madhusudhan reddy
-
‘కేటీఆర్ అపరిచితుడిలా మాట్లాడుతున్నాడు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు సీఎల్పీ మధుసూదన్ రెడ్డి. తప్పు చేసింది మీరైతే.. విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టే బయటకు రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ మధుసూదన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ మాటల్లోనే డొల్లతనం బయటపడింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఒకలా.. నమోదు చేశాక అపరిచితుడులా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కేసు కొట్టేయాలంటూ కోర్టులకు వెళ్లి మరీ మొట్టికాయలు తిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నిన్న ఈడీ విచారణ సందర్బంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.ఈడీ వాళ్లు.. ఏసీబీ అడిగిందే అడుగుతున్నారు అని చెప్పారు. నేరం ఒక్కటే అయినప్పుడు ఇంకేం అడుగుతారు. కేటీఆర్‌కు చేయాల్సింది.. లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలి. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేసి.. విచారణకు సీఎంను రమ్మని అడుగుతారా?. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. బయటకు రావడం లేదు. మీ హయాంలో ప్రతిపక్షనేతల కేసులకు మీరు విచారణకు వెళ్ళారా?.కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసింది. మీ హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తున్నా నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
శ్రీకాళహస్తిలో రెస్టారెంట్ కూల్చివేత కక్షసాధింపే
తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలో రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేత కూటమి ప్రభుత్వ కక్షసాధింపే అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేతను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాళహస్తిని మధుసూదన్‌రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.చంద్రబాబు బెదిరింపులకు, కేసులకు భయపడే తత్వం వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచి్చన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలు గ్రహిస్తున్నారని, చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
అభివృద్ధి చేయాలి కానీ.. కూల్చివేతలకు కుట్రలు చేయొద్దు: మధుసూదన్ రెడ్డి
-
‘సీతా కళ్యాణ వైభోగమే’ పెద్ద విజయం సాధించాలి: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
సుమన్ తేజ్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘యుగంధర్ నిర్మించిన ‘సీతా కల్యాణ వైభోగమే’ టైటిల్ చూస్తే, ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తోంది. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.‘‘కొన్ని వందల స్క్రిప్ట్స్ విన్నాం. ఫైనల్‌గా ఈ సినిమాతో జర్నీ మొదలైంది’’ అన్నారు సుమన్ తేజ్. ‘‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత క్యారెక్టర్లో గరీమ చక్కగా నటించారు’’ అన్నారు గగన్ విహారి. ‘‘మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించాం’’ అన్నారు సతీష్ పరమవేద. ‘‘ఏ మాత్రం పారితోషికం ఆశించకుండా పని చేసిన సంగీతదర్శకుడు చరణ్ అర్జున్‌కు థ్యాంక్స్’’ అన్నారు రాచాల యుగంధర్. -
విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదన్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హాజరయ్యారు. నూతన దంపతులు తేజశ్రీ, అర్జున్‌లను సీఎం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. చదవండి: నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
లోకేష్ వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం
-
ఇంటర్ బోర్డ్లోకి మధుసూదన్‌ను రానివ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డ్‌లో సీసీ కెమెరాల ట్యాంపరింగ్‌కు పాల్పడటమే కాకుండా, వివిధ నేరారోపణలతో సస్పెండైన ప్రభుత్వ లెక్చరర్ పి.మధుసూదన్ రెడ్డికి ఇంటర్ సంస్థల కార్యాలయాల్లో అనుమతి నిషేధిస్తూ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్‌బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (విద్యాభవన్), కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ప్రొఫెసర్ జయశంకర్ విద్యా భవన్), నాంపల్లి కాలేజీ కాంప్లెక్స్‌ల్లోకి మధుసూదన్ రెడ్డి ప్రవేశిస్తే నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అతనితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నా క్రిమినల్ చర్యగానే గుర్తించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోకి మధుసూదన్ రెడ్డి అక్రమంగా ప్రవేశించి, అక్కడి ఉద్యోగిని బెదిరించి సీసీ కెమెరాలను ట్యాంపర్ చేసినట్టు ఇంటర్ బోర్డ్ ఈ నెల 30న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయ డం తెలిసిందే. ఒక మహిళా ఉద్యోగిని మధు సూదన్ రెడ్డి లైంగికంగా వేధించడంతో పాటు ఆయనపై ఉన్న పలు ఏసీబీ, క్రిమినల్ కేసులను నవీన్ మిత్తల్ తన ఆదేశాల్లో వివరించారు. ‘నాపై నిషేధం ఆశ్చర్యంగా ఉంది..’ ఇంటర్మీడియెట్ కార్యాలయాల్లోకి తన ప్రవేశాన్ని నిషేధిస్తూ నవీన్ మిత్తల్ ఇచ్చిన ఉత్తర్వులపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది తన హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు. -
తిరుపతి అంటే గుళ్ళు గుర్తొస్తుండే.. కానీ ఇప్పుడు: మధుసూధన్‌రెడ్డి
-
వ్యాపారి మధుసూదన్ రెడ్డి హత్య కేసులో ట్విస్ట్
-
ఈటల బావమరిదిపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): దళితులను అవమానించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో గురువారం దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లో రుద్రారపు రాంచంద్రం టౌన్ సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇల్లందకుంట మండలకేంద్రంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంటలో జమ్మికుంట జెడ్పీటీసీ, ఎంపీపీ శ్రీరాంశ్యామ్, దొడ్డెమమత, దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జమ్మికుంటలో ఫిర్యాదు చేసిన వారిలో అంబాల ప్రభాకర్, వాసాల రామస్వామి, మైస మహేందర్ తదితరులు ఉన్నారు. -
ఆ వ్యక్తి బతికున్నాడో లేదో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్ బతికి ఉన్నారా లేదా.. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా మరణించితే ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేయాలి కదా.. అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై సమగ్ర సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది. తన భర్త మధుసూదన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత అతని ఆచూకీ తెలియలేదంటూ భార్య మాధవి దాఖలు చేసిన రిట్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ వి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. తన భర్త మధుసూదన్ ఎక్కడ ఉన్నారో తెలియజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె వ్యాజ్యంలో కోరారు. పిటిషనర్ మామ (మధుసూదన్ తండ్రి) కరోనా వచ్చి మరణించారని, ఆ తర్వాత జరిపిన వైద్య పరీక్షల్లో మధుసూదన్‌కు పాజిటివ్ అని తేలడంతో ఏప్రిల్ 30న గాంధీ ఆస్పత్రికి తరలించారని పిటిషనర్ న్యాయవాది కరుణసాగర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. మే 1న ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడారని, ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ చెప్పడం లేదన్నారు. కరోనా నివారణకు చికిత్స పొందుతూ మరణించినట్లుగా గాంధీ ఆస్పత్రి లేదా జీహెచ్ఎంసీ చెప్పడం లేదన్నారు. అయితే ప్రభుత్వం మే 21న వెలువరించిన ప్రకటన మేరకు మరణించినట్లుగా తెలుస్తోందని, అయితే ఈ విషయాన్ని అధికారికంగా పిటిషనర్‌కు గానీ కుటుంబ సభ్యులకుగానీ తెలియజేయలేదన్నారు. కరోనా వల్ల మరణించినప్పుడు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తే ఆ మేరకు వీడియో తీసి సంబంధిత ఏసీపీకి సీడీ ఇవ్వాలని, ఈ విధంగా కూడా చేయలేదన్నారు. మధుసూదన్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక పిటిషనర్ ఆమె పిల్లలకు కూడా కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మే 2న గాంధీకి తరలించి వైద్యం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎవరైనా మరణిస్తే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, అయినా ఈ కేసులో మధుసూదన్ బతికి ఉన్నారో లేదో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను నేటికి వాయిదా వేసింది. -
‘కరువు రైతులను ఆదుకునేందుకు రూ. 2వేల కోట్లు’
సాక్షి, వైఎస్సార్ : కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 2వేల కోట్లతో కెలావిటి రిలీఫ్ ఫండ్‌ను తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పలుచోట్ల పంటల పరిశీలించిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి కరువు పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఈ ఏడాదిలోనే పెట్టుబడి సాయం క్రింద రూ. 12500, అలాగే ప్రభుత్వమే భీమా భరించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్వేల్ వాహనాన్ని ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు ఉచితంగా బోరు వేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా ఇంతవరకు పంటవేయలేని రైతులకు వందశాతం సబ్సిడీ ఉలవ, పేసర విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గతేడాది నుంచి జిల్లాకు రూ. 150 కోట్లు, రాష్ట్రానికి రూ. 2 వేల 400 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి అందాల్సివుందన్నారు. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని రైతులకు ఉపశమనం కల్గించనుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. -
ఇంటర్ గడప దాటగానే 15% డ్రాపౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పని బాట పడుతున్నారు. ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణంకాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియట్ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండడం ఆందోళనకరమైన అంశం. విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల లెక్కలు చూస్తే.. ఇంటర్ పూర్తయ్యాక చదువు మానేస్తున్నవారి శాతం కొన్నేళ్లుగా దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. 2016–17లో ఉత్తీర్ణులైన మొత్తం ఇంటర్ విద్యార్థుల్లో 14 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోగా... 2015–16లో 17 శాతం మంది.. 2014–15లో 15 శాతం మంది పై చదువులకు వెళ్లలేదు. ఇక పదో తరగతికి వస్తే.. 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తయిన వారిలో 4.95 శాతం మంది పైచదువులకు దూరంకాగా.. 2015–16లో 6 శాతం మంది, 2014–15లో 7 శాతం మంది డ్రావుట్స్గానే మిగిలిపోయారు. ఇంటర్ తర్వాత భారీగా.. రాష్ట్రవ్యాప్తంగా 2016–17 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇక ఇంటర్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 1,00,701 మంది చేరగా.. అందులో 10 శాతం మంది ఏపీ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అంటే 90,631 మంది రాష్ట్రవిద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. ఇక డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు. ‘పది’తోనే ఆగిపోయిన 23,820 మంది 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 5,97,064 మంది హాజరుకాగా.. అందులో 4,80,831 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 3,99,377 మంది ఇంటర్లో, 26,594 మంది ఐటీఐలలో, 31,040 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరారు. మొత్తంగా పదో తరగతి పూర్తయిన వారిలో... 4,57,011 మంది వివిధ కోర్సుల్లో చేరగా 23,820 మంది చదువును ఆపేసినట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు వేసింది. 2017–18లో ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరినవారు కోర్సు చేరినవారు బీటెక్ 68,593 బీఫార్మసీ 6,500 డీఎడ్ 10,200 ఎంబీబీఎస్ 3,200 బీడీఎస్ 1,400 ఆయుష్ 695 అగ్రికల్చర్, వెటర్నరీ 500 జాతీయ విద్యా సంస్థలు, విదేశీ చదువుకు వెళ్లిన వారు 9,612 బీఏలో చేరిన వారు 25,599 బీబీఎం 306 బీబీఏ 1,762 బీసీఏ 336 బీకాం 80,696 బీఎస్సీ 91,702 బీఎస్‌డబ్ల్యూ 36 డిగ్రీ వొకేషనల్ 20 ఇదీ చదువుల దుస్థితి.. పదో తరగతి స్థాయి నుంచి.. సంవత్సరం పాసైనవారు పైకోర్సుల్లోకి డ్రాపౌట్ 2014–15 4,44,828 4,13,691 31,137 2015–16 4,37,192 4,10,961 26,231 2016–17 4,80,831 4,57,011 23,820 ఎందుకు ఆపేస్తున్నారు? – పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతోనే మానేస్తున్నట్లు గుర్తించారు. – ఇంటర్ పూర్తయిన వారు మాత్రం ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ భారం మీద పడటంతో చదువులకు దూరమవుతున్నట్లు తేల్చారు. – ఇక పైచదువులకు తగిన సామర్థ్యాలు కొరవడటంతో.. తాను ఇక చదవలేన్న ఆలోచన, ఆత్మన్యూనతా భావంతో చదువు మానేస్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. దీంతో ఏదో ఒక పని చేసుకుని బతుకుదామన్న ధోరణితో చదువుకు దూరమవుతున్నారు. – పై చదువులపై అవగాహన లోపం కూడా కొందరు విద్యార్థులు దూరమవడానికి కారణంగా గుర్తించారు. – పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నవారిలో చాలా మందికి పైచదువులకు వెళ్లాలన్న కోరిక ఉన్నా... పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు చేపట్టాలి.. ‘‘పదో తరగతి, ఇంటర్ తరువాత విద్యార్థులు చదువు మానేయడం మంచిదికాదు. కొద్దిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం కూడా డ్రాపౌట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి..’’ – ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ పి.మధుసూదన్‌రెడ్డి -
రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ ఇంఛార్జి మధుసూదన్ రెడ్డి, రవికిరణ్‌లను విచారించారు. విచారణకు పిలిచినపుడు మళ్లీ హాజరుకావాలంటూ పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. విచారణానంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రవికిరణ్‌కు, వైఎస్ఆర్ సీపీకి ముడిపెట్టేలా ప్రశ్నలు అడిగారని చెప్పారు. రవికిరణ్‌తో వైఎస్ఆర్ సీపీకి సంబంధం లేదని మరోసారి చెప్పానని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి రవికిరణ్ సహా చాలామంది వాలంటీర్లు ఉన్నారని, అయితే వాళ్లందరినీ పోలీసులు ఉద్యోగులుగా భావిస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌పై మరోసారి ఫిర్యాదు చేసినా, పోలీసులు స్వీకరించలేదని మధుసూదన్ రెడ్డి తెలిపారు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారు: పోలీసులు వివక్షతతో వ్యవహరిస్తున్నారని, వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదులను స్వీకరించడం లేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చట్టపరంగా ఎవరు ఫిర్యాదు చేసినా స్వీకరించాలని, పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారని చెప్పారు. రవికిరణ్‌కు వైఎస్ఆర్ సీపీతో లింక్ పెట్టేలా ప్రయత్నిస్తున్నారని, అదే కోణంలో విచారణ జరుగుతోందన్నారు. -
రవికిరణ్‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు
-
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
మహబూబ్‌నగర్: విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నర్వకు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ మధుసూదన్‌రెడ్డి గుండెపోటుకు గురై ఒక్కసారిగి కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బస్సును రహదారి పక్కన నిలిపివేయడంతో తాము క్షేమంగా ఉన్నామని ప్రయాణికులు తెలిపారు. మృతుడు పెబ్బేరు మండలం జనగంపల్లి గ్రామవాసిగా తెలిసింది. ఇటీవలే నల్లగొండ జిల్లా చండూరు వద్ద ఇదే విధంగా రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. -
కేసీఆర్‌ది తుగ్లక్ పరిపాలన
► కార్పొరేట్ విద్యను దూరం చేస్తామని చెప్పారు. ► కేజీ టూ పీజీ విద్య ఏమైంది? ► వారం రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం ► ఆగస్టు మొదటి వారంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం ► టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి వికారాబాద్ రూరల్ : రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. విద్యారంగ సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తానని, లక్ష ఉద్యోగులు సంవత్సరానికి ఇస్తామని మరిచిపోయారన్నారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తామని, కల్లబొల్లి మాటలు చెప్పరని విమర్శించారు. విద్యార్థులను బిచ్చగాళ్లలా చూస్తున్నారని, వారికి రావాల్సిన డబ్బులను విడతల వారీగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులను మరిచిపోయి.. సమైక్యవాదం తెలిపిన వారిని మంత్రి పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యను దూరం చేసి కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెడతానని చెప్పి.. ఎర్రవల్లి గ్రామం, ఫౌంహౌస్‌కే పరిమితమయ్యారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. లక్ష్య ఉద్యోగాలు అన్నారు..ఽ కేజీటూ పీజీ అన్నారు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్నారు.. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్పీ.. అంటూ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించాలని, వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ముసుగులో కూరుకుపోయిందని, అధికారులు అవినీతికి దూరంగా ఉండాలన్నారు. ఎప్పుడు చూసినా మిషన్ కమిషన్ కాకతీయ, భగీరథ అంటున్న శ్రద్ధ చూపుతున్న సీఎం.. విద్యారంగ సమస్యలపై ఎందుకు చూపడం లేదన్నారు. డిగ్రీ కళాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబోయే వికారాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో 50 వేల మంది విద్యార్థులతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రంగరాజ్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉమాశేఖర్, జిల్లా కార్యదర్శి గొడుగు పాండు, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బురిడీ బాబాకు ఐదురోజుల కస్టడీ
డబ్బులు రెండింతలు చేస్తానని నమ్మించి లైఫ్ స్టైల్ యజమాని మధుసూధన్‌రెడ్డిని బురిడీ కొట్టించిన బురిడీ బాబా శివానందను విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పూజల పేరిట మధుసూధన్‌రెడ్డి వద్ద నుంచి రూ. 1.33 కోట్లతో ఉడాయించిన బుడ్డప్పగారి శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు శివను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. సమ్మతించిన కోర్టు బురిడీ బాబాను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. -
లైఫ్ స్టైల్ ఛైర్మన్ ఇంట్లో దోపిడీ
హైదరాబాద్: పురరోహితులమంటూ లైఫ్‌స్టైల్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చోరీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12 లో బుధవారం మత్తు మందు జల్లి రూ. 1.30 కోట్లు అపహరించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
పట్టపగలు న్యాయవాది ఇంట్లో చోరీ
30 తులాల బంగారు ఆభరణాలు అపహరణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కడప అర్బన్ : నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న లక్ష్మీటవర్స్ అపార్టుమెంటులో న్యాయవాది హైమావతి ఇంటిలో శుక్రవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల కథనం మేరకు హైమావతి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త మధుసూదన్‌రెడ్డి జిల్లా కోర్టులో జ్యుడిషియల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం వారు విధులకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా, తాళం పగులగొట్టి ఉండడంతో సందేహంగా లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్ఐ రమేష్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వీరితోపాటు క్లూస్ టీం హాజరైంది. బాధితులను విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. అపార్టుమెంట్లో అప్రమత్తంగా లేకపోవడం వల్లే రెండోసారి చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం అదే అపార్టుమెంటులో నాల్గవ అంతస్తులో నివసిస్తున్న మోహన్‌రెడ్డి ఇంటిలో చోరీ జరిగింది. -
చిత్తూరులో ఏం జరిగింది..?
ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని కథాంశంతో హార్రర్, సస్పెన్స్ నేపథ్యంతో వస్తున్న చిత్రం ‘చిత్తూరు’. చిన్నా, అనూష జంటగా శ్రీ వీరభద్ర సినీ క్రియేషన్స్‌పై మధుసూధన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయసూర్య దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. చిత్రీకరణ పూర్తయిందని, కథాపరంగానే ‘చిత్తూరు’ టైటిల్ పెట్టామని దర్శక, నిర్మాత అన్నారు. -
'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ నివేదిక మేరకే ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అనంతపురంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ తో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని అంతకుముందు వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎయిమ్స్, ట్రి పుల్ ఐటీ, ఇండియన్ సర్వీసెస్ సెంటర్, సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పాలన్నారు. హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. -
రాయలసీమలోనే రాజధాని
రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం వ్యవహరించాలి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని శ్రీబాగ్ ఒప్పందం (1937) ప్రకారం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయల సీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేసింది. ఒకప్పటి రాయలసీమలోని ఆరు జిల్లాల్లో ఎక్కడ రాజధానిని నిర్మించినా తమకు అభ్యం తరం లేదని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో సమితి ఆధ్వర్యం లో ‘శ్రీబాగ్ ఒప్పందం అమలు- పెద్ద మనుషుల బాధ్యత- ఏపీ రాజధాని రాయలసీమ హక్కు’ పేరుతో డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మూడు తీర్మానాలను ఆమోదించారు. రాజధాని ఏర్పాటుతో పాటు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం తాగు, సాగునీటి వనరులను అభివృద్ధి చేయూలని, ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు, విద్య-వైద్య సంస్థలు సీమలో ఏర్పాటు చేయాలని ఆ తీర్మానాలలో విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో బ్రహ్మిణీ స్టీల్స్ స్థానంలో సెయిల్ ఆధ్వర్యంలో కేంద్రమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లీకులతో మరోసారి విభజనకు ఆస్కారం ఇవ్వొద్దు: మైసూరా ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో ఇక్కడ, కాదు అక్కడని లీకులు ఇవ్వడం ద్వారా మరోసారి రాష్ట్ర విభజనకు ఆస్కారం ఇవ్వొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతు న్నారన్నారు. సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరు సీమ వారే ఉన్నా.. న్యాయం జరుగుతుందా లేదా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్నారు. సీమకు అన్నింటా అన్యాయం: జస్టిస్ లక్ష్మణ్రెడి ్డ ‘రాయలసీమ అన్నింటా నాశనమైందని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచింది. బళ్లారిని పోగొట్టుకున్నాం. మిగులు జలాలపై హక్కు లేకుండా పోయింది. 1956లో ఏపీ ఏర్పడిన తర్వాత అన్ని రం గాల్లో అన్యాయం జరిగింది. నీటి పారుదల రంగంలో అయితే చెప్పలేనంతగా నష్టపోయాం..’అని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. సీమ ఉద్యమం వల్లే పోలవరానికి జాతీయ హోదా లభించిందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణను రాయలసీమకు ఇవ్వాలని కోరారు. ఏకాభిప్రాయం అవసరం: రాఘవులు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా చేసినవారిలో ఎక్కువమంది సీమ వారేనని, వారు చిత్తశుద్ధితో కృషి చేసి ఉంటే సీమ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండి ఉండేదని సీపీఎం సీనియర్ నేత బి.వి.రాఘవులు అన్నారు. ఇప్పుడైనా రాజధాని విషయంలో పాలకులు అన్ని రాజకీయ పక్షాల్లో ఏకాభిప్రాయానికి కృషి చేయూలని సూచించారు. రాయలసీమలోనే రాజధాని ఉండాలన్న ఆ ప్రాంతవాసుల బలమైన కోరికను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం ఒకే ప్రాంతాన్ని రాజధానిగా సూచిద్దామని రాయలసీమ ఉద్యమ నేత వెంకటస్వామి పిలుపునిచ్చారు. సీమను అన్నింటా వదిలేస్తూ పోతే తెలుగుజాతి మూడు ముక్కలవడం ఖాయమని విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి అన్నారు. విశ్రాంత ఐజీ హనుమంతరెడ్డి, సమితికి చెందిన శ్యామల, దశరథరామిరెడ్డి, ఏపీఎన్జీవో నేత గోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
‘రైతన్నకు అండగా వైఎస్సార్ సీపీ’
వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సారథ్యంలో రైతు శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తుంటామని పులివెందుల వైఎ స్సార్ సీపీ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేంపల్లెలో గాలివాన బీభత్సం తో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అంతకుముందు ఆయన ఉద్యానవన శాఖ ఏడీ మధుసూదన్‌రెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2010-14వరకు ప్రకృతి వైపరీత్యాలవల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలకు రూ.538కోట్లు మంజూరైందనిన్నారు. వైఎస్సార్ సీపీ తరపున అప్పటి ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిలతోపాటు తా ను అధికారులతో పంట నష్టం పరిహారంపై సుదీ ర్ఘంగా చర్చించామన్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతుల ఇబ్బందులను తెలియజేసి పరి హారం ఇప్పించాలని కోరామన్నారు.వైఎస్సార్ సీపీ కృషి ఫలితంగానే గతంలో నష్టపోయిన పంటలకు పరిహారం మంజూరైందన్నారు. దీంతోపాటు ప్రస్తు తం దెబ్బతిన్న పంటల నివేదికలను తయారుచేసి త్వరగా పరిహారం వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు షబ్బీర్‌వల్లి తదితరులు పాల్గొన్నారు. రైతు ఖాతాల్లోకి పరిహారం వేంపల్లె: ఈ నెల 6వ తేదీ తర్వాత పంట నష్టపరి హారం ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతుం దని ఉద్యానవన శాఖ ఏడీ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన గాలివాన బీభత్సం వల్ల దెబ్బతిన్న పంటలను చింతలమడుగుపల్లె, నేలవరం తాండలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2010 నుంచి 2014 వరకు దెబ్బతిన్న ఉద్యావన పంటలకు రూ.538కోట్లు మంజూరైనట్లు తెలి పారు. అరటికి హెక్టార్‌కు రూ.24వేలు, బొప్పాయికి హెక్టార్‌కు రూ.10వేలు, మామిడికి హెక్టార్‌కు రూ.15వేలు, దోసకు హెక్టార్‌కు రూ.6వేలు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో అరటి పంట ఎక్కువగా దెబ్బతిందన్నారు. ప్రస్తుతం గాలివాన బీభత్సంవల్ల జిల్లాలో 500 హెక్టార్లల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. -
తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు
డోన్ రూరల్, న్యూస్‌లైన్: తల్లి, తండ్రి పనిచేస్తే పూట గడస్తుంది.. లేదంటే పస్తులే.. అలాంటి పేద కుటుంబలో పుట్టిన ఓ విద్యార్థి కష్టాలను అధిగమించాడు. తండ్రిని కోల్పోయిన బాధలోనూ పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ విద్యార్థికి 9.3 పాయింట్లు వచ్చాయి. డోన్ పట్టణానికి చెందిన మధుసూదన్ నాయుడి విషాదంతో కూడిన విజయగాథ ఇది. పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన శ్రీనివాసులు నాయుడు రైసు మిల్లులో పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పోషణ కోసం భార్య మల్లేశ్వరితోపాటు కుమారులు గోపి, శివ కూలీ పనికి వెళ్లేవారు. పెద్ద కుమార్తె వరలక్ష్మికి పెళ్లి కాగా, రెండో కుమార్తె శిరీష ఆరో తరగతి చదువుతోంది. ఇంకో కుమారుడు మధుసూదన్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివాడు. బాగా చదువుకోవాలని.. మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి చెప్పేవాడు. ఆ మేరకు చదువులో ఆ విద్యార్థి చురుగ్గా ఉండేవాడు. అయితే మార్చి నెలలో పదో తరగతి గణితం పరీక్ష రోజున అనారోగ్యంతో శ్రీనివాసులు నాయుడు చనిపోయాడు. తండ్రి ఆశయం నెరవేర్చేందుకు పుట్టెడు దుఃఖంలోనూ బాధను దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో అత్యధిక పాయింట్లతో పాఠశాలలోనే ప్రథమ స్థాయిలో నిలిచాడు. తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనుకున్న తండ్రి కలలు నిజం చేస్తూ మంచి ఫలితం సాధించడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థిని అభినందించారు. కష్టపడి చదివి ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని మధుసూదన్ నాయుడు తెలిపాడు.