lip surgery
-
షాకింగ్ : రకుల్‌కు సర్జరీ వికటించిందా? అందుకేనా ఇలా!
Rakul Preet Singh Undergo Lip Surgery?: హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోలో న్యూలుక్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. రకుల్ ముఖంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకుల్ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అసలు ఆమె రకుల్ ఏనా? ఇలా తయారయ్యింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.చదవండి : నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పటికే వ్యాయామంతో బక్కచిక్కి కళ తగ్గిపోయిన రకుల్ మరోసారి సర్జరీతో మరింత దారుణంగా మారిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ సర్జరీ వికటించడం వల్లే రకుల్ పెదాలు ఇలా మారిపోయాయి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటారన్న విషయం తెలిసిందే. గతంలో రకుల్ ముక్కకి కూడా సర్జరీ చేయించుకుందనే ప్రచారం ఉంది. దీంతో రకుల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా తయారైపోయింది అంటూ పలువురు ఆమె పాత ఫోటోలను పోల్చి చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రకుల్ ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా కొండపొలం. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. చదవండి : ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూత View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సెల్ఫీ మోజుతో లిప్ సర్జరీలకు క్యూ
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అందమైన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిత్యకృత్యమయ్యింది. బుంగమూతి సెల్ఫీలకు క్రేజ్ పెరుగుతుండడంతో యువత అటువంటి సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాలో 2015లో ప్రతీ 19 నిమిషాలకు ఒక లిప్ సర్జరీ జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. ఒక్క 2015లోనే అమెరికాలో 27,449 లిప్ సర్జరీలు జరిగాయని అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్స్ సొసైటీ తెలిపింది. సెల్ఫీల్లో ఆకర్షణగా నిలిచే పెదాలను అందంగా చేసుకోవడానికే యువ త లిప్ సర్జరీల వైపు చూస్తున్నారని ప్లాస్టిక్ సర్జన్ డేవిడ్ తెలిపారు. -
పెదాలకు సర్జరీ చేయించుకోలేదు..
తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానన్నది పుకారేనని బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పష్టం చేసింది. ‘జబ్ తక్ హై జాన్’ సినిమాతో తెరంగేంట్రం చేసిన ఈ 25 ఏళ్ల చిన్నది పెదాలు మొదట్లో కొంచెం లావుగా ఉండేవి. అయితే ఏడాదిగా వాటిలో కనిపిస్తున్న మార్పును గమనిస్తున్న సెట్జన్లు తమ ట్విట్టర్లలో పలు కామెంట్లుచేస్తున్నారు. దాంతో ఆమె ట్విట్టర్లోనే సమాధానం చెప్పింది. ‘నా పెదాలు సన్నగా కనబడటానికి మేకప్ టెక్నిక్స్ వాడుతున్నా. ప్రస్తుత నా సినిమా ‘కాఫీ విత్ కరణ్’లో నా పాత్ర కొంత విభిన్నంగా కనిపించాలి. దాంతో నా ముఖకవళికల్లో కొంత మార్పు తీసుకురావడానికి కొన్ని చిట్కా లు పాటించాల్సి ఉంది. అందులో భాగంగానే పెదాల్లో కొంత తేడా రావడానికి మేకప్ టెక్నిక్స్‌తోపాటు తాత్కాలికంగా ఒకరకమైన పని ముట్టు వాడుతున్నాను. అంతేగాని.. నేను నా పెదాలకు ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీచేయించుకోలేదు.. అనుచిత విధానాలు వాడలేదు..’ అని అందులో వాపోయింది. ఒక ప్రైవేట్ వ్యక్తిగా తన వ్యక్తిగత విషయాలను మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉన్నా.. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికే ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చుకుంది. ‘నా రాబోయే ‘బోంబే వెల్వెట్’ సినిమాలో పాత్ర పెదాలు పల్చగా కనిపించాలి. ఆ సినిమాలో పాత్రను పండించడానికి నేను పెదాల్లో మార్పు కోసం సిద్ధపడ్డాను. ఆ సినిమాలో నేను 1960-70 మధ్య కాలం నాటి జాజ్ సింగర్ పాత్రను పోషించాను. ఆ పాత్రానుసారం నేను నాలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి కదా..’ అని ప్రశ్నించింది. అలాగే కాఫీ విత్ కరణ్ సినిమాలో తనలో కనిపించిన విపరీతమైన మార్పు కేవలం పెదాల వల్లే రాలేదని, దానికి పలు అంశాలు దోహదపడ్డాయని చెప్పింది. ఇకనైనా తనపై రూమర్లు ఆపాల ని కోరింది. తనకు ఈ ప్లాస్టిక్ సర్జరీపై ఎటువంటి నమ్మకాలు లేవంది. తన శరీరంలో ఏ భాగంలోనూ శాశ్వత మార్పులు చేయించుకోవాలని లేదని ఖరాఖండిగా చెప్పింది.