన్నారు. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు బదలాయిస్తూ..తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోహెడలో మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంతవరకు తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో ప్రస్తుత మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వర్తించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించిందన్నారు. బాటసింగారంలో ఉన్న 11 ఎకరాల్లో రైతులకు, వ్యాపారులకు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23 లోపు మార్కెట్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అప్పగించాల్సి ఉందన్నారు. సౌకర్యాలు లేకుండా ఎలా వెళ్లాలి? రెండు వారాల్లో మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని కమీషన్ ఏజెంట్లు, అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కోహెడలో పక్కా నిర్మాణాలు చేస్తే ఎప్పుడైనా వెళ్లాడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు తరలింపును ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని, తరలింపు వ్యవహారం కోర్టు ఆ«దీనంలో ఉండడంతో తాము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం సమావేశంలో చెప్పలేమని, ఇలా చేస్తే కోర్టు నియమాలకు విరుద్ధంగా ఉంటుందన్నారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కు స్థలంలో కేవలం ఒకే ఒక్క షెడ్డు నిరి్మంచారని, ఇది వందల మంది రైతులకు ఎలా సరిపోతుందని ప్రశి్నంచారు. చివరకు ఏజెంట్ల వాదోపవాదాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. -
బావా బావమరుదుల ఈత సరదా.. రెండు ప్రాణాలు బలి
సాక్షి, కోహెడ(హుస్నాబాద్): చెక్‌డ్యాంలో సరదాగా ఈత దిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని పొరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకొంది. ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం పొరెడ్డిపల్లి గ్రామానికి ఎలుక ప్రశాంత్(21), డబే కుమారస్వామి(19)బావ బావమరుదులు. ఇద్దరు ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంత్ తండ్రి కనకయ్య పొలం వద్ద మోటరు పని చేయడం లేదని కొడుకును హైదరాబాద్ నుంచి రామన్నాడు. దీంతో ప్రశాంత్, కుమార స్వామితోపాటు మరో ముగ్గురు స్నేహితులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ భావి వద్ద మోటరు రిపేర్ చేసి బావి సమీపంలోని చెక్‌డ్యాం వద్దరు వచ్చారు. దీంతో సరదాగా ఒకరి తర్వాత ఒకరు నీటిలో దిగారు. లోతు గమనించిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. అంతలోపే ప్రశాంత్, కుమారస్వామి నీటిలో మునిగిపోయారు. వెంటనేరా ముగ్గురిలో ఒకరైన విజయ్‌కుమార్ అనే యువకుడు ప్రశాంత్, కుమారస్వామి మునిగిపోయిన విషయాన్ని 108కు, పోలీసులకు, ప్రశాంత్ తండ్రి కనకయ్యకు సమాచారం అందించి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి అక్కడి నుంచి ముగ్గురు వెళ్లిపోయారు. వెంటనే ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, తహసీల్దార్ రుక్మిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్ నుంచి ఈత వచ్చిన వారిని రప్పించి మునిగిన యువకులు మృతదేహాలను బయటకు తీశారు. నీట మునిగి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఇద్దరు వరుసకు బావ, బావమరుదులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రశాంత్ పొరెడ్డిపల్లి గ్రామం, కుమారస్వామిది దులి్మట్ట గ్రామం ఇద్దరి మృతదేహాలకు శవ పరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గొడవ ఆపండ్రా బాబు ... పోలీసులపై దాడి
-
తాగుబోతుల వీరంగం, అడ్డుకున్నందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లపై
సాక్షి, సిద్దిపేట: మద్యం మత్తులో ఇద్దరు యువకులు సిద్దిపేట జిల్లాలో వీరంగం సృష్టించారు. కోహెడ మండల కేంద్రంలో కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ తలకు రక్త గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కోహెడ పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు గొడవ పడుతుండగా స్థానికులు 100 కు ఫోన్ చేశారు. వెంటనే బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ మరో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు యువకులు సజ్జు, ఉమేగ్‌లను వారించే ప్రయత్నం చేయగా తిరగబడ్డ ఇద్దరు యువకులు కానిస్టేబుళ్లపై దాడికి తెగబడ్డారు. కర్ర తో దాడికి దిగడంతో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
వినూత్న పడవను తయారు చేసిన సిద్దిపేట వాసి!
సాక్షి, సిద్దిపేట: ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. చేయాలనే తపన ఉండాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొంత ఆవిష్కరణలు ఎన్నో సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శంకర్ సాదాసీదా మెకానిక్. మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన ఇతనికి తమ కులవృత్తుల వారికి ఏదో చేయాలనే ఆలోచన తట్టింది. తనకున్న అనుభవంతో ప్రతిభకు పదును పెట్టి చేపలు పట్టేందుకు వినూత్నంగా పడవ తయారు చేశాడు. పాత బైక్ హ్యాండిల్, ఇంజిన్, ఫ్యాన్ రెక్కలతో నీళ్లలో తిరుగుతూ చేపలు పట్టేందుకు వీలుగా బోట్‌ను తయారు చేశాడు. చదవండి: అతడికి ఏమైంది..? -
ఎమ్మార్వో కార్యాలయంలో.. పెట్రోల్ కలకలం
సాక్షి, సిద్దిపేట : తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011 లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుండి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప అన్నారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దార్ భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి తమ పేరు మీదనే చేస్తామని చెబుతున్నారు కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తమను తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. విషయం తెలుసు తహసీల్దార్, పోలీసులు బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
కోహెడ బాధితులకు ప్రభుత్వం అండ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోహెడ మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కల్పించటం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కోహెడ దుర్ఘటనపై స్పందించిన ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని చెప్పారు. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప అమ్మ, సన్ రైస్, షాడో, టైటాన్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు. సీరియస్ ఉన్న ఒకరిని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం 12 మందిని ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జి చేశారని, మిగిలిన 18 మంది చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. నాలుగు ఆసుపత్రుల్లో పర్యవేక్షణకు నలుగురు అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి విచినట్లు వాతావరణ శాఖ నివేదిక తెలిపిందన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రాజకీయాలు పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెట్ పునరుద్దరించే వరకు కొనుగోళ్ల కోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇక సోమవారం కోహెడ మార్కెట్లో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. -
గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్
కోహెడ/హయత్‌నగర్: గాలివాన బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్ షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ మామిడి ప్యాక్ చేస్తున్న సుమారు 30 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చిన గాలివానకు అవి తట్టుకోలేకపోయాయి. ఒక్క షెడ్డు పూర్తిగా కూలిపోగా, మిగిలిన 3 షెడ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 1000 టన్నుల మామిడి మార్కెట్లో ఉంది. దీని విలువ రూ.1.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలి పాయి. కాయలన్నీ దెబ్బతిన్నాయని రైతులు, వ్యాపారులు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి వచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరికి తీవ్ర గాయాలు : షెడ్డు కూలిన ఘటనలో తొర్రూర్‌కు చెందిన తిమ్మమ్మ, నాగోల్ జైపురి కాలనీకి చెందిన అన్వేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మల్లేష్, శ్రీహరి, రేణుక, లక్ష్మి, తిరుపతమ్మ, అనిల్‌కుమార్, సలీం షేక్, హజీ పాషా, గౌస్ పాషా, నర్సింహ్మా, మల్లమ్మ, హనుమంతు, శివ, ఆంజనేయులు, యాదగిరి, యాద య్య, మమత, లక్ష్మి, సునీత, హైమవతి, షేక్ దస్తగిరి, అంజమ్మ, నీలా, సత్తయ్య, యాద య్య, నర్సమ్మ, బుజ్జ మ్మ, జుబేర్ ఖాన్ ఉన్నారు. వీరిలో కొందరు కోహెడకు మరికొందరు సింగరేణి కాలనీకి చెందినవారు. ప్రస్తుతం వీరు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. కమీషన్లకు ఆశపడి నాణ్యత లేని షెడ్లను నిర్మించారని ఆరోపించారు. చికిత్స