ఇప్పుడేమీ మాట్లాడను..నమస్తే..
హైదరాబాద్ : కూకట్పల్లి భ్రమరాంబిక, మల్లికార్జున థియేటర్ల వద్ద శుక్రవారం సందడి నెలకొంది. చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోయిన్ అనుష్క, రమా రాజమౌళి, శ్రీవల్లి తదితరులు ...సినిమా చూసేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కాగా సినిమా చూసిన అనంతరం రాజమౌళిని మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆయన మాత్రం ఇప్పుడేమీ మాట్లాడను... అంటూ నమస్కారం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.