మేకలు అమ్మి.. బాత్రూమ్ కట్టించింది..
రాయ్‌పూర్ : గ్రామాల్లో టాయిలెట్లు, బాత్రుమ్‌లు కట్టించి పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన్పటికీ.. ఎటువంటి మార్పులేదు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాలలోమహిళలు, బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 102ఏళ్ల బామ్మ కువార్బాయ్ యాదవ్ ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి యత్నించి సక్సెస్ సాధించారు. బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని, వయసు మీద పడుతుండటంతో మరింత కష్టమని భావించిన శతాధిక వృద్ధురాలు వినూత్నంగా ఆలోచించారు. తన వద్ద ఉన్న మేకలను అమ్మెసి తద్వారా వచ్చిన డబ్బు రూ. 22,000 తో ఇంటి వద్ద బాత్రూమ్ కట్టించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆమె అందరికీ రోల్ మోడల్‌గా కనిపిస్తున్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని, ఎదురయ్యే ఇబ్బందులను వివరించి వారి ఆలోచనల్లో మార్పును తీసుకురాగలిగారు ఈ బామ్మ.
దంతారి జిల్లాలోని కోటబరి గ్రామస్తులు ఆమె విధానాన్ని అభినందిస్తూ, అనుసరిస్తుండటం గమనార్హం. 450 కుటుంబాల వారు ఎలాగైనా సరే తాము కూడా ఇంటి వద్దే మరుగుదొడ్డి కట్టించుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేశారట. దంతారి జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద వీటి నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. శతాధిక వృద్ధురాలు కువార్బాయ్ యాదవ్ ఆలోచన, ఆచరణ సొంత గ్రామంతో పాటు జిల్లా అధికారులలో కూడా మార్పు తీసుకువచ్చారు.