lagadapati rajagopal
-
పచ్చ మందలో 'కొత్త పిట్ట' పలుకులు.. పైసాకి పనికిరాని పృథ్వీరాజ్
ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీలో వైసీపీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చేశాయ్.. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్వే సంస్థలు క్లియర్‌గా తేల్చే చెప్పేశాయ్. అందులో భాగంగానే ఓట్ల కోసం పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన లైన్లో పెట్టుకున్నాడు. అయినా, జగన్‌ను ఢీ కొట్టేందుకు బలం సరిపోవడంలేదని తేలిపోయింది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడు. అవసరమైతే రేపు కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా చంద్రబాబును ఎన్నికల సర్వేలన్నీ భయపెడుతున్నాయి. ఫలితాలపై జోస్యం చెబుతున్న 'కొత్త పిట్ట' తాజాగా ఇలాంటి సమయంలో కమెడియన్ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పాడు. లగడపాటి రాజగోపాల్ వారసుడు మాదిరి 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. సీఎం జగన్ బలం ముందు కూటమి బలం సరిపోవడం లేదని చంద్రబాబు నానాపాట్లు పడి ప్రశాంత్ కిషోర్ సలహాల కోసం వెంపార్లుడుతుంటే మధ్యలో ఈ జోక్‌లు ఏంటి..? అని పృథ్వీరాజ్‌పై పంచ్‌లు పడుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అంటూ కీర్తించాయి.. తీరా ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీ ముందు టీడీపీ నేతలు అందరూ కొట్టుకుపోయారు. ఆంధ్రా ఆక్టోపస్ సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన వారు ఎందరో... ఫలితాలు వెలువడ్డాక సీఎం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో లగడపాటి రాజగోపాల్‌కు తెలిసొచ్చింది. ఇకపై సర్వేలు చేయనని మూటముళ్లే సర్దుకొని కనిపించకుండా పోయాడు. తాజాగా లగడపాటి లేని లోటును కమెడియన్ పృథ్వీరాజ్ 2024 ఎన్నికల్లో తీర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో పవన్‌కే సరైనే స్థానం లేదు.. వాళ్లను నమ్ముకుని ఇలాంటి చిలుక జోస్యాలు చెబితే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది మరి! నయా పైసా లాభం లేదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పృథ్వీరాజ్ వైసీపీ కోసం పనిచేశాడు. పృథ్వీ వల్ల పార్టీకి నయా పైసా లాభం లేకపోయినా పదవి దక్కిందని అప్పట్లో సోషల్‌మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ కోసం పనిచేశాడని గుర్తించి.. అందుకుగాను ఎస్వీ భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పగించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ కీలక పోస్టులో ఉంటూ.. ఓ మహిళతో సరస సంభాషణలు చేసి పదవిని ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా వైసీపీకి దూరమవుతూ.. టీడీపీ, జనసేన మందలో చేరిపోయాడు. తాజాగా ఈ కొత్త పిట్ట కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం విశేషం! -
లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి
సాక్షి, నిడదవోలు: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలవబోతోందంటూ చెప్పిన చిలకజోస్యం (సర్వే) ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లగడపాటి సర్వేను నమ్మి ఓ కౌలు రైతు అప్పు తెచ్చిమరీ బెట్టింగ్ కాయగా.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు కంఠమని వీర్రాజు (45) ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ సుమారు రూ. 12 లక్షలు పందెం కాశాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీర్రాజు టీడీపీ వీరాభిమాని. ఓ పక్క కౌలు చేస్తూనే ధాన్యం వ్యాపారం చేస్తాడు. ఎన్నికల ఫలితాలకు మూడు రోజులకు ముందు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుంచి కొంత నగదు అప్పు తీసుకున్నాడు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని సుమారు రూ.12 లక్షల పందెం కాశాడు. టీడీపీ 110 నుండి 130 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని లగడపాటి రాజ్‌గోపాల్ సహా పలు సర్వేలు చెప్పడంతో ఈసారి కూడా టీడీపీ విజయం సాధిస్తుందని భావించిన వీర్రాజు రూ.12 లక్షలు బెట్టింగ్ కాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైఎస్సార్ సీపీ ఏకంగా 151 స్థానాలు గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు పార్టీ ఓటమిపాలవ్వడం, ఓ వైపు రూ.12 లక్షలు పందెంలో పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందాడు. మిల్లర్ల నుంచి అధిక మొత్తంలో నగదు అప్పుగా తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలివెన్ను గ్రామంలో తన ఇంటి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎప్పటి మాదిరిగానే పొలం వెళుతున్నట్లు బయలుదేరాడు. అక్కడి నుంచి నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ శివారున ఉన్న ముక్కులమ్మ వారి గుడి వెనుక ఉన్న ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీర్రాజుకు భార్య కంఠమని సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో ఎంతో సామ్యుడిగా పేరున్న వీర్రాజు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. నిడదవోలు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వీర్రాజు భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై ఎన్.హనుమంతరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫ్యాన్ ప్రభంజనంతో సైకిల్ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి అభాసుపాలయ్యారు. ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు. చదవండి: బాబు కోసం బోగస్ సర్వేలు సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి విదూషకుల విన్యాసాలు -
ఏయ్ లగడపాటి నువ్వెక్కడా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్ అని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జతకట్టిన మహాకూటమికి మేలు జరిగేలా బోగస్ సర్వేతో మాయ చేసిన లగడపాటి.. ఏపీ ఎన్నికల విషయంలోను అదే పంథాను కొనసాగించి పరువు తీసుకున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించిన లగడపాటి.. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీ చేబట్టబోతుందని జోస్యం చెప్పారు. అన్ని సర్వే సంస్థలు, జాతీయ చానెళ్లు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైస్సార్సీపీకి పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం భిన్నంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే లగడపాటి చెప్పినవన్నీ బోగస్ అని స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ వైఎస్సార్సీపీ ఏకంగా 152 సీట్ల ఆధిక్యంతో చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుంది. ఈ ఫలితంతో లగడపాటి విశ్వసనీయత కోల్పోయారు. ఆయనపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ క్యాడరే లగడపాటి కనిపిస్తే చితక్కొట్టాలనే కసితో ఉంది. ఆయన చెప్పిన సర్వే వివరాలతో సోషల మీడియా వేదికగా అనవసర సవాళ్లకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఫలితాలతో ముఖం చాటేశారు. దీనికి కారణమైన లగడపాటిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్స్ చేస్తున్నారు. ‘ఎయ్ లగడపాటి నువ్వెక్కడా? మళ్లీ సర్వే అంటూ మీడియా ముందుకు వచ్చావో?’ అంటూ అసభ్య పదజాలంతో మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనే లగడపాటి సర్వేతో బెట్టింగ్రాయిళ్లు కోట్ల రూపాయలు నష్టపోయారని, బెట్టింగ్‌ల కమిషన్ కోసమే మళ్లీ తప్పుడు సర్వే వివరాలను వెల్లడించారని ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి లగడపాటి మళ్లీ సర్వే అని నోరెత్తకుండా.. అతని అంచనాలకు భిన్నంగా రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. pic.twitter.com/VkLtF7kR7Z — Ram Gopal Varma (@RGVzoomin) 23 May 2019 -
‘సర్వే అనకుండా.. లగడపాటిని లోపలేయాలి’
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..
-
లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాబు కోసం బోగస్ సర్వేలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. లగడపాటి సర్వే తీరిది.. రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్‌తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సంస్థలూ అంతే.. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఎస్ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్ఎస్ఎస్ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్ ఎలక్టోరల్ క్యాలిక్యులస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం. ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
విదూషకుల విన్యాసాలు
ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’. – కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన ‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’. – 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక! మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్‌ని సాగనంపి ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్ స్ప్రే) సభ్యుల కళ్లలో కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్‌లో ఉండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్‌ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ను అంటకాగుతూ ఎన్టీఆర్ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్‌కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు. ‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్‌లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు. మళ్లీ సేమ్ డ్రామా. బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పెట్ట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి. భీమవరం,విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి - కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని తప్పుకున్నాడు. ఇప్పుడే పార్టీతో సంబంధం లేదని కోస్తున్నాడు. కన్నాలేసే దొంగకు ఏఇంట్లో దూరితే ఏం దొరుకుతుందో అంచనా వేసే సిక్త్స్ సెన్స్ ఒకటి ఉండి చస్తుంది. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు...ఇది ఎల్లో జలగ! లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి.’ అంటూ ఆయన ట్విట్ చేశారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్‌లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్ పెద్ద స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్ఎస్ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్‌లు కాసేలా జాగ్రత్త పడినట్లు విమర్శలు వినిపించాయి. చివరకు టీఆర్ఎస్ నెగ్గడంతో బెట్టింగ్‌ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందే నిన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. -
బెట్టింగ్ కోసం ఆక్టోపస్ మోసం!
-
టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ
-
సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి
సాక్షి, అమరావతి : రేపు చంద్రగిరిలో రీపోలింగ్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు. మీడియా సమావేశం కంటే ముందే బుద్ధా వెంకన్నతో అరగంట పాటు ఆయన భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై విశ్లేషకులు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఊహించినట్టుగానే పచ్చ పార్టీ భజన చేయడానికి మాత్రమే ఆయన విలేకరుల ముందుకు వచ్చినట్టు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ ఇక అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్‌లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కాగా గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో లగడపాటి రాజగోపాల్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆయన సర్వే పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రాజగోపాల్ సర్వే విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. -
త్వరలో అన్ని విషయాలు చెబుతా: లడగపాటి
సాక్షి, తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండెక్కి స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలందరు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. పవిత్రమైన తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని, త్వరలో అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కాగా, గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో ఆయన తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
నిలకడ లేని ‘నారా’జకీయం
అయితే మేనియా, లేదంటే ఫోబియా. మధ్యేమార్గం లేదు. మేనియా అంటే పిచ్చి ప్రేమ. నిర్హేతుకమైన అభిమానం. ఫోబియా అంటే గుడ్డి వ్యతిరేకత. మితిమీరిన ద్వేషం. రెండూ తీవ్రమైన మానసిక ధోరణులే. సాధారణంగా కొందరు వ్యక్తులకు కొందరంటే మేనియా ఉంటుంది. కొందరిపట్ల ఫోబియా ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు లక్షణాలూ ఉండవలసిన పని లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి దాదాపు శాశ్వతంగా ఉంటాయి. అభ్యాసం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో ఈ రెండు లక్షణాలూ ఏకకాలం ప్రకోపించే నైజం ఉంది. ఒకరిని విపరీతంగా అభిమానిస్తారు. అదే సమయంలో మరొకరిని హద్దులు మీరి ద్వేషిస్తారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల కొంతకాలం మేనియా ప్రదర్శించి కొంతకాలం తర్వాత అదే వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల అంతే స్థాయిలో ఫోబియా చూపించడం ఆయన ప్రత్యేకత. ఉదాహరణకు 2014 జూన్ నుంచి 2018 మార్చి వరకూ నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రులుగా పని చేసిన వారందరిలోకీ ఉత్తముడు. ఘటనాఘటన సమర్థుడు. ప్రపంచంలో భారత దేశా నికి సమున్నత స్థానం సంపాదించిన రాజకీయవేత్త. తన సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనం అంతుచూసేందుకు సాహసోపేతమైన చర్య తీసు కున్న దురంధరుడు. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)ని అత్యంత లాఘవంగా అమలులోకి తెచ్చిన నేర్పరి. స్నేహం చెడి, బంధం వీడి, ప్రత్యర్థులుగా మారిన తర్వాత అదే మోదీ పనికిరాని ప్రధాని. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని నిరోధించలేకపోయిన అసమర్థుడు. ఉగ్రవాద దాడిపై అనుచిత వ్యాఖ్య ఎన్నికలు రెండు మాసాల దూరంలో ఉన్నాయనగా ప్రజలలో దేశభక్త్యావేశం నింపడానికి ఉగ్రవాదుల దాడిని పనికట్టుకుని జరిపించారా అని అనుమానం కలుగుతోందనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ కూడా అదే ఫక్కీలో కేంద్రం నిజాయతీని శంకించారు. వీరిద్దరి కంటే పంజాబ్ మంత్రి నవజోత్ సిద్ధూ నయం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సిద్ధూ అనడం సమయోచితం కాకపోయినా అర్థం లేని బాధ్యతారహితమైన వ్యాఖ్య కాదు. నిర్మాణాత్మకమైనదీ, ఆవేశాలు చల్లారిన అనంతరం ఆచరణయోగ్య మైనదీ. గోధ్రా అమానుషం, అనంతర మారణహోమం జరిగింది 2002లో. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నారావారికి మోదీ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరకరమైన అంశం కనిపించలేదు. గుజరాత్ నరమేధం గుర్తురాలేదు. ఎట్లాగైనా గెలవడం ప్రధానం. అందుకే సినీనటుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ మద్దతు కోరారు. మొత్తంమీద స్వల్ప ఆధిక్యంతో ఎన్నికలలో గెలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో భాగస్వామ్యం నెరిపారు. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)నుంచి వైదొలిగిన తర్వాత గుజరాత్ మారణకాండ, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రవచించిన రాజధర్మం నారావారికి జ్ఞాపకం వచ్చాయి. దీనినే మనోవైజ్ఞానిక శాస్త్రంలో సెలక్టివ్ ఆమ్నీసియా (ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరచిపోవడం) అంటారు. ఇది కూడా ఒకానొక మానసిక లక్షణమే. మేనియా ఉన్నంతకాలం ఆకాశానికి ఎత్తడం, మేనియా దిగిపోగానే నేలకేసి కొట్టడం. మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్న కాలంలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పట్ల ద్వేషభావం ఉండేది. నరేంద్రమోదీని అవధులు లేకుండా అభిమానిస్తున్న రోజుల్లో కాంగ్రెస్ చెత్తపార్టీ. సోనియాగాంధీ ఇటలీ రాక్షసి. మాఫియోజీ. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ అసమర్థుడు. పప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. రాహుల్‌గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే, ‘ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ఇక్కడ ప్రజలు బతికున్నారో, చచ్చారో చూడటానికి వచ్చారా?’ అంటూ ఉతికి ఆరేశారు. అదంతా కాంగ్రెస్ ఫోబియా ఉన్న రోజుల్లో వైఖరి. ఫోబియా మోదీపైకి మళ్ళి మేనియా సోనియా, రాహుల్ వైపు బదిలీ కావడంతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల తీరు కూడా అక స్మాత్తుగా మారింది. తన ప్రయోజనాలు నెరవేర్చనందుకు మోదీని ఓడించాలని చంద్రబాబు తీర్మానించుకున్నారు. ప్రతిష్ట క్రమంగా కోల్పోతున్న నరేంద్ర మోదీని మోయడం కంటే మోదీకి ఎదురు తిరిగి అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించిన ప్రతినాయకుడు (విలన్)గా అభివర్ణించాలి. మీడియా సహకారంతో ప్రజలను నమ్మించాలి. హస్తినపై పోరాటమా, ఆరాటమా? కేంద్రంపైన యుద్ధం ప్రకటించడం ద్వారా ప్రజల తరఫున అన్నిటికీ తెగించి పోరాడుతున్న యోధుడిలాగా కనిపించాలి. ఓటర్లను మెప్పించి మరోసారి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పదవిలో కొన సాగాలి. వీలైతే తనయుడు లోకేష్‌ను గద్దెపైన కూర్చోబెట్టాలి. అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో రాహుల్‌గాంధీ నాయకత్వంలో యూపీఏ–3 ప్రభుత్వం ఏర్ప డితే హస్తినలో చక్రం తిప్పాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం. మోదీని ఓడించడం కోసం రాహుల్‌ని భుజానికి ఎత్తుకుని మోయడానికి అభ్యంతరం లేదు. సొంత బలంతో ఏదీ సాధించే అవకాశం లేదు కనుక ఏదో ఒక జాతీయ పార్టీ సహకారం అనివార్యం. కేంద్రంలో గణనీయమైన పాత్ర పోషించాలంటే తక్కిన ప్రాంతీయపార్టీలను తానే ప్రభావితం చేసి నడిపిస్తున్నారనే అభిప్రాయం కలిగించాలి. అందుకే ప్రత్యేక విమానంలో బెంగళూరుకూ, భువనేశ్వర్కూ, కోల్‌కతాకూ చక్కర్లు కొట్టడం. మాయావతినీ, అఖిలేష్‌నీ యూపీఏ పరిష్వంగంలోకి తీసుకుని వస్తానంటూ రాహుల్‌కి వాగ్దానం చేశారు. అన్నీ కలసి వస్తే శరద్‌పవార్ మూడు దశాబ్దాల స్వప్నం సాకారమై ఆయనే ప్రధాని కావచ్చునంటూ మరాఠా యోధుడి చెవులో చెబుతారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతల ప్రభంజనం సృష్టించిన మమతాబెనర్జీ ప్రధాని పదవికి నూటికి నూరుపాళ్ళు అర్హురాలంటూ ఆమెలో ఆశలు రేకెత్తిస్తారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతిపక్షాల కూటమి ఖాయ మంటూ ఆమెతో అంటారు. ఏ రోటి కాడ ఆ పాట. మమతను ప్రసన్నం చేసుకోవడానికి రెక్కలు కట్టుకుని కోల్‌కతాలో వాలడానికి సిద్ధం. మాయావతి ఆశీస్సుల కోసం ఢిల్లీ కానీ లక్నో కానీ వెళ్ళడానికి తయారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించినప్పుడు కూడా ఇదే తీరు. అందుకే మొన్న ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో పన్నెండు గంటల దీక్ష సమయంలో సమాజ్‌వాదీపార్టీ వ్యవ స్థాపకుడు ములాయంసింగ్ మాట్లాడుతూ, ‘ప్రధానమంత్రిగా మీరు ఉండాలంటూ నాయుడూజీ నాతో అన్నారు’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అదే ములాయం లోక్‌సభ చివరి రోజు సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రమోదీ మళ్ళీ విజయం సాధించి ప్రధానిగా కొనసాగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అది వేరే విషయం. బీజేపీ అగ్రనాయకద్వయం మోదీ– అమిత్‌షా తక్కువేమీ తినలేదు. గుజరాత్ గాయం తర్వాత తనను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి మోదీ విస్మరించజాలరు. తాను హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తానంటూ నాటి సిటీ పోలీసు కమిషనర్‌తో చంద్రబాబు చెప్పించిన విషయం మరచిపోలేదు. కానీ ఎట్లాగైనా విజయం సాధించి అధికారం కైవసం చేసుకోవాలన్న ఏకోన్ముఖదీక్షతో చంద్ర బాబుతో దోస్తీకి మోదీ అంగీకరించారు. ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత తనపైన వాగ్బాణాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబు గతం మోదీకీ, అమిత్‌షాకీ అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వారికి ఇప్పుడు కనిపిస్తున్నారు. అవినీతికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దర్శనమిస్తున్నారు. అవకాశవాదం మూర్తీభవించిన నేత కళ్ళకు కడుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్ళి శాలువా కప్పి స్నేహం ప్రకటించిన చంద్రబాబు టీడీపీతో మూడున్నర దశాబ్దాలు నిరంతర పోరాటం చేసిన కాంగ్రెస్ యోధులకు దేవుడిలాగా కనిపిస్తున్నారు. ‘గతం గతః’ అంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్, టీడీపీ మధ్య వైరాన్ని చాలా తేలికగా కొట్టిపారవేశారు. తలాతోకాలేని మాటలు ఈ మధ్య చంద్రబాబు తమాషా వ్యాఖ్యలు చేస్తున్నారు. తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. పద్నాలుగు మాసాలకు పైగా పాదయాత్ర చేసిన మిత్రుడు జగన్మోహన్రెడ్డిని పలకరించడానికి సినీహీరో అక్కినేని నాగార్జున లోటస్ పాండ్‌కు వెడితే, ‘నాగార్జునకు ఏమైనా అవసరాలు ఉంటే నా దగ్గరికి రావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో సహాయం చేస్తా. నేరస్థులను కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెడతాయి’ అంటూ చిత్రంగా వ్యాఖ్యానించారు. సోనియా పనుపున తాను, చిదంబరం కలసి సీబీఐ చేత పెట్టించిన బూటకపు కేసులు ఏవీ కోర్టులో నిలవజాలవని చాలామంది న్యాయశాస్త్ర ప్రవీణులు అన్నారు. నిర్దోషిగా జగన్ మోహన్‌రెడ్డి కేసుల నుంచి విముక్తి పొందుతారని చంద్రబాబుకీ తెలుసు. నిందితుడికీ, దోషికీ తేడా పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఒక ముఖ్య మంత్రికి తగదని ఆయనకు వేరొకరు చెప్పనక్కరలేదు. కానీ ఆయన మానసిక స్థితి ఆయనను నిలువనీయదు. జగన్మోహన్రెడ్డి ఫోబియా చంద్రబాబుచేత ఏది పడితే అది మాట్లాడిస్తుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసివచ్చేందుకు జగన్మోహన్రెడ్డి దంపతులు లండన్ వెడితే హవాలా డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్ళారంటూ నోరుపారేసుకోవడం ఆయనలో నానాటికీ పెరుగుతున్న అభద్రతాభావం కారణంగానే. సింగపూరులో ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబుకి ఉన్నాయనీ, అందుకే ప్రతిపక్షంలో ఉన్న కాలంలో సైతం ఆ దేశం సందర్శించేవారనీ అందరూ అంటారు. చంద్రబాబు లాగా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేవారికి సింగపూర్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ హవాలా డబ్బు తీసుకురావడం తేలిక. ఒక వైపు మోదీ, మరోవైపు పవన్ కల్యాణ్ సహాయం చేస్తేనే 2014లో బొటాబొటి ఓట్లతో గెలుపొందిన టీడీపీకి ఈ సారి బీజేపీతో పొత్తు లేదు. పవన్‌కల్యాణ్ నాయకత్వం లోని జనసేనతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. పొత్తు ఉంటుందని అనుకున్నప్పటికీ అది పరాజయం నుంచి కాపాడలేదు. అయిదేళ్ళు అధికారంలో ఉండి సంపాదించుకున్న ప్రజావ్యతిరేకత టీడీపీ విజయావకాశాలను మరింత క్షీణింపజేసింది. అధికారంలో ఉండగా సాధించామని చెప్పుకోవ డానికి ఒక్కటీ లేదు. జాతీయ మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ ఇంతవరకూ జరిపిన అన్ని సర్వేలలోనూ వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించబోతోందని చాటుతున్నాయి. తాజాగా ‘ఇండియా టుడే’ సర్వేలో వైఎస్ఆర్సీపీకి టీడీపీ కంటే ప్రజాదరణలో తొమ్మిది శాతం ఆధిక్యం ఉన్నట్టు తేలింది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను బలవంతం చేసి తెలంగాణ ఎన్నికల ముందు ఫలితాలు చెప్పించిన సర్వే వంటి సర్వేలు కావు ఇవి. సాధారణంగా వార్తలూ, వ్యాఖ్యల విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే జాతీయ టీవీ చానళ్ళే ఈ సారి ఆయన పరాజయం ఖాయమని అంటున్నాయి. మీడియాను కానీ మరో వ్యవస్థను కానీ సుముఖం చేసుకొని ‘మేనేజ్’ చేసే విద్య చంద్రబాబుకి ఉన్నదనే విషయం లోకానికి తెలుసు. అటువంటి విద్య జగన్మోహన్రెడ్డికి బొత్తిగా లేదు. తాను చేసే అక్రమాలనూ, మోసాలనూ ప్రత్యర్థులకు ఆపాదించి నిందించడం జగన్ మోహన్‌రెడ్డికి అలవాటంటూ చంద్రబాబు మరో విమర్శ చేశారు. తెలంగాణలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు సంతలో పశువులాగా అమ్ముడుపోయారంటూ నిందించిన చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను ఎడాపెడా కొనేశారు. బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారంటూ, పశువుల కంటే హీనంగా ఎంఎల్ఏలు అమ్ముడుపోతున్నారనీ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారనీ చంద్రబాబు తీవ్రమైన ఆవేదన వెలి బుచ్చారు. ఆయనలోని అపరిచితుడు ఎప్పుడు బయటికి వచ్చి ఏమి అంటాడో ఆయనకే తెలియదు. తాను వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలచేత పార్టీ ఫిరాయింప జేసిందీ, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిందీ చంద్రబాబు మరచిపోయి ఉంటారా? అది సెలక్టివ్ ఆమ్నీసియా ఫలితమా? మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలే చెప్పాలి. -కె. రామచంద్రమూర్తి -
ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల తేడాలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. బాబు అండ్ కో మళ్లీ దొంగ ఎత్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్‌కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు. ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
తెలంగాణ ఎన్నికలపై అనుమానాలున్నాయి
-
లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం
సాక్షి, అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రాజగోపాల్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు చంద్రబాబును కలిసేందుకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు వారిని అలాగే కూర్చోబెట్టి రాజగోపాల్, రాధాకృష్ణతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి తాను చేసిన సర్వేలో చంద్రబాబుకు అనుకూలంగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లగడపాటిని చంద్రబాబు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. వాటితో ప్రజల అభిప్రాయాన్ని మార్చడం, లేకపోతే గందరగోళపరచడం కోసం లగడపాటిని ఉపయోగించుకునేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తరచూ లగడపాటిని చంద్రబాబు కలుస్తున్నారు. -
చంద్రబాబును కలిసిన లగడపాటి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని తెలిపారు. -
తప్పుడు సర్వేలను పాతరేశారు: ఈటల
హుజూరాబాద్: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచిన ఆయన.. మొదటిసారిగా హుజూరాబాద్‌కు వచ్చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని చూశారని, కానీ ఇక్కడ బాబు కుట్రలు చెల్లలేదన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాదు కదా ఆంధ్రాలో కూడా గెలువలేడని చెప్పారు. రేవంత్‌రెడ్డి వంటి కొందరు పిట్టల దొరలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియా, ఆంధ్ర పత్రికల్లోనే కూటమి ఉందని, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, 90 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. -
జాడలేని చిలక జోస్యం
సాక్షి, అమరావతి: తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్‌గేమ్‌కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లగడపాటి చెప్పిన మాటలకు, వెలువడిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. (వికటించిన రాజకీయ కుట్ర!) ఎవరి కోసమో రూపొందించినట్టు, ఒక పార్టీ ప్రయోజనం కోసమే అన్నట్టుగా ఏమాత్రం శాస్త్రీయత లేని సర్వే ఫలితాలను లగడపాటి వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఫలితాలు అంచనాలకే అందడం లేదని తొలుత చెప్పిన లగడపాటి, ఆ తర్వాత ప్రజానాడి కూటమి వైపే ఉందన్నారు. ఆయన చెప్పిన సర్వే వివరాలన్నీ రాజకీయంగా ప్రజా కూటమిని గట్టెక్కిండానికి, టీఆర్ఎస్ను దెబ్బతీయడానికే అన్నట్టు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నారనే భ్రమలు కల్పించడం, బీజేపీ బలం పెరుగుతోందని చెప్పడం... ఇలా ప్రతీ అంశంలోనూ లగడపాటి ఎవరి ప్రయోజనం కోసమే సర్వే చేసినట్టుగా సుస్పష్టమైంది. ఎక్కడైనా పోలికుందా? ఎన్నికల్లో ప్రజాకూటమి 65 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించి, అధికారం దిశగా పరుగులు పెడుతుందనేది లగడపాటి సర్వే సారాంశం. టీఆర్ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ, ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీడియా ముందుకు మొదటిసారి వచ్చిన లగడపాటి స్వతంత్ర అభ్యర్థులు 8 నుంచి 10 మంది గెలుస్తారని అన్నారు. వీరిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు. అయితే, ఈ ఇద్దరూ గెలవకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే లగడపాటి మాటల ఉద్దేశమని తెలుస్తోంది. బెల్లంపల్లి, బోథ్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణపేట, మక్తల్, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారనే భ్రమ కల్పించి, అంతిమంగా టీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా సర్వే పేరిట పక్కా స్కెచ్ వేసినట్టు తేటతెల్లమవుతోంది. మొత్తం మీద 8 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పరోక్షంగా కూటమికి మేలు చేయడానికే లగడపాటి సర్వే నాటకాలు ఆడినట్లు స్పష్టమతోంది. బీజేపీ బలపడిందట! ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికి బీజేపీ బలపడిందని, కొన్నిచోట్ల టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. బీజేపీ పోటీలో ఉన్న ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్‌పేటను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లింల ఓట్లను వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కు దూరం చేసే ఎత్తుగడ సర్వేలో కన్పించింది. ముస్లింల ఓట్లు తెరాస కంటే కాంగ్రెస్‌కు ఎక్కువగా పడతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? కీలకమైన సమయాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం లగడపాటి రాజగోపాల్‌కు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ వర్గాల్లో ఓ విమర్శ ఉంది. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ లగడపాటి ఇదే తరహాలో వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. అది నిజమని నమ్మించడానికి తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రావతరణ తర్వాత లగడపాటి ముఖం చాటేశారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన సర్వే ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాసేపు ప్రీపోల్... ఇంకాసేపు ఎగ్జిట్ పోల్ లగడపాటి సర్వే ఫలితాలను ప్రజా కూటమి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే, ఎన్నికల ముందు, తర్వాత ఆయన వెల్లడించిన ఫలితాల సందర్భంగా ఆయనే కొంత గందరగోళానికి గురయ్యారు. అవన్నీ ప్రీపోల్ సర్వే అని కొన్నిసార్లు, ఎగ్జిట్‌పోల్ అని మరికొన్ని సార్లు చెప్పారు. ప్రీపోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్‌ను అంచనా వేసే అవకాశం లేదు. ఎగ్జిట్‌పోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ ఎటువైపు అని చెప్పడంలో లగడపాటి జోస్యంలో స్పష్టత కన్పించలేదు. మొత్తం మీద చంద్రబాబు గుప్పిట్లో చిక్కిన చిలుకలా లగడపాటి ఆయనకు అనుకూలంగా సర్వే జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. లగడపాటి అమ్ముడుపోయారనే ముద్ర వేసుకున్నారని ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. భ్రమ కల్పించే ఎత్తుగడ తెలంగాణ ఓటర్ స్పీడుగా మారుతున్నాడని భ్రమ కల్పించేందుకు లగడపాటి చాకచక్యంగా వ్యవహరించారు. నిన్న ఆలోచన ఈ రోజు లేదు, ఈ రోజుది రేపు ఉండదంటూ చెప్పారు. ఓటరును మార్చే మైండ్‌గేమ్ అందులో కన్పిస్తోంది. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది కూటమికి అనుకూలమని చెప్పడం వెనుక కుట్ర తెలుస్తోంది. మొత్తం మీద ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి వ్యవహరించినట్టు వెల్లడవుతోంది. లగడపాటి సర్వేతో బెట్టింగ్ రాయుళ్ల కుదేలు ఆంధ్ర ఆక్టోపస్‌గా చెప్పుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మీద ఉన్న నమ్మకం వందలాది మంది నిండా మునిగారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం కారణంగా మహాకూటమిపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టిన వేలాది మంది చేతులు కాల్చుకుని లబోదిబోమంటున్నారు. మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఆయనతో సర్వే వివరాలు పలికిస్తే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టడంతో ఆయన సామాజికవర్గమంతా గగ్గోలు పెడుతోంది. నమ్ముకుంటే నట్టేట ముంచాడంటూ వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇలా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు రూ.1,200 కోట్లకు పైగా వారు నష్టపోయినట్లు అంచనా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుండడంతో టీడీపీ నేతలు వెనకుండి లగడపాటితో సర్వే పేరుతో పాచికలు వేశారని వారంతా అనుమానిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని పందాలు కట్టిన వారంతా చివరి నిమిషంలో టీఆర్ఎస్వైపు మారేందుకు ప్రయత్నాలు చేసినా, అప్పటికే సమయం మించిపోవడంతో వారికి పందాలు దొరకని పరిస్థితి నెలకొంది. సర్వే తుస్‌మందని ఓ వైపు అందరు అంటుంటే ఆయన మాత్రం మరోవిధంగా లబ్ధిపొందారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. -
‘పోతారు సార్’... లగడపాటి ఎక్కడికి పోయారు?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌తో ఆట అంటే ఆషామాషి కాదు. అలాంటి కేసీఆరే ఓటమి పాలవ్వబోతున్నారని ఆంధ్ర అక్టోపస్‌గా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ హింట్ ఇచ్చారు. సర్వేల పేరిట పోలింగ్‌కు ముందు రోజు ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిన రాజగోపాల్.. తన సర్వేలో భాగంగా గజ్వేల్‌ను సందర్శించానని.. అక్కడ టీ కోసం ఆగితే కొందరు కానిస్టేబుళ్లు వచ్చి.. తనను పలకరించారని, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘పోతారు సార్’ అని ఆ కానిస్టేబుళ్లు బదులిచ్చారని కొంచెం నిగూఢంగా, కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోతారు సర్’ అన్న ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశమేమిటో అందరికీ తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్ కూడా ఓడిపోబోతున్నారని పరోక్షంగా రాజగోపాల్ చెప్పినట్టు అప్పుడు భావించారు. అంతేకాదు.. పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. ప్రజానాడి మహాకూటమికి అందిందని, పోలింగ్‌శాతం పెరిగితే.. కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేల పేరిట తనదైన చిలుక జోస్యాలు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత యథాలాపంగా మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. కూటమి 55 నుంచి 75 స్థానాలు, టీఆర్ఎస్ 25 నుంచి 45 స్థానాలు గెలుపొందుతారని జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని టీఆర్ఎస్కు అనుకూలంగా.. కొంచెం హోరాహోరీగా ఉంటాయని అంచనాలు వేస్తే.. లగడపాటి మాత్రం కూటమికే మొగ్గు చూపారు. ఆయన వెలువరించిన సర్వే అంచనాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ఓటర్లను గందరగోళ పరచడానికి లగడపాటి ఈ విధంగా సర్వేల పేరిట గోల్మాల్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకాలంలో దీక్షల పేరిట లగడపాటి డ్రామాలు ఆడిన విషయాన్ని వారు గుర్తుచేశారు. దీక్ష పేరిట లగడపాటి మారువేషంలో హైదరాబాద్‌కు రావడం.. పరిగెత్తుకుంటూ వచ్చి నిమ్స్ ఆస్పత్రిలోని చేరడం వంటి నాటకాలను వారు ఉదహరించారు. అప్పుడు లగడపాటి ఆడిన ఆసుపత్రి డ్రామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏదిఏమైనా.. లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అని మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలు చాటుతున్నాయి. కూటమికి అనుకూలంగా ఆయన చెప్పిన జోస్యంలో ఇసుమంతైనా నిజం కాకపోవడాన్ని ఇప్పుడు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాదని, తెలంగాణ వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడంతో గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఆయన మనస్సులో ఏముందో కానీ.. తెలంగాణ ఎన్నికల సర్వే పేరిట తెరపైకి వచ్చి హంగామా చేశారు. ఇప్పటివరకు లగడపాటి సర్వే చేస్తే.. అది చాలావరకు నిజమవుతుందనే అంచనా ప్రజలకు ఉండేది. తాజాగా వెలువరించిన సర్వేతో ఆయన తనకున్న విశ్వసనీయతను కోల్పోయారు. తెలంగాణ రావడంతో రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. తాజాగా వెలువరించిన తప్పుడు సర్వేతో.. సర్వే సన్యాసం కూడా తీసుకుంటారా? అని నెటిజన్లు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. -
‘ఎంపీ టికెట్ కోసమే లగడపాటి సర్వే’
సాక్షి, తిరుపతి : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్ ఆరోపించారు. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కాగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఇదివరకే ఆయన సర్వే ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.