పొందుతున్న బాలిక నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు మూడు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కొహెడ ఘటనలో 26మందికి గాయాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొహెడలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్లోని షెడ్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హయత్ నగర్ అమ్మ ఆసుపత్రిలో 12 మంది, సన్‌రైజ్ లో నలుగురు, షాడో ఆసుపత్రిలో ఏడుగురు, మరో ముగ్గురు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. క్షతగ్రాతులకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విపరీతమైన సుడిగాలి వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేవు: ఎంపీ కోమటిరెడ్డి పండ్ల మార్కెట్లో కూలిపోయిన షెడ్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్రెడ్డి రామ్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పండ్ల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేమి తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదన్నారు. మార్కెట్లో భౌతిక దూరం పాటిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పండ్ల మార్కెట్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు. -
తీపి కల తీరెన్
ఎల్బీనగర్: దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంత వాసులకుతీపి కబురు. ఇక్కడి పండ్ల మార్కెట్ తరలింపు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011 నుంచి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించినట్లయ్యింది. సుమారు 9 ఏళ్లుగా మార్కెట్ తరలింపు విషయంలో మంత్రులతో పాటు అధికారులతో పలు దఫాలుగా ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తరలింపునకు పునాది పడినా జీఓలు జారీ చేయకపోవడంతోపాటు స్థల సేకరణ విషయంలో జాప్యం ఏర్పడింది. ఇన్నేళ్ల తర్వాత ఓ కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక తరలింపే ఆలస్యం.. కోహెడలో 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్నేళ్లుగా మామిడి సీజన్ రాగానే మార్కెట్ తరలింపు ఇదిగో అదిగో అంటూ అధికారులు తర్జనభర్జన పడేవారు. 1986లో కొత్తపేటలో 22 ఎకరాల స్థలంలో అప్పటి ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను తరలించేందుకు నిర్ణయించారు. శివారు ప్రాంతం కావడంతో అనువుగా ఉందని నగరంలోని మార్కెట్‌ను ఇక్కడికి తరలించారు. జనాభా పెరగడం, కాలనీలు విస్తరించడం, వాహనాల సంఖ్య పెరగడంతో కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తింది. దీంతో సుధీర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పండ్ల మార్కెట్ తరలింపునకు ప్రణాళికలు వేశారు. అప్పట్లో జీఓ వస్తుందనే సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరుగున పడింది. 2014 ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఓటమి చెందారు. దీంతో మార్కెట్ తరలింపు విషయం పూర్తిగా ఆగిపోయింది. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మార్కెట్ తరలింపుపై పలు పట్టుబట్టారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది. మొత్తానికి మార్కెట్ తరలింపు విషయంలో సుధీర్‌రెడ్డి కల నిజమైందని చెప్పవచ్చు. కాగా.. కోహెడకు మార్కెట్ తరలింపే ఇక ఆలస్యమని సమాచారం. ఈసారి మామిడి సీజన్ ఎక్కడ..? ఈసారి మామిడి సీజన్ ఎక్కడ నిర్వçహించాలనే విషయమై పాలక మండలి, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మామిడి సీజన్లో రోజుకు సుమారు 400 నుంచి 600 లారీలు వస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడడంతో గత సంవత్సరమే కోహెడలో నిర్వహించాలనుకున్నా అది కుదరలేదు. ఈసారి కూడా సాధ్యం కాకపోవచ్చనే తెలుస్తోంది. తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్న సమయం లేకపోవడంతో ఈసారి ఇక్కడే మామిడి సీజన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి సీజన్ వచ్చే నెల నుంచే ప్రారంభం కానుండటంతో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ దఫా మామిడి సీజన్‌ను గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లోనే నిర్వహించాలనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చైర్మన్ వీరమల్ల రాంనర్సింహ గౌడ్ అన్నారు. ఈ విషయంపై వారం రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. -
కొత్తపేట టు కోహెడ’ ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేట పండ్ల మార్కెట్ కోహెడకు తరలించే పనుల్లో జాప్యం నెలకొంటోంది. దీంతోఈ ఏడాది మామిడి సీజన్‌కు ముందే మార్కెట్నుతరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 2015లోనే ఈ మార్కెట్ తరలించాలని నిర్ణయించినప్పటికీ అనివార్యకారణాల వల్ల వాయిదాపడుతూవచ్చింది. తాజాగా మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికన తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మార్కెటింగ్ అధికారుల్లో అలజడిమొదలైంది. అయితే, ఈ మామిడి సీజన్‌కు ముందే మార్కెట్‌ను తరలించాలనుకున్నా కోహెడలో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవడంతో మరోమూడు నెలలు పట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తపేట నుంచి కోహెడకు పండ్ల మార్కెట్‌ను తరలించడం ద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు విజయవాడ మార్గంలో వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొహెడలో 178.09 ఎకరాల్లో భూమి చదును చేశామని అంటున్నారు. అయితే మార్కెట్ షెడ్లు నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. వాహనాల పార్కింగ్ కోసం అంతర్గత రోడ్లు, పార్కింగ్ యార్డుల కోసం స్థలాలు కూడా కేటాయించాల్సి ఉంది. వీటిన్నిటిని గమనిస్తే మార్కెట్ తరలింపులో ఆలస్యం తప్పదనిపిస్తోంది. ఐదేళ్ల నుంచే డిమాండ్.. మామిడి సీజన్లో విజయవాడ రూట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కొత్తపేట్‌లోని ఫ్రూట్ మార్కెట్‌ను అదే దారిలోని నగర శివారు ప్రాంతానికి తరలించాలని 2015లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం విజయవాడ హైవే రూట్లో కొత్తపేట్ మార్కెట్ నుంచి 23 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోహెడ గ్రామంలో 178.09 ఎకరాల భూమిని కేటాయించారు. 2018 నుంచి మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో 178.09 ఎకరాల భూమిని చదును చేశారు. దీంతో పాటు మార్కెట్ స్థలంలో బోర్లు వేశామని మార్కెట్ అధికారులు చెప్పారు. గతంలో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవడంతో 1986లో మొజంజాహీ మార్కెట్లో కొనసాగుతున్న ఫ్రూట్ మార్కెట్‌ను కొత్తపేటకి మార్చారు. ఇప్పుడు కొత్తపేట ప్రూట్ మార్కెట్ వద్ద కూడా మొజంజాహీలో ఉన్నప్పటి పరిస్థితులు ఎదురవడంతో కోహెడకు మార్చాలని ప్రభుత్వంనిర్ణయించింది. స్పీడ్ పెంచాల్సిందే... గత ఐదేళ్లుగా ప్రతి ఏటా మామిడి సీజన్లో (అంటే మార్చి నుంచి జూన్) విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వీటిని దృష్టిలోపెట్టుకుని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్కెట్‌ను కోహెడకు తరలించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. కానీ మామిడి సీజన్‌కు 20 రోజులే సమయం ఉన్నా..పనులు పూర్తి కాలేదు. పనుల స్పీడ్ పెరిగితే ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ప్రసుత్తం మార్కెట్లో 340 మంది లైసెన్స్డ్ కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి కోహెడలో షెడ్లు నిర్మించి షాపులు కేటాయించాల్సి ఉంది. ఈ దిశలో ఇంకా వేగం పెరగాలి. దీనిపై వ్యాపారులు కూడా ఆందోళనగా ఉన్నారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండా మార్కెట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కోహెడలో నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే మూడు నెలల్లో పూర్తవుతుందని, అయినా ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదని కొందరు వ్యాపారులు చెబుతుండడం కొసమెరుపు. -
ఆర్టీసీ బస్ ఢీకొని కండక్టర్ మృతి
సాక్షి, రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు దుర్మరణం చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద అంబర్పేట్ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మ ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి వెళుతుండగా పశ్చిమ గోదావరి జిల్లా తుని డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా మృతుడు రమణారెడ్డి బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ మృతుల కుటుంబీకులు, స్థానికులు దంపతుల మృతదేహాలతో విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. -
నూతన సర్పంచ్‌లు గళం విప్పేనా?
సాక్షి, కోహెడరూరల్ (హుస్నాబాద్): ఇన్నాళ్లు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో నిధులు సరిగ్గా లేక అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేక పంచాయతీల్లో ఆశించిన మేర అభివృద్ధి కానరాలేదు. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం. అధికారులు సక్రమంగా విధుల్లో ఉండటంతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు సర్వసభ్య సమావేశం ఆసెంబ్లీ లాంటిది. గురువారం మండలంలో సర్వసభ్య సమావేశం తొలిసారిగా హారజరవుతున్న నూతన సర్పంచ్‌లు గ్రామాల సమస్యలపై తమ గళం విప్పుతారో లేదో చూడాలి. నూతన సర్పంచులకు తొలివేదిక... మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులకు నేడు జరిగే మండల సర్వసభ్య సమావే«శం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కారమార్గానికి మండల సర్వసభ్య సమావేశం అనుభవంగా మారనుంది. మండలంలో 27 గ్రామాల సర్పంచ్ల సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు అవకాశం ఉంటుంది. నేడు మండల పరిషత్ మందిరంలో ఎంపీపీ ఉప్పుల స్వామి ఆధ్వర్యంలో 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ దేవేందర్‌రాజు తెలిపారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం... నేడు జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరు కాగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఎంపీటీసీల స్థానాలు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయగా త్వరలో ఎన్నికలు నిర్వహించకుంటే మరో సర్వసభ్య సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కర వేదికగా జరిగే ఈ సమావేశంలో సర్పంచ్‌లు సమస్యలపై ప్రస్తావిస్తారో లేదో చూడాలి. రెండు నెలల క్రితం నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన రావాలి. సమస్యల పరిష్కారానికి గళం విప్పి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చకు రానున్న 19 అంశాలు... నేడు జరిగే సర్వసభ సమావేశంలో 19 అంశాలు ప్రధానంగా చర్చించుటకు సభాధ్యక్షుడి అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖ, గ్రామీణ విద్యుత్, వైద్య ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధి హమీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రవాణాéశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్ కాకతీయ, వసతి గృహ, రోడ్డు భవనాల శాఖ వంటి శాఖలకు సంబంధించిన అంశాలు సభలో చర్చకు వస్తాయి. మండలంలో ఎక్కువగా వ్యవసాయం పై ఆదారపడి జీవిస్తున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయంలో సలహలు, సూచనలు ఇస్తున్నారా లేదా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా తదితర అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధిహమీ పథకంలో భాగంగా మండలంలో కూలీలకు పని కల్పిస్తున్నారా, కూలీల పని దినాలు, క్షేత్ర స్థాయిలో ఉపాధిహమీ ద్వారా అధికారులు రైతులకు ఉపయోగపడే పనులు చేయిస్తున్నారా? పశుపొషణ ద్వారా పాడి గేదెలు, బర్రెల పెంపకం, వివిధ శాఖలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏన్‌ఏంలు సక్రమంగా ఉంటున్నారా? అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భినులకు పౌష్టికహరం అందుతుందా లేదా రేషన్ పరఫరా చేస్తున్నారా వంటి వివిధ అంశాలపై నూతన సర్పంచ్‌లు చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తేనే పరిష్కారానికి నోచుకునే విలుంటుంది. ఈ నేపధ్యంలో మండలంలో జరిగే సర్వసభ్య సమావేశంలో నూతన సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్న సందర్భంగా సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకోంటారో లేదో చూడాలి. -
కోహెడ ఎస్సైపై వేటు
సిద్దిపేటటౌన్/కోహెడ(హుస్నాబాద్): దొంగతనం చేశాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితుడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించమే కాకుండా చితకబాదిన ఎస్సైపై వేటు పడింది. కోహెడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బొంత సంపత్ కూలి పనులు చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావి వద్ద ఆటోమేటిక్ స్టార్టర్‌ను సంపత్ చోరీ చేశాడన్న అనుమానంతో అతనిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో బుధవారం సంపత్‌ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై సతీశ్.. అతడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న ఓయూ వడ్డెర విద్యార్థి సంఘం నాయకులు బుధవారం కోహెడ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. జరిగిన విషయం, బాధితుడి ఫొటోలను పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఫోన్ వాట్సాప్ ద్వారా పంపించి.. ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్.. ఎస్సై సతీశ్‌ని విధుల నుంచి తొలగించడంతో పాటు హుస్నాబాద్ ఏసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎంత టి వారినైనా వదిలేది లేదన్నారు. వాట్సాప్ ఫిర్యాదుకు వెంటనే స్పందిం చిన కమిషనర్‌ను వడ్డెర సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు, ప్రజలను ఇబ్బంది పెట్టే పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల క్రితం వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. సంపత్ కేసు మొదటి వాట్సాప్ ఫిర్యాదుగా నమోదైంది. -
స్వైపింగ్ దందా...
కోహెడరూరల్(హుస్నాబాద్) : కోహెడ మండలానికి చెందిన బోలుమల్ల రామయ్య ఒక సాధారణ రైతు. అయన బ్యాంకు ఖాతాలో రూ. 19000 వేలు ఉన్నాయి. ఇటీవల పంట కోత కోసం డబ్బులు కావాలని మండల కేంద్రలోని రెండు ఏటీఎం తిరిగాడు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో పని కాలేదు. రామయ్యకు తెలిసిన వ్యక్తి ఒకరు ఒక షాపు అడ్రస్ చెప్పాడు. అయన వద్దకు వెళ్లిన రామయ్య ఏటీఎం ఇచ్చి 14వేలు కావాలని చెప్పాడు. దీంతో సదరు యజమాని తన ఖాతాలోని 14వేలు తీసి 13,600 రామయ్యకు ఇచ్చాడు. డబ్బులు లెక్కపెట్టిన రామయ్య 400 తక్కువగా ఉన్నాయని ఆడగగా మీకు పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి ఎమైనా ధర్మసత్రం నడుపుతున్నానా మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు ట్యాక్సులు పడుతాయి. మా ఆకౌంట్లో డబ్బులు వాడినందుకు రేపు లేనిపోని తలనొప్పులు వస్తాయని కోపగించకున్నాడు. ఇలాంటి రామయ్యలు రోజుకు వందల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నగదు సమస్య పీడిస్తుంది. డబ్బుల కోసం సామాన్యులు నానా పాట్లు పడతున్నారు. వారి అవసరాలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మిషన్ల ద్వారా కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యాపార సముదాయలలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొందరు వ్యాపారులు ఈ స్వైపింగ్ మిషన్లు వ్యాపారానికే కాకుండా కమీషన్‌కు డబ్బులు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోల్ బంకులు, వైన్‌షాపులు తదితర కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు ఇలా విని అలా వదిలేస్తున్నారు. డబ్బులు దొరక్కపోవడంతో... పంట కోతలున్నాయి. చేతిల డబ్బులు లేవు. ఏటీఎంలో సరిపడా డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం.స్వైపింగ్ ద్వారా అయితే 5 నిమిషాల్లొ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ అవసరాలు గట్టేకుతున్నాయి. –బోలమల్ల మహేందర్, స్థానికుడు కమీషన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి స్వైపింగ్ ద్వారా కమీషన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని వ్యాపారుల వద్దకు వెళ్తే స్వైపింగ్ మిషన్ ద్వారా కమీషన్ వసూలు చేస్తున్నారు. మా డబ్బులు తీసుకోవడానికి కూడా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. –బి.శ్రీనివాస్, వరికోలు -
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుం ది. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన గొట్టే చంద్రయ్య(42) 20 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో అవుట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరాడు. బస్వాపూర్ చెక్ పోస్టులో సై తం సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహించారు. కోహె డ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు అనంతరం కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట శుక్రవారం గణతంత్ర వేడుకలకు జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నాడు. జెండా కోసం సిద్ధం చేసిన ఇనుమ పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రూ.5 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు వ్యవసాయ మార్కెట్ శాఖ నిధుల నుంచి బాధిత కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలని ఆర్డీఓ శంకర్‌కుమార్‌ను కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎస్ఐ చాంద తిరుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర్‌శర్మ, పెర్యాల రవీందర్రావు, దేవేందర్‌రావు, ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కర్ర శ్రీహరి, తైదాల రవి, వైస్ చైర్మన్లు కోల్ల రాంరెడ్డి, తోట ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. -
కోహెడకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్
178 ఎకరాల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేస్తాం: హరీశ్ ⇒ త్వరలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల: తలసాని ⇒ ఈ ఏడాది సిద్దిపేటలో మెడికల్ కాలేజీ: లక్ష్మారెడ్డి ⇒ పాల కల్తీపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీనివాస్‌గౌడ్, సోలిపేట సాక్షి, హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలించాలని నిర్ణయిం చినట్లు మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకు కోహెడలో 178.09 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించామని, అక్కడ అన్ని హంగులతో విశాలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కేవలం 22 ఎకరాల్లోనే ఉందని, దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో సరైన సదుపాయాల్లేక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే నగరం మధ్యలో ఉండటం వల్ల మార్కెట్‌కు వాహనాల రద్దీ పెరిగినప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న కోహెడకు మార్కెట్‌ను తరలిస్తున్నామన్నారు. అక్కడ భూములు కోల్పోయే వారికి ఒక్కొక్కరికి రూ.7.40 లక్షల చొప్పున రూ.9.38 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇప్పటికే చెల్లించామన్నారు. అక్కడ మార్కెట్ ఏర్పాటుపై రాష్ట్ర అధికారులు ముంబై, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారని, ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నారని, ఆ తర్వాతే అవసర మయ్యే నిధులపై స్పష్టత వస్తుందన్నారు. పాల కల్తీపై అధికార పార్టీ సభ్యుల ఫైర్ పాల కల్తీ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అధికార పార్టీ సభ్యులే ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదటగా ఈ అంశాన్ని శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తుతూ... హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంటే కేవలం 5 లక్షల లీటర్ల ఉత్పత్తే ఉందని, ఇదే అదనుగా చిక్కదనం కోసం పాలల్లో యూరియా కలుపుతూ ప్రైవేటు సంస్థలు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పశువులకు ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్లు ఇస్తున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని సూచించారు. దీన్నుంచి బయట పడేయాలంటే నగరంలో విజయ డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. పర్యాటకప్రాంతాలు, జాతీయ రహదారుల్లో విజయ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కల్తీపై మాత్రం స్పందించలేదు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ మరోసారి మాట్లాడుతూ.. ‘‘50 శాతం పాలల్లో కల్తీ ఉంది. దీని నిరోధానికి చట్టం తేవాలి. కల్తీకి పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. హెరిటేజ్ వంటి సంస్థలు కోట్లు సంపాదిస్తుంటే విజయ డెయిరీ మాత్రం నష్టాల్లో ఉండటం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ... పాల కల్తీ నిజమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ వంటి సంస్థలు విజయ డెయిరీ ఉత్పత్తులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. మరో సభ్యుడు చెన్నమనేని రమేశ్ సైతం.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెండేళ్లలో లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగిందంటే తాను నమ్మనని అన్నారు. ఒకేసారి అధికార సభ్యులంతా దాడి చేయడంతో తలసాని కొద్దిగా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. పశు సంచార వైద్యశాలలకు 28 కోట్లు: తలసాని రాష్ట్రంలో నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ బడ్జెట్లో ఇందుకు రూ.28.45 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆరూర్ రమేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. ఎల్లారెడ్డి వంటి నియోజకవర్గాల్లో పశుసంపద ఎక్కువగా ఉన్న దృష్ట్యా, అక్కడ అవసరమైన డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కాగా.. ఈ ఏడాది సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 700 మెడికల్ సీట్లు, 221 పీజీ కోర్సుల్లో సీట్లు పెరిగాయన్నారు. -
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపు
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శివారులోని కోహెడ సమీపంలోకి మార్చనున్నట్లు మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం శాసనసభలో తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు ప్రస్తుతం 22 ఎకరాల్లో ఉందని, స్థలం చాలక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ను కోహెడకు తరలించి 178 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మార్కెట్ ఔటర్ రింగ్‌రోడ్ పక్కనే ఉండటం వల్ల రైతులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందన్నారు. మార్కెట్ యార్డు తరలింపు వల్ల నగరంలో కొన్ని ట్రాఫిక్ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందన్నారు. -
ముగిసిన కళాశాలల వాలీబాల్ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అండర్ –19 బాలబాలికలకు నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు గురువారం ముగిసాయి. పోటీలకు జిల్లా వ్యాప్తంగా 32 బాలబాలికల జట్లు హాజరయ్యాయి. బాలుర విభాగంలో రుక్మాపూర్ గురుకుల పాఠశాల, మహాత్మగాం«ధీ జ్యోతిబాపూలే కమలాపూర్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర జట్టుప్రథమ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కోహెడ జట్టు ద్వితీయస్థానాల్లో నిలిచాయి. సాయంత్రం జరిగిన బహుమతి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి జి.మధుజాన్సన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫిజికల్ డైరెక్టర్లు ఆనంద్, నాగేశ్వర్రావు,వెంకటరెడ్డి, సరిత, సుష్మా తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జట్ల జాబితాను కార్యదర్శి ప్రకటించారు. బాలుర జట్టు: సతీష్(రుక్మాపూర్), దినేష్,నరేష్, మునీందర్(గంగాధర), గణేష్, కార్తీక్(గొల్లపల్లి), రాజేష్(హుజురాబాద్), నరేష్(హుస్నాబాద్), మహేశ్(జూలపల్లి), మారుతి(సుల్తానాబాద్), గణేష్, విజయ్(కమలాపూర్)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా శౌర్య, శ్రీనివాస్, భగత్, మనోహర్, శివ, సాయిచరణ్‌లు ఎంపికయ్యారు. బాలికల జట్లు: జ్వాల(హుజూరాబాద్), ఆకాంక్ష, నర్మద, శ్రీలేఖ, దివ్య, లహరి, శ్రీవైష్ణవి(కొత్తపల్లి), స్రవంతి, శృతి, మాధురివాణి, సంఘవి(అల్గునూరు), ప్రియాంక(చింతకుంట), అనూష, స్వప్న(నందిమేడారం), పూజ, రిషిత(కరీంనగర్)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా అతిథి, అనూష, సురేఖలు ఎంపికయ్యారు. బాలికల క్రికెట్ జట్టు ఎంపిక... జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో అండర్–19 బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారిణులు ప్రతిభ చాటారు. జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి మధుజాన్సన్, వరుణ్‌రావు పాల్గొన్నారు. నేడు వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో అండర్–19 బాలబాలికలకు వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి మ«ధుజాన్సన్ తెలిపారు. 20న అండర్–19 బాలబాలికలకు స్టేడియంలోనే ఖోఖో, బాలురకు క్రికెట్ జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు సంబంధిత తేదీల్లో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. -
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి
హైదరాబాద్ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
మూడు ఇళ్లలో చోరీ
రూ.1.05 లక్షల నగదు, ఎడున్నర తులాలు బంగారు అభరణాలు అపహరణ తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్ వేలిముద్రాలను సేరించిన క్లూస్ టీం కోహెడ : మండల కేంద్రానికి చెందిన కొండ ప్రసన్న, పేర్యాల ముత్యరావు, సూరు చిన్న మల్లవ్వ ఇళ్లలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ముత్యంరావు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి భార్యతో కరీంనగర్లో ఉంటున్న కొడుకుల వద్దకు వేళ్లాడు. కొండ ప్రసన్న తన రెండంతస్తుల భవనంలోని పైఅంతస్తులో కుటుంబ సభ్యులతో పడుకున్నాడు. మల్లవ్వ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లింది. దొంగలు తాళం వేసిఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను గుల్ల చేశారు. పేర్యాల ముత్యంరావు ఇంట్లో బీరువా పగులగొట్టి అందులో ఉన్న రూ.50 వేలు, ఐదున్నర తులాలు బంగారు అభరణాలు, కొండ ప్రసన్న ఇంట్లోని బీరువాను పగులగొట్టి రూ.40 వేలు, 2 తులాలు బంగారు అభరణాలు, సూరు చిన్నమల్లవ్వ ఇంట్లో రూ.15 వేలు అపహరించుకుపోయారు. అలాగే తాళం వేసి ఉన్న పేర్యాల చొక్కారావు(పాత ఇంట్లో) సైతం దొంగలు చొరబడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. గ్రామానికి చెందిన ఇద్దరి ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు. ఒకటి కోహెడ క్రాసింగ్ వద్ద, మరొకటి కోహెడ హైస్కూల్ వద్ద వదిలేసి పారిపోయారు. చోరీ జరిగిన ఇళ్లను హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య, కోహెడ ఎస్సై చందా తిరుపతి సందర్శించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. -
సిద్దిపేట వద్దు..కరీంనగర్ ముద్దు
కోహెడలో అఖిలపక్షం బంద్ సంపూర్ణం కోహెడ : కోహెడ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కోహెడ బంద్ సంపూర్ణమైంది. మండల కేంద్రంలో కిరాణం దుకాణాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను అఖిలపక్షం నాయకులు బహిష్కరించారు. ప్యాసెంజర్, ట్రాలీ ఆటో యజమానులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. అంబేద్కర్‌చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అఖిలపక్షం నాయకులు కర్ర రవీందర్, ఖమ్మం వెంకటేశం, సంది శ్రీనివాస్‌రెడ్డి, బందెల బాలకిషన్, కోటేశ్వరాచారి, గవ్వ వంశీధర్‌రెడ్డి, అన్నబోయిన కనకయ్య, వలుస సుభాష్, గాజుల వెంకటేశ్వర్లు, మ్యాకల బాలకిషన్‌రెడ్డి, శెట్టి సుధాకర్, బస్వారాజు శంకర్, ఇట్టిరెడ్డి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.