చెన్నైకు 530 కి.మీ దూరంలో 'మడి' తుఫాన్
రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. చెన్నైకు ఆగ్నేయ దిశలో 530 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్‌కు 'మడి' అని నామకరణం చేశారు.
మడి తుఫాన్ స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలో మీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.