luxury car market
-
ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ!
సాక్షి, ముంబై: సూపర్-లగ్జరీ కార్ల విక్రయాలు సూపర్ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బిలియనీర్ల కారణంగా కరోనా సంక్షోభంలో కూడా రూ. 2 కోట్లకు పైగా విలువున్న కార్లను హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత దేశీయ కుబేరులు లగ్జరీ కార్లను ఎగరేసుకుపోతున్నారట. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనాకి ముందున్న గరిష్ట స్థాయిలను అధిగమించే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2018లో భారతదేశంలోని అత్యంత సంపన్నులు రూ. 2 కోట్లకు పైగా ధర కలిగిన 325 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు 2020లో వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్లో పదివేల యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎకనామిక్స్ టైమ్స్ ఒక రిపోర్టులో తెలిపింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇటాలియన్ సూపర్-లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని, ఆర్థిక అనిశ్చితి పరిస్థితిల్లో కూడా కార్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. 2022 మొదటి ఐదు నెలల్లో ఊహించిన దానికంటే ట్రెండ్ బాగా పుంజుకుందని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్‌ని పేర్కొన్నారు. ఈ నెంబర్లు సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ సామర్థ్యం కంటే ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్యను ప్రతిబింబిస్తోందన్నారు. ఇంతకుముందు మూడో/ నాల్గవ తరం వ్యాపారులకు మాత్రమే లగ్జరీ కార్లను విక్రయించాం కానీ ఇపుడు మొదటి తరం వ్యాపారవేత్తలు, మహిళలు, ఇతరులతో తమ కస్టమర్ బేస్ మరింత విస్తరించిందని అగర్వాల్ వెల్లడించారు. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మెర్సిడెస్ బెంజ్ హై-ఎండ్ లగ్జరీ కార్ల వాటా 2018లో 12 శాతంతో పోలిస్తే 2022లో 29 శాతానికి రెండింతలు పెరిగింది. దాదాపు 5వేల మందిలో మూడింట ఒక వంతు మంది తమ లగ్జరీ కారు వినియోగిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. 2021లో 2వేల లగ్జరీ కార్లను విక్రయించిన బెంజ్ చేతిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయిట. కాగా ఇటీవల లంబోర్ఘిని అవెంటడోర్ అవెంటోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని అంచనా ధర సుమారు 8-10 కోట్లు. లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రపంచవ్యాప్తంగా 600 కార్లను రిలీజ్ చేయగా ఇప్పటికే అన్ని కార్లు బుక్ అయిపోయాయి. ఇందులో ఇండియా నుంచి ఒకరు ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: Lamborghini Aventador Ultimae: వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్ -
సెకండ్‌హ్యాండ్ లగ్జరీ కార్లకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటా కొత్త లగ్జరీ కార్లు సుమారు 30,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. కొత్త వాటితో పోలిస్తే పాత (సెకండ్ హ్యాండ్) లగ్జరీ కార్లు ఏకంగా రెండింతలు చేతులు మారుతున్నాయట. దీనికంతటికీ కారణం కస్టమర్లు తక్కువ ధరలో లగ్జరీని కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కారు కంటే మెరుగైన మోడల్, ఖర్చు చేసిన దానికంటే విలువైనది కోరుకోవడం, ఉన్నతంగా ఉండాలన్న ఆకాంక్ష.. వెరసి ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారుకు సై అంటున్నారట. తొలిసారిగా కొత్త లగ్జరీ కారు కొనే ముందు పాతదాన్ని సొంతం చేసుకుంటున్నవారు ఎక్కువేనని కంపెనీలు చెబుతున్నాయి. ప్రీ-ఓన్డ్ కార్లకు రిపేర్లు చేసి నాణ్యత ధ్రువీకరణ, వారంటీతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడంతో వినియోగదార్లలో వీటిపట్ల ఆసక్తి పెరిగింది. రెండు మూడేళ్లకే మారుస్తున్నారు.. లగ్జరీ కార్ల యజమానులు ఎక్కువ మంది రెండు మూడేళ్లకే వాహనాన్ని మారుస్తున్నారట. ఆరు నెలలు కూడా ఉపయోగించకుండానే కారును అమ్మేసి మరో కొత్త మోడల్ స్టీరింగ్ తిప్పే కస్టమర్లూ ఉన్నారు. లగ్జరీ కారు సొంతం చేసుకోవడం గతంలో ఒక కల. ఇప్పుడు విరివిగా ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. పైగా నాలుగేళ్లకే ధర సగానికి వచ్చి చేరుతోంది. ఇక లంబోర్గిని కొత్తది కావాలంటే కనీసం రూ.4 కోట్లు ఖర్చు చేయాలి. పదేళ్ల ప్రీ-ఓన్డ్ కారైతే రూ.50 లక్షలకే దొరుకుతోందని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూ.5 లక్షల నుంచి పాత లగ్జరీ కార్లు లభిస్తాయని చెప్పారు. చిన్న కారు ధరలో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారు కొనుక్కోవచ్చని అన్నారు. రూ.10 లక్షల్లో జాగ్వార్, ల్యాండ్ రోవర్ సైతం లభిస్తున్నాయని తెలిపారు. ఒక్కో కంపెనీ ఒక్కోలా.. బీఎండబ్ల్యూ గతేడాది 6,600 కొత్త కార్లను విక్రయించింది. యూజ్డ్ కార్ల కోసం ఏర్పాటు చేసిన బీఎండబ్ల్యూ ప్రీమియం సెలెక్షన్ ద్వారా 1,600 యూనిట్లు అమ్మింది. ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ప్రీ-ఓన్డ్ కార్లను ఈ షోరూంల ద్వారా విక్రయించింది. బీఎండబ్ల్యూ 3, 5, ఎక్స్1 సిరీస్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. సంస్థ మొత్తం కార్ల అమ్మకాల్లో 25 శాతం ప్రీ–ఓన్డ్ ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ చెబుతోంది. ఈ కంపెనీకి చెందిన సి-క్లాస్, ఈ-క్లాస్ సెడాన్స్ అధికంగా చేతులు మారుతున్నాయి. ఎంట్రీ లెవెల్ కస్టమర్లపై ఫోకస్ చేసేందుకు యూజ్డ్ కార్లు దోహదం చేస్తున్నాయని ఆడి అంటోంది. ప్రతి కారు కనీసం రెండుసార్లు అమ్ముడవ్వాలన్నది కంపెనీ లక్ష్యం. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్, రేంజ్ రోవర్స్, లంబోర్గిని యూరస్, బీఎండబ్ల్యూ ఎక్స్7 హాట్ సెల్లర్స్ అని లగ్జరీ కార్ల రిటైల్‌లో ఉన్న బిగ్ బాయ్ టాయ్జ్ చెబుతోంది. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
భారత లగ్జరీ మార్కెట్లోకి వోల్వో పరుగులు
గోథెన్బర్గ్ : స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్పొరేషన్, భారత లగ్జరీ కార్ల మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి వరుసగా కాంపాక్ట్ సిరీస్‌తో మొదలుపెట్టి పలు మోడళ్లను ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. కాంపాక్ట్ సిరీస్ తర్వాత ఎస్యూవీ కాన్సెప్ట్ 40.1, సెడాన్ కాన్సెప్ట్ 40.2లను భారత్ రోడ్లపై పరుగెత్తించాలని కంపెనీ భావిస్తోంది. అయితే గతవారమే ఈ 40 కాంపాక్ట్ సిరీస్ కార్లను స్వీడన్‌లోని తన ప్రధాన కార్యాలయం గోథెన్బర్గ్ లో వోల్వో ప్రవేశపెట్టింది. ప్రత్యర్థి కార్ల తయారీ కంపెనీలు మొదట ప్రవేశపెట్టిన లగ్జరీ మోడల్స్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడీ క్యూ3, ఆడీ ఏ3, మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఈలకు పోటీగా ఈ లగ్జరీ కార్లను ప్రవేశపెట్టాలనుకుంటోంది. అయితే పట్టణ యువతను ఈ మోడల్ కార్లు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. భారత మార్కెట్లోకి మొదట రాబోతున్న కార్ల ధర రూ. 26 లక్షలకు పైగా ఉండబోతున్నట్టు అంచనా. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ లో ప్రవేశపెట్టబోయే ఎస్‌యూవీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ మెర్టెన్స్ చెప్పారు. బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో ఈ కార్ల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి కనపడుతోందన్నారు. ఎస్యూవీ, సెడాన్ మోడళ్లతో పాటు 40 సిరీస్ హాచ్ బ్యాక్ మోడళ్లను కూడా వోల్వో సంస్థ అభివృద్ధి చేయనుంది. ఈ స్వీడిష్ కంపెనీ వచ్చే నెలల్లో హైబ్రిడ్ వెర్షన్ ఎస్ యూవీ ఎక్స్ సీ90ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించబోతుంది.