mahatma Gandhi Jayanti
-
Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్‌పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు. 4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్‌పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు. 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో.. స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్‌లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు. ‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు. -
ఇక ఆడుదాం ఆంధ్రా
రాష్ట్రంలో మెగా క్రీడా టోర్నీకి తెరలేస్తోంది. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పోటీలు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. 17ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి క్రీడాకారులను పోటీలకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు, ఈవెంట్స్ జరగనున్నాయి. – సాక్షి, అమరావతి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలకు సుమారు మూడు నెలల సమయం ఉండటంతో గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి.. వారు మంచి తర్ఫీదు పొందేలా శాప్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది. బ్యాడ్మింటన్ రాకెట్లు, రింగ్‌లు, క్రికెట్ కిట్, వాలీబాల్లు సమకూర్చనుంది. 26 జిల్లాల వారీగా ఎన్ని కిట్లు అవసరమో.. వాటి జాబితాను సిద్ధం చేస్తోంది. సీఎస్ పర్యవేక్షణలో.. ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఏటా దీన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా 13 మందికిపైగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీని నియమించింది. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు టోర్నీ నిర్వహణ, విజేతలకు బహుమతుల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి భవిష్యత్తులో మంచి శిక్షణ అందించనుంది. తద్వారా వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటేలా తీర్చిదిద్దనుంది. క్రీడా శక్తిని పెంపొందిస్తాం.. యువతకు చదువు ఒక్కటే కాదు.. క్రీడలు కూడా ఉండాలి. అందుకే ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా పెద్ద ఎత్తున క్రీడా శక్తిని పెంపొందిస్తోంది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ఉంటాయి. ఆరోగ్యకర జీవనశైలికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ క్రీడలు మేలు చేస్తాయి. ఈ పోటీల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు భాగమవుతాయి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తాం. పోటీలకు క్రీడా ప్రాంగణాలను గుర్తించి అభివృద్ధి చేస్తాం. – జి.వాణీమోహన్, ముఖ్య కార్యదర్శి, క్రీడలు, యువజన సర్విసులు 15వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో.. తొలుత 15 వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 1.50 లక్షల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధిస్తే మండల స్థాయిలో (680 మండలాల్లో) 1.42 లక్షల మ్యాచ్‌లు, వడపోత అనంతరం నియోజకవర్గ స్థాయిలో 5,250, జిల్లా స్థాయిలో 312, రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌లతో పాటు ఫైనల్ పోటీలు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. పోటీల నిర్వహణకు సంబంధించి శాప్.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)ను సిద్ధం చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించనుంది. ఇప్పటికే పాఠశాలల మైదానాలు, మున్సిపల్ క్రీడా ప్రాంగణాలతో పాటు పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీ, పీడీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. స్థానికంగా క్రీడల్లో గుర్తింపు పొందిన వారి సహాయంతో యువతను పెద్ద ఎత్తు¯]∙పోటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించనుంది. -
డాలస్‌లో బాపూజీ 153 వ జయంతి సంబరాలు
డాలస్‌లో అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలి మహాత్మాగాంధీజీ 153వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి రావు కలవల స్వాగతోపన్యాసం చేయగా, నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ఉర్మాట్ సింగ్ మాట్లాడుతూ ఈ ఏడాది గాంధీ జయంతి వేడుకలలో ఎప్పటిలాగానే “గాంధీ శాంతి నడక” కొనసాగించడం ఆనందంగా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించడం అంటే విశ్వమానవాళి శాంతి కాముకుడైన గాంధీజీకి ఘన నివాళి అర్పించడమేనని ఎంజీఎంఎన్టీ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర కొనియాడారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇర్వింగ్ నగర్ కౌన్సిల్ సభ్యుడు మార్క్ జేస్కిను, పోలీస్ చీఫ్ డెరెక్ మిలార్త ను డా. తోటకూర సభకు పరిచయం చేశారు. ప్రవాస భారతీయులు ఇర్వింగ్ నగర అభివృదికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. బోర్డు సభ్యులు తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం పోలీస్ చీఫ్ శాంతి వాక్‌ను ప్రారంభించారు. పిల్లలు, పెద్దలు స్త్రీలు ఉత్సాహంగా పాల్గొని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ప్రసాద్ తోటకూరతోపాటు, రావు కలవల, ఉర్మాట్ జునేజా, సల్మాన్ ఫర్హోరి, ఇందు మందాడి , తైయాబ్ కుండవాలా, ప్పయూష్ పటేల్, షబ్నం, మొద్గిల్,రాజీవ్ ,శైలేష్ , చంద్రిక, హేతల్ సా, సాంటే చారి, పులిగండ్ల విశ్వనాధం, సత్యన్ కల్యాణ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2 సాయంత్రం ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీం మహాజన్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బాపూజీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాపూజీ సిద్ధాంతాలు సర్వత్రా ఆచరణీయమన్నారు. అతిపెద్ద గాంధీ స్మారక స్థలిని ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని ప్రత్యేక అతిధిగా హాజరైన నగర మేయర్ రిక్ స్తోఫెర్ కొనియాడారు. అక్టోబరు 2ను “గాంధీ డే” గా ప్రకటిస్తూ ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు, ఇతర సభ్యులకు అందించారు. దాదాపు 250 మందికి పైగ చిన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రేడియో సురభి సభ్యులు రాజేశ్వరి ఉదయగిరి, రవి తూపురాని, అంబా లక్ష్మి, స్ఫూరిత మలవరపు, మైత్రేయి మియాపురం, వేణు చెరుకుపల్లి, శివ దేశిరాజుల ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించారు. చివరగా సురభి రేడియో తోపాటు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, వివిధ సంస్థలు, చిన్నారులు ,అతిధులకు ఐఏఎన్టీ బోర్డు ఛైర్మన్ సల్మాన్ ఫర్హోరి కృత్జజ్ఞతలు తెలిపారు. -
Bharat Jodo Yatra: వల్లెవేయడం తేలికే..ఆచరణ కష్టం
మైసూరు: గాంధీజీ ఆశయాలను వల్లెవేయడం అధికారంలో ఉన్న వారికి తేలికే కానీ, వాటిని అనుసరించడం కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆదివారం మైసూరు సమీపంలోని బదనవాలు గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాన్ని గాంధీజీ 1927, 1932 సంవత్సరాల్లో సందర్శించడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన గాంధీజీ జయంతి వేడుకల్లో రాహుల్ పాల్గొన్నారు. ఆ కేంద్రంలో చేనేత ఉత్పత్తులను పరిశీలించి, మహిళా కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. గాంధీజీని పొట్టనబెట్టుకున్న సిద్ధాంతంతోనే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానతలు, విభేదాలను వ్యాపింప జేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న హింస, అసత్య రాజకీయాలకు వ్యతిరేకంగా అహింస, స్వరాజ్య భావనను పెంచేందుకే జోడో యాత్ర చేపట్టామన్నారు. బదనవాలు గ్రామంలో వీరశైవ, దళితులతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ప్రముఖ శ్రీ నంజుండేశ్వర (శ్రీకంఠేశ్వర) ఆలయంలో పూజలు చేశారు. తర్వాత పాదయాత్ర మైసూరు ప్యాలెస్ మైదానం ఎదురుగా ఉన్న వస్తు ప్రదర్శన ఆవరణకు చేరుకుంది. ఆరున యాత్రలో సోనియా కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఈనెల ఆరో తేదీన సోనియా గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో యాత్ర 511 కిలోమీటర్ల పొడవునా 21 రోజులపాటు కొనసాగనుంది. వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చిన సోనియా తొలిసారిగా యాత్రలో పాలుపంచుకోనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న కర్ణాటకగుండా ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండటం గమనార్హం. బీజేపీపాలిత రాష్ట్రం గుండా యాత్ర కొనసాగడం ఇదే తొలిసారి. బదనవాలులో ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రంలో మగ్గాన్ని పరిశీలిస్తున్న రాహుల్ -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
తాడేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
-
Gandhi Jayanti 2022: మహాత్ముడికి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం పేర్కొన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. -
గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మనమందరం పునరంకితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, తేరా చిన్నపరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, దయానంద్, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ఏడేళ్ళలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. -
AP: రాజ్‌భవన్‌లో ఘనంగా గాంధీజీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. మహత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌భవన్ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారని తెలిపారు. గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు. మహాత్మా గాంధీ సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్త్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడిని స్మరించుకోవటానికి, ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ప్రజా జీవితం దేశ ప్రజలలో చిరస్ధాయిగా నిలిచిపోయిందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు. గాంధీజీ జయంతి వేడుకలలోభాగంగా గవర్నర్.. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారంచుట్టారు. రాజ్‌భవన్ ఆవరణలో తొలిమొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్పీ సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీడా తదితరులు పాల్గొన్నారు. -
కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు
నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా -
మహాత్ములకు ఘన నివాళి
-
గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. మహాత్ముడి 151వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన బోధించిన సత్యం, అహింసా ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. గాంధీ ఆశయాల సాధన కోసం ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ పాలనతో ముందడుగు వేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను స్థాపించి గాంధీ కలలుకన్న దేశాన్ని నిర్మించేందుకు ముందడుగు వేశాం అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీఎం జగన్ ట్వీట్ చేశారు. (బాపు కల నెరవేరిందిలా..) మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. -
మహాత్మునికి మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగానూ విజయ్‌ఘాట్ వద్ద ప్రధాని నివాళి అర్పించి.. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగానూ మహాత్ముని జయంతి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. -
స్వచ్ఛత దినోత్సవంగా గాంధీ జయంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్వచ్ఛ పట్టణాల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 2 నాటికి పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి పట్టణంలో తడి పొడి చెత్త కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగించాలని సూచించారు. -
‘మహాత్ముని ఆత్మ క్షోభించేది’
న్యూఢిల్లీ: మహాత్ముని 150వ జయంతి సందర్భంగా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది. అబద్ధపు రాజకీయాలతో పబ్బం గడుపుకునేవారు మహాత్ముని సిద్ధాంతాలు, ఆదర్శాలు, నిస్వార్థ సేవలను అర్థం చేసుకోలేరని బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారత్‌లో గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితులను చూసి ఉంటే మహాత్ముని ఆత్మ క్షోభించేదని వ్యాఖ్యానించారు. ‘అసత్య రాజకీయాలు చేసే వారు గాంధీ చూపిన సత్య మార్గాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? అధికారంతో ఏమైనా చేయవచ్చని భావించేవారు గాంధీ అహింస మార్గాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? తమను తాము గొప్ప వ్యక్తులుగా (సుప్రీమ్) భావించుకునేవారు దేశం కోసం గాంధీ చేసిన నిస్వార్థ సేవలను ఎలా అర్థం చేసుకోగలరు?’అని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ గాంధీ, భారత్ అనేవి పర్యాయ పదాలుగా ఉన్నాయని.. కానీ కొందరు ఇప్పుడు దానిని ఆరెస్సెస్, ఇండియాగా మార్చాలని చూస్తున్నారని సోనియా ఆరోపించారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసువద్ద కార్యకర్తలు నిర్వహించిన మార్చ్‌కు రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా వారంపాటు దేశమంతా ‘పాదయాత్రలు’నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. -
గాంధీ కోసం ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’
న్యూయార్క్: ప్రపంచంలో ద్వేషం, హింస, బాధలను అంతం చేసేందుకు భుజం, భుజం కలిపి నడుద్దామని విశ్వ మానవాళికి మోదీ పిలుపునిచ్చారు. గాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ను ఉటంకిస్తూ.. ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడు, కష్టాలను తీర్చేవాడు, అహంకారం లేనివాడే నిజమైన మానవుడని ఆ భక్తిగీతం అర్థమని వివరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ద న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ‘భారత్‌కు, ప్రపంచానికి గాంధీ ఎందుకు కావాలి?’ శీర్షికతో మోదీ ఒక వ్యాసం రాశారు. మహాత్ముడిని అత్యుత్తమ గురువని, దారి చూపే వెలుగని, ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని విశ్వసించే లక్షలాది మందికి ఆయనే ధైర్యమని అందులో ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’ను మోదీ తెరపైకి తెచ్చారు. ‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్ తరాలు విశ్వసించవేమో’అని మహాత్మాగాంధీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రశంసను ప్రస్తావిస్తూ.. ‘గాంధీకి నివాళిగా, ఐన్‌స్టీన్ చాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నాను. గాంధీ ఆశయాలను ముందు తరాలకు ఎలా అందించగలం? అనేది అంతా ఆలోచించాలి. వినూత్న విధానాలు, ఆవిష్కరణల ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే విషయమై మేధావులు, టెక్ లీడర్లు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు కృషి చేయాలి’అని మోదీ కోరారు. గాంధీ ఆశయాల సాధన కోసం తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘భారత జాతీయతావాదం భారత్‌కు మాత్రమే పరిమితమైన సంకుచిత వాదం కాదని, విశ్వ మానవాళి సంక్షేమాన్ని కోరే వాదమని గాంధీజీ బలంగా నమ్మారు’అని మోదీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన అంతం కావడం ఒక్కటే కాదని, రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత అందులో ఇమిడి ఉన్నాయన్నారు. ‘ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించే ప్రపంచాన్ని ఆయన కలగన్నారు. పేదల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని అంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ భూమిపై నివసిస్తున్న మనం అవని సంక్షేమానికి, దానిపై ఉన్న వృక్ష, పశు, పక్ష్యాది సమస్త ప్రాణుల సంక్షేమానికి బాధ్యులుగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. -
భారత్ ప్రతిష్ట పెరుగుతోంది : మోదీ
అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రతిష్ట ఏ స్థాయిలో పెరిగిందో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో స్పష్టంగా తెలిసిందన్నారు. భారత్ ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా నిలిచిందన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. న్యూయార్క్‌లో ఐరాస వేదికగా మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడమే కాకుండా, కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఙతలని పేర్కొన్నారు. అంతేకాకుండా, కార్యక్రమం ముగిశాక, తన కోరికపై, భద్రతపరమైన ప్రమాదాలను పట్టించుకోకుండా స్టేడియంలో తనతో కలియతిరిగారని ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్ ఉన్నవారి పట్ల ప్రపంచ దేశాల్లో గౌరవం పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సానుకూల మార్పులకు భారత్ వేదిక అవుతోందన్న విషయాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొన్నారు. ‘ఈ రోజు గ్రామీణ భారతం, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయి’ అని ప్రకటించారు. అలాగే, ‘ఓడీఎఫ్ ఇండియా’ మ్యాప్‌ను ఆవిష్కరించారు. 60 నెలల్లో 60 కోట్ల ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడంపై ప్రపంచం భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగవద్దని, ఇంకా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం, ప్రకృతి పరిరక్షణ గాంధీజీకి ఎంతో ఇష్టమైన విషయాలన్నారు. 2022 నాటికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్నారు. అంతకుముందు, సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలోని విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి మ్యూజియంను, ఆశ్రమంలో గాంధీ నివాసం హృదయ కుంజ్‌ను సందర్శించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘గాంధీజీ స్వప్నమైన స్వచ్ఛభారత్ ఆయన 150వ జయంతి రోజు నిజం కావడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక 1917లో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ నెలకొల్పారు. 1930 వరకు ఇక్కడే ఉన్నారు. 1930లో దండియాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రూ. 150 నాణాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. -
గాంధీకి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీలు బుధవారం రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వీరితోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ గాంధీకి నివాళులు అర్పించారు. పార్లమెంటులోని సెంట్రల్ హాలులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన లాల్ బహదూర్‌కు నివాళులు అంటూ మోదీ ట్వీట్ చేశారు. -
ఆ వార్త తెలిసి ఆశ్రమానికి...
భాగ్యనగరం అదృష్టం చేసుకుంది. చీకటి భారతంలోవెలుగులు నింపిన మహాత్ముడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆయన అడుగుజాడలనుపదిలంగా భద్రపరుచుకుంది. ఆ మహనీయుడి జ్ఞాపకాల గని ఇప్పటికీ ఇక్కడుంది.నేడు ఆయన 150వ జయంతి... బాపూఘాట్ మహాత్మాగాంధీ అస్థికలను దేశంలోని ఐదు ప్రాంతాల్లో నదుల్లో కలపగా... ఇందుకు దక్షిణాది నుంచి హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. అయితే అప్పుడు నిజాం పాలన ఉండడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నవాబుతో మాట్లాడగా ఆయన సంతోషంగా ఆహ్వానించారు. అస్థికలనుబొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో రెండు రోజులు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాతలంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగమంలో కొన్ని కలిపి...మరికొన్ని అస్థికలను కలశంలో పెట్టి ఒడ్డున సమాధి నిర్మించారు.అదే బాపూఘాట్. అడుగులో.. అడుగై... అతనో 17 ఏళ్ల కుర్రాడు. 1945 మార్చి 8న మద్రాస్‌లోని మైలాపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన గాంధీజీని కలిశాడు. ‘నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతోపాటే సేవాగ్రామ్‌కు వస్తాన’ని చెప్పాడు. గాంధీ ‘ఇంత చిన్న వయసులోనే ఎందుకు?’ అని ప్రశ్నించగా... దేశం కోసం అని బదులిచ్చాడు. అప్పుడు గాంధీతోనే మహారాష్ట్ర వార్దాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన ఆ కుర్రాడు... మహాత్ముడితోనే చాలాకాలం ఉన్నాడు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణమూర్తి. 92 ఏళ్ల ఈ పెద్దాయన ఇచ్చిన ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం... ‘గోల్డెన్’ బస మహాత్ముడి జ్ఞాపకాలెన్నో నగరంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆయన నగరానికి ఎప్పుడొచ్చినా సరోజినీ నాయుడు ఇంట్లో (గోల్డెన్ త్రెషోల్డ్)నే బస చేసేవారు. ఇక్కడ ఒక మామిడి మొక్కను నాటగా... అది మహావృక్షమైంది. బాపూజీ విశ్రాంతి తీసుకున్న మంచం ఇప్పటికీ పదిలంగా ఉంది. ఉద్యమ ఉప్పెన 1934 మార్చి 9... నగరంలోని కర్బలా మైదానం.. సాయంత్రం 4గంటలు... గ్రౌండ్ మొత్తం జనసందోహం... ఒక్కసారిగా అభిమానుల హర్షాతిరేకాలతో మైదానమంతా దద్దరిల్లింది. మహాత్ముడి రాకతో భాగ్యనగరం పుల కించింది. అస్పృశ్యతపై ఆనాడు నిర్వహిం చిన ఈ సభలో గాంధీ హరిజనోద్ధరణపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అది 1945, మార్చి 8వ తేదీ... అప్పటికే మద్రాస్‌లోని మైలాపూర్ ఎంతో సందడిగా ఉంది. వేలాది మంది బాపూజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా జన సందోహమే. ‘స్వాంతంత్య్ర’ నినాదమే. ప్రతి ఒక్కరిలో జాతీయోద్యమ స్ఫూర్తి. ఎంతోమంది దేశభక్తులు గాంధీజీ కోసం ఎదురు చూస్తున్నట్లుగానే ఓ పదిహేడేళ్ల కుర్రాడు సైతం ఎదురు చూస్తున్నాడు. బాపూజీతో రెండు నిమిషాల పాటు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ రెండు నిమిషాల కోసమే అతడు ట్రిప్లికేన్ మైలార్‌పల్లికి వచ్చాడు. ఆ రోజు అక్కడ హిందూ ప్రచార సభ, ఆంధ్రమహిళా సభ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గాంధీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక్కసారిగా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. కానీ ఆ కుర్రాడికి మాత్రం టెన్షన్‌గా ఉంది. గాంధీజీతో మాట్లాడే అవకాశం లభిస్తుందో లేదోనని. ఎలాగైతేనేం, ఆ అవకాశం లభించింది. ‘దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతో పాటే సేవాగ్రామ్‌కు వచ్చేస్తాను. నన్ను తప్పకుండా తీసుకెళ్లండి.’ అని అడిగాడు. ‘ఇంత చిన్న వయసులో ఎందుకు’ అన్నారు గాంధీజీ. దేశం కోసం పని చేయాలని ఉంది.’ అన్నాడు. అలా గాంధీతో పాటే మహారాష్ట్ర వార్ధాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన అతడు ఆ ఆశ్రమానికి కార్యదర్శిగా, ఖాదీ ఉద్యమ ప్రచారకుడిగా, కుష్టువ్యాధిగ్రస్తుల సేవకుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణ మూర్తి(ఎస్ఎస్ఎన్ మూర్తి). బాపూజీ బాటలో నడిచారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ బాపూజీ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయని చెబుతారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...‘సేవ’ తప్ప మరో ధ్యాస లేదు... పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరు మాది. పాలకొల్లు, తణుకులలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత మా కుటుంబం మద్రాస్‌కు తరలి వెళ్లడంతో ఇంటర్మీడియట్ అక్కడే చదివాను. పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 1946 నుంచి 1948 వరకు గ్రేడ్–2 అధికారిగా పని చేశాను. కానీ మొదటి నుంచి నా ధ్యాసంతా దేశ సేవపైనే ఉంది. చదువుకొనే రోజుల్లో గాంధీజీ మద్రాస్‌కు వచ్చినప్పడు ఆయనతో పాటే సేవాగ్రామ్‌కు వెళ్లాను. కానీ 2 నెలల కంటే ఎక్కువ కాలం ఉండలేకపోయాను. అప్పటికి దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆశ్రమాన్ని బెంగాల్‌కు మార్చనున్నట్లు గాం«ధీ చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పారు. దాంతో మద్రాస్ వచ్చేశాను. అలా రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాను. కానీ ఆ రెండు నెలల్లో గాంధీజీతో చక్కటి అనుబంధం ఏర్పడింది. ఆయన బాపూ కుటీర్‌లో ఉండేవారు. ఆయనను కలిసేందుకు వచ్చేవారి వివరాలు తెలుసుకొని పంపించడం నాకు అప్పగించిన పని. అలా నెహ్రూ, పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ఎంతోమంది మహానుభావులను పరిచయం చేసుకొనే అవకాశం లభించింది. పైగా గాంధీజీ కూడా పరిచయం చేసేవారు. ఆ కుటీర్ బాపూజీ సెక్రెటేరియట్. ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలిగే సామర్ధ్యంతో కేవలం మట్టితోనే కట్టించిన ఆశ్రమం అది. అరుగుపైన చాప పరుచుకొని బాపూ కూర్చునేవారు. ఎవరు వచ్చినా ఆ అరుగుపైనే సమావేశాలు జరిగేవి. ఉదయం 4.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బాపూతో కలిసి సర్వమత ప్రార్ధనలలో పాల్గొనడం గొప్ప అనుభూతి. రెండు పూటలా నడక, మితాహారం, చర్ఖాపైన దారం వడకడం, ఆశ్రమంలో పారిశుధ్య పనులు, క్రమశిక్షణతో చక్కటి జీవన విధానం అలవడింది. మొత్తం 70 మందిమి ఉండేవాళ్లం ఆశ్రమంలో. అప్పటికే కస్తూర్బా గాంధీ చనిపోయారు. ఆమె నివాసం ఉన్న ఆది కుటీర్‌లో నేను ఉండేందుకు అవకాశం లభించడం నా అదృష్టం. సేవాగ్రామ్‌ను బెంగాల్‌కు మార్చనున్నట్లు చెప్పడం వల్లనే తిరిగి మద్రాస్‌కు రావలసి వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతో కాలం కొనసాగలేకపోయాను. మరోసారి ఆశ్రమానికి వెళ్లాను. గాంధీజీ చెప్పినట్లు వార్ధా నుంచి బెంగాల్‌కు మారలేదు. ఆ వార్త తెలిసి ఆశ్రమానికి... ఆ రోజు 1948 జనవరి 30. షాకింగ్ న్యూస్. మహాత్ముడు ఇక లేరు. హత్యకు గురయ్యారు. రేడియోలో ఆ వార్త విన్నాను. బాధతో చలించిపోయాను. వెంటనే వెళ్లిపోవాలనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు, చివరకు ఆ ఏడాది మార్చి 30న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏప్రిల్ ఒకటో తేదీన వార్ధాకు చేరుకున్నాను. గాంధీజీ తరువాత ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన శ్రీకృష్ణదాస్ జాజీ, జమన్‌లాల్ బజాజ్‌ల మార్గదర్శకత్వంలో సేవాగ్రామ్ కార్యదర్శిగా పనిచేశాను. ఖాదీ పరిశ్రమకు నిలయమైన సేవాగ్రామ్‌తో పాటు, కుష్టురోగులకు సేవలందజేసే దత్తపూర్, గ్రామీణ పరిశ్రమలకు కేంద్రమైన మగన్‌వాడీలలో పని చేశాను. కుష్టు రోగులకు సేవలందజేయడం గొప్ప అదృష్టంగా భావించాను. నా భార్య మైత్రి వినోబాభావే స్ఫూర్తితో సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలమైన కార్యకర్తగా పని చేస్తే దత్తపూర్ అనుభవంతో బొబ్బిలి సమీపంలోని చిలకలపల్లిలో కుష్టువ్యాధిగ్రస్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 10 గ్రామాలను దత్తతీసుకొని కుష్టు నిర్మూలన, అవగాహన కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో చేపట్టాం..’ అని ముగించారు. -
నాటకంలో గాంధీ బాట
జాతీయోద్యమంలో మహాత్మునిది ఒక శకం. బ్రిటీష్‌వారు ఈ ప్రపంచాన్ని పాలించడానికే పుట్టారన్న భావన ఆయన రాకతో పటాపంచలైంది. దక్షిణాఫ్రికాలో మొదటి తరగతి రైలు బోగీ నుంచి∙గెంటి వేయబడిన ఒక భారతీయుని ఆత్మబలం ఆ తర్వాత రోజుల్లో జాతీయోద్యమానికి నాయకత్వం వహించేలా ప్రజ్వరిల్లింది. అహ్మదాబాద్ కోర్టులో మహాత్మునిపై రాజద్రోహం నేరం మోపబడినప్పుడు ‘నేను నిప్పుతో చెలగాటం ఆడుతున్నానని నాకు తెలుసు. కానీ మీరు స్వేచ్ఛనిచ్చి వదిలేస్తే నేను మళ్లీ అదే పని చేస్తాను’ అన్నాడాయన. గాంధీ ఇచ్చిన ఇలాంటి స్టేట్మెంట్లు భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అప్పటివరకు ఉన్నత వర్గాలకు పరిమితమైన స్వాతంత్య్ర పోరాటం కింది వర్గాలకు చేరింది. ఆనాడు జాతి యావత్తు గాంధీ వైపు చూసింది. అతని బాట నడిచింది. కవులు గొంతు కలిపారు. కళాకారులు వంతపాడారు. ఎంతో కవిత్వం, అనేక కథలు, నవలలు, నాటకాలు భారతీయ భాషల్లో వచ్చాయి. స్వరాజ్య సాధనే లక్ష్యంగా గాంధీని, గాంధీతత్త్వాన్ని వస్తువుగా చేసుకొని వచ్చిన నాటకాలు నాడు తెలుగునాట ఉర్రూతలూగించాయి. తెలుగులో మొదట గాంధీజీని కథానాయకుడిగా చేసుకొని రెండు నాటకాలు 1. నవయుగం, 2. గాంధీ విజయం రాసినవారు దామరాజు పుండరీకాక్షుడు. ఈయన గొప్ప గాంధేయవాది. ఇంకా, పండిత సీతారామ రచించిన ‘స్వరాజ్యధ్వజము’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి ‘గాంధీ విజయ ధ్వజ నాటకం’, పాకురి అంజయ్యగారి రచన ‘భారత దివ్య దర్శనం’, ముద్దా విశ్వనాథంగారి ‘జన్మభూమి’, జాస్తి వెంకట నరసయ్య, ధూళిపాల వెంకట సుబ్రహ్మణ్యం గార్లు కలిసి చేసిన రచన ‘కాంగ్రెస్ విజయం’ ముఖ్యమైనవి. గాంధీ మహాత్మున్ని కథానాయకుడిగా ఈ వ్యాస రచయిత రచించిన ‘గాంధీ జయంతి’ (నాటకం), ‘బాపు చెప్పిన మాట’ (నాటిక) విరివిగా ప్రదర్శితమయ్యాయి. గాంధీ బతికి వచ్చి ఈనాటి రాజకీయ నాయకుల్ని, వారి ప్రవర్తనను, ప్రజలపై వారికున్న అవకాశవాద దృక్పథాన్ని చూసి ఎలా స్పందిస్తారనేది ఇతివృత్తం. గాంధీ చెప్పిన మాటను సూచించిన బాటను అనుసరించని రాజకీ య పక్షాలు అన్నీ ఏకమై కుట్రపన్ని ఆయన్ని ఖూనీ కేసులో ఇరికిస్తారు. గాంధీజీకి ఉరిశిక్ష పడుతుంది. గాంధీ తన చివరి కోరికగా భారతదేశంలో మళ్లీ పుట్టాలని ఉందంటాడు. దేవేంద్రుని సారథి మాతలి తీసుకొచ్చిన పుష్పక విమానంపై తిరిగి స్వర్గానికి వెళ్లిపోతూ.. ‘ఉషోదయపు వెలుగుల్లో జాబిలి వెన్నెల్లో నేనే ఉంటాను.. విరిసిన పుష్పం గా, కురిసే మేఘంగా నేనే వస్తాను.. నింగిన చుక్క నై, నాలుగు దిక్కులై నేనే నిలుస్తాను.. అన్యాయపు కోట లని, అవినీతి బాటల్నిఅంధకా రపు గోడల్ని అం తం చే యడానికి మళ్లీ అవతరిస్తా.. అంతం చేస్తా... అంటూ ఆ నాటకం ముగుస్తుంది. – డాక్టర్ దీర్ఘశి విజయభాస్కర్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత -
డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని ప్రకటించారు. ఈ వేడుకలలో భాగంగా శాంతికి సంకేతం గా 15 పావురాలను గాల్లోకి వదులుతామని.. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో "గాంధీ శాంతి యాత్ర" జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రవేశం ఉచితమని, బ్రేక్ ఫాస్ట్ , టి షర్ట్స్, అందజేసాస్తామన్నారు. గాంధీ మెమోరియల్‌కు సమీపంలో ఉన్ననార్త్ లేఖ్ కాలేజ్ నుంచి గాంధీ మెమోరియల్‌కు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, తమ కార్లను అక్కడ పార్క్ చేసి ఉదయం 7:30 నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ప్లాస్టిక్‌పై పోరాడదాం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీని ప్లాస్టిక్ రహిత దినంగా పాటించాలని ఆకాశవాణిలో ప్రసారమయిన మాసాంతపు మన్‌కీబాత్‌లో ఆయన కోరారు. వచ్చే దీపావళి పండుగ నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలను లేకుండా చేయాలన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి మొదలయ్యే వార్షిక ‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరగనున్న ‘పోషణ్ అభియాన్’లో భాగస్వాములై చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించాలని కోరారు. డిస్కవరీ చానెల్లో ప్రసారమయిన ‘మ్యాన్ వెర్సస్ వైల్డ్’ ఎపిసోడ్లలో సాహసికుడు బేర్ గ్రిల్స్ హిందీని ఎలా అర్థం చేసుకోగలిగారని పలువురు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతే తమకు సాయపడిందన్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలను గ్రిల్స్ చెవిలో ఉండే పరికరం వెంటవెంటనే గ్రహించి అతడికి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి వినిపిస్తుంది. ఇదంతా సాంకేతికత వల్ల సాధ్యమైన అద్భుతం..’ అని పేర్కొన్నారు. -
ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ
సాక్షి, ఒంగోలు టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు సచివాలయాలుగా రూపాం తరం చెందనున్నాయి. 70 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ కన్న కలలు నేడు సాకారం కాబోతున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్న బాపూజీ ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నెరవేరబోతోంది. పంచాయతీలకే అధికారాలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం నేడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోని పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను పంచాయతీలే నిర్వహించుకునేలా గ్రామ సచివాలయ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తరుŠువ్ల జారీ చేశారు. పనిలో పనిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన విధి, విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలోనే పాలన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994 లో పార్లమెంట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్న 13 శాఖలకు చెందిన 29 రకాల అధికారాలను స్థానిక పంచాయతీలకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంతోపాటు 2007లోనే ఉత్తరుŠువ్ల కూడా జారీ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా స్థానిక పాలనను అమలు చేసిన దాఖలాలు లేవు. స్థానిక పాలనను అమలు చేయాలని కోరుతూ అప్పట్లో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పలు పోరాటాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిపాలనలో నూతన ఒరవడితోపాటు పేదల ఇంటివద్దకే సేవలు అనే నినాదంతో తొలి అడుగులేసిన సీఎం వెంటనే గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించి ప్రజల వద్దకే సత్వర సేవలు అనే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ గ్రామ వలంటీర్లకు మొత్తం 56, 809 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించన్నారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఎంపిక జాబితా కూడా పూర్తయ్యాయి. రెవెన్యూ గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు... జిల్లాలో 56 మండలాలు ఉండగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లుగా పరిపాలన సాగుతోంది. వీటి పరిధిలో 1038 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 33 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలంటే జనాభా సంఖ్య ఆధారంగా చేయాల్సి ఉంది. రెండు వేలు జనాభా నుంచి నాలుగు వేల జనాభా మధ్య ఉండే గ్రామపంచాయతీలో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. వెయ్యి, పదిహేను వందలు, ఐదొందలు జనాభా కలిగిన గ్రామపంచాయతీలను ఒకటిగా చేసి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల కంటే తక్కువ జనాభా ఉన్నా ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. పైగా రెవెన్యూ గ్రామంలోనే వీలున్నంత వరకు గ్రామ సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా జిల్లాలో 732 గ్రామ సచివాలయాలను గుర్తించారు. అయితే ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలను 912 గ్రామ సచివాలయాలకు ఎందుకు పెంచకూడదు అంటూ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తరుŠువ్ల జారీ చేసింది. రెవెన్యూ విలేజ్‌కి గ్రామ పంచాయతీకి అనుసంధానం చేస్తూ గ్రామ సచివాలయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ శారద ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు పూర్తి చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ అటు వైపు కసరత్తు మొదలెట్టారు. దీంతో మళ్లీ జిల్లాలో గ్రామ సచివాలయాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకం: గ్రామ వాలంటీర్ల నియామకమే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయంలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. డిగ్రీ అర్హతగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం 91,652 ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యం. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా, వ్యయ ప్రయాసలు పడకుండా గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలను తీర్చేందుకు సీఎం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. అక్టోబర్ 2 నుంచి ఈ విధానం రాష్ట్రమంతటా ఒకే సారి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయ కన్వీనర్‌గా సెక్రటరీ: గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. జీతాల చెల్లింపు కూడా కార్యదర్శి ద్వారానే నిర్వహిస్తారు. అయితే కార్యదర్శితో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ సెలవుల మంజూరు చేసే అధికారం సర్పంచ్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
బాపూజీ.. మన్నించు!
సాక్షి ప్రతినిధి, కడప : మహాత్మా!..మీరు పరమపదించి ఏడు దశాబ్దాలు దాటిపోతున్నా ఆనాడు మీరు నేర్పిన భావాలు చరిత్ర పుటల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం మా పాలకులు అడుగడుగునా నిన్ను అవమానిస్తున్నారు. బాపూజీ క్షమించు.. క్షమించు.. ♦ నాయకుడు ఎలా ఉండాలో మీరు నేర్పించి వెళ్లారు. కానీ అలాంటి నాయకత్వం మచ్చుకైనా కనిపించని ఈ నాయక గణాన్ని మరోమారు క్షమించు బాపూజీ.. ♦ బానిస సంకెళ్లతో కట్టుబానిసలుగా మగ్గుతున్న మాకు స్వాతంత్య్రం కల్పించడానికి బ్రిటీషు పాలకులపై మీరు ప్రయోగించిన ఆయుధాలు సత్యం, అహింస.. ♦ అయితే, నేటి స్వతంత్ర భారతావనిలో మళ్లీ మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రస్తుత పాలకులు అమాయక ప్రజలపై వదులుతున్న బాణాలు మోసం,దగా.. ఎంత తేడా.. ♦ ఒంటిపై ముతక కొల్లాయి ధరించి ప్రతిరోజు పాయఖానాను శుభ్రపరిచిన మీకు.. మచ్చుకైనా నలగని ఖరీదైన ఖద్దరు దుస్తులతో దుమ్ము చేతికంటని ప్లాస్టిక్ పొరకను చేతబట్టి ఫొటోలకు ఫోజులిస్తున్న నేటితరం నేతలకు.. అసలు పోలికలు ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ♦ మహాత్మా పగటి వేషాలు ఒంట పట్టించుకుని పబ్బం గడుపుకుంటున్న మా పాలకుల్లో కాసింతైనా మార్పు తెప్పించవా.. దళితులను హరిజనులంటూ గౌరవించి అక్కున చేర్చుకున్న మీకు.. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. దళితులు అస్సలు శుభ్రంగా ఉండరంటూ వినడానికి సైతం కర్ణ కఠోరంగా, లెక్కలేని తనంగా మాట్లాడుతూ దళితుల మనుసుల్లో మానని గాయాలు చేస్తున్న నేటి తరం పాలకులకు అస్సలు పొంతన లేదు... నీ వర్ధంతి రోజైనా వారికి జ్ఞానోదయం కలిగించు బాపూజీ.. ♦ అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్లగిలిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని చెప్పారు... అర్ధరాత్రి మాటేమోగానీ పట్టపగలే బాలికలు నిర్భయంగా బళ్లకు వెళ్లడానికి భద్రత కల్పించలేని ప్రభుత్వాలను చూస్తున్నాం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన శిష్యురాలి ఇంటి మొబైల్‌కు అసభ్యకర సందేశాలు, నీలి చిత్రాలు పంపిస్తున్న సంఘటనలు వింటుంటే నిజంగా నీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో తలుచుకుంటూనే మా గుండెలు తరుక్కుపోతున్నాయి బాపూజీ.. ♦ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఏనాటికైనా మనవాళ్లు కచ్చితంగా అమలు చేయగలరన్న నీ చిరకాల కోరికను మంట గలుపుతున్నందుకు మా పాలకులను మరొక్కమారు క్షమించు బాపూజీ.. సంక్షేమ పథకాలంటూ పేద ప్రజలకు ఓ చేత్తో చిల్లరను వెదజల్లి.. మరోచేత్తో వారి కష్టార్జితాన్నంతా లాక్కోవడానికి పట్టణాల్లో వీధివీధికి మద్యం దుకాణాలు, పల్లెల్లో సందుసందున బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్న నేటి పాలకులను మనసారా క్షమించు బాపూజీ.. ♦ పైకి మాత్రం మీ ఆశయాలను సాధించడానికే రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పి లోపల మాత్రం తమ సొంత ఆశలు, కోరికలను నెరవేర్చుకుని అమూల్యమైన మీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మా నాయకులను మన్నించు బాపూజీ..! -
సాహితీ పరిమళం.. సౌ'భాగ్య' ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతుల్ని ఒక వేదికపైకి తెచ్చే హైదరాబాద్ సాంస్కృతిక ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)కు రాజధాని ముస్తాబైంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే హెచ్ఎల్ఎఫ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