అత్యంత ఖరీదైన లగ్జరీ జెట్ | america soto studios skyacht one luxury jet | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన లగ్జరీ జెట్

Published Sat, Jan 9 2016 2:49 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అత్యంత ఖరీదైన లగ్జరీ జెట్ - Sakshi

అత్యంత ఖరీదైన లగ్జరీ జెట్

ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రైవేటు జెట్‌లలో ఒకటి. పేరు స్కైయాచ్ వన్. విలాసవంతమైన నౌకలో ప్రయాణించాలా లేక ప్రైవేటు జెట్‌లో వెళ్లాలా అనే సంశయంలో ఉండే సంపన్నుల కోసం దీన్ని డిజైన్ చేశారట. ఈ రెండింటిలో ఉండే సదుపాయాలను కలిపి దీన్ని రూపొందించారట.

స్కైయాచ్ వన్‌ను అమెరికాకు చెందిన సొటో స్టూడియోస్ సంస్థ డిజైన్ చేసింది. అత్యంత నాణ్యమైన కలపతో ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. ఇందులో 5 విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. డైనింగ్, కాన్ఫరెన్సు రూం, బార్, మాస్టర్ బెడ్రూం, షవర్ ఇలాంటివెన్నో సదుపాయాలు ఈ లగ్జరీ జెట్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఇది డిజైన్ మాత్రమే. లగ్జరీకి చిరునామాగా నిలిచే జెట్‌లో ప్రయాణించాలనుకునే సంపన్నులు ఆర్డర్ ఇస్తే చాలు.. పని మొదలు పెట్టేస్తారట. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.550 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement