luxury jet
-
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. -
మాల్యా లగ్జరీ జెట్ ఎట్టకేలకు అమ్ముడుపోయింది
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెందిన లగ్జరీ జెట్‌కు కొనుగోలుదారుడు దొరికాడు. ఎట్టకేలకు ఈ జెట్ అమ్ముడుపోయింది. మూడు వేలం పాటలో కొనేవారే కరువైన ఈ జెట్‌కు, తాజాగా జరిగిన వేలంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్, ఎల్ఎల్సీ ఈ జెట్ వేలంలో అత్యధిక బిడ్ వేసి మాల్యా లగ్జరీ జెట్‌ను దక్కించుకుంది. బిడ్ ధర రూ.34.8 కోట్లుగా(5.05 మిలియన్ డాలర్లుగా) ఉంది. ఈ బిడ్‌ను బాంబే హైకోర్టు ఆమోదించింది. సేవా పన్ను విభాగం నిర్వహించిన ముందస్తు ఈ-వేలాల కంటే ఇది అత్యధిక బిడ్ అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీని బిడ్ తొలుత 1.9 మిలియన్ డాలర్లకు ప్రారంభమైంది. మాల్యా జెట్ పేరు ఎయిర్‌బస్ ఏ319-133సీ వీటీ-వీజేఎం ఎంఎస్ఎం 2650. కర్ణాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ అయిన సేవా పన్ను విభాగం ఈ వేలం నిర్వహించింది. ఈ వేలంతో మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సేవా పన్ను విభాగానికి రుణపడిన బకాయిలను, జరిమానాలను రికవరీ చేసుకునేందుకు వీలవుతుంది. ఈ జెట్‌లో 25 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణించే వీలుంటుంది. ఈ జెట్‌లోనే బెడ్రూం, బాత్రూం, బార్, కాన్ఫరెన్స్ ప్రాంతం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ జెట్‌ను సేవా పన్ను విభాగం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ముంబైలో పార్క్‌చేసి ఉంచింది. దీన్ని ఎయిర్‌పోర్టు నుంచి తొలగించాలని ఫిర్యాదులు కూడా బాంబే హైకోర్టులో దాఖలయ్యాయి. ఎయిర్‌పోర్టులో ఈ జెట్‌ను ఉంచడానికి స్థలం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సేవా పన్ను విభాగం తెలిపింది. పార్క్ అయిన జెట్ వల్ల గంటకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు కోల్పోతున్నామని పేర్కొంది. కర్నాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ దీన్ని విక్రయించాలని ఏప్రిల్‌లోనే బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఎయిర్‌లైన్ బెంగళూరుకు చెందినది. -
అత్యంత ఖరీదైన లగ్జరీ జెట్
ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రైవేటు జెట్లలో ఒకటి. పేరు స్కైయాచ్ వన్. విలాసవంతమైన నౌకలో ప్రయాణించాలా లేక ప్రైవేటు జెట్‌లో వెళ్లాలా అనే సంశయంలో ఉండే సంపన్నుల కోసం దీన్ని డిజైన్ చేశారట. ఈ రెండింటిలో ఉండే సదుపాయాలను కలిపి దీన్ని రూపొందించారట. స్కైయాచ్ వన్ను అమెరికాకు చెందిన సొటో స్టూడియోస్ సంస్థ డిజైన్ చేసింది. అత్యంత నాణ్యమైన కలపతో ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. ఇందులో 5 విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. డైనింగ్, కాన్ఫరెన్సు రూం, బార్, మాస్టర్ బెడ్రూం, షవర్ ఇలాంటివెన్నో సదుపాయాలు ఈ లగ్జరీ జెట్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఇది డిజైన్ మాత్రమే. లగ్జరీకి చిరునామాగా నిలిచే జెట్‌లో ప్రయాణించాలనుకునే సంపన్నులు ఆర్డర్ ఇస్తే చాలు.. పని మొదలు పెట్టేస్తారట. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.550 కోట్లు.