హైకోర్టులో లాయర్‌పై కొడుకు కత్తితో దాడి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై హైకోర్టులో న్యాయవాది మణిమారన్పై కన్న కొడుకే కత్తితో దాడి చేశాడు. హైకోర్టు ఆవరణలో భారీ భద్రతను తప్పించుకుని నిందితుడు కత్తితో కోర్టులోకి ప్రవేశించాడు. న్యాయవాదులు, సిబ్బంది, క్లయింట్లు చూస్తుండగానే తండ్రిపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో కోర్టులో ఉన్నవారు షాకయ్యారు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మణిమారన్ కు, ఆయన కొడుకుకు మధ్య విబేధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.