పెదాలకు సర్జరీ చేయించుకోలేదు..
తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానన్నది పుకారేనని బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పష్టం చేసింది. ‘జబ్ తక్ హై జాన్’ సినిమాతో తెరంగేంట్రం చేసిన ఈ 25 ఏళ్ల చిన్నది పెదాలు మొదట్లో కొంచెం లావుగా ఉండేవి. అయితే ఏడాదిగా వాటిలో కనిపిస్తున్న మార్పును గమనిస్తున్న సెట్‌జన్లు తమ ట్విట్టర్లలో పలు కామెంట్లుచేస్తున్నారు. దాంతో ఆమె ట్విట్టర్‌లోనే సమాధానం చెప్పింది. ‘నా పెదాలు సన్నగా కనబడటానికి మేకప్ టెక్నిక్స్ వాడుతున్నా. ప్రస్తుత నా సినిమా ‘కాఫీ విత్ కరణ్’లో నా పాత్ర కొంత విభిన్నంగా కనిపించాలి. దాంతో నా ముఖకవళికల్లో కొంత మార్పు తీసుకురావడానికి కొన్ని చిట్కా లు పాటించాల్సి ఉంది. అందులో భాగంగానే పెదాల్లో కొంత తేడా రావడానికి మేకప్ టెక్నిక్స్‌తోపాటు తాత్కాలికంగా ఒకరకమైన పని ముట్టు వాడుతున్నాను. అంతేగాని.. నేను నా పెదాలకు ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీచేయించుకోలేదు.. అనుచిత విధానాలు వాడలేదు..’ అని అందులో వాపోయింది.
ఒక ప్రైవేట్ వ్యక్తిగా తన వ్యక్తిగత విషయాలను మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉన్నా.. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికే ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చుకుంది. ‘నా రాబోయే ‘బోంబే వెల్వెట్’ సినిమాలో పాత్ర పెదాలు పల్చగా కనిపించాలి. ఆ సినిమాలో పాత్రను పండించడానికి నేను పెదాల్లో మార్పు కోసం సిద్ధపడ్డాను. ఆ సినిమాలో నేను 1960-70 మధ్య కాలం నాటి జాజ్ సింగర్ పాత్రను పోషించాను. ఆ పాత్రానుసారం నేను నాలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి కదా..’ అని ప్రశ్నించింది. అలాగే కాఫీ విత్ కరణ్ సినిమాలో తనలో కనిపించిన విపరీతమైన మార్పు కేవలం పెదాల వల్లే రాలేదని, దానికి పలు అంశాలు దోహదపడ్డాయని చెప్పింది. ఇకనైనా తనపై రూమర్లు ఆపాల ని కోరింది. తనకు ఈ ప్లాస్టిక్ సర్జరీపై ఎటువంటి నమ్మకాలు లేవంది. తన శరీరంలో ఏ భాగంలోనూ శాశ్వత మార్పులు చేయించుకోవాలని లేదని ఖరాఖండిగా చెప్పింది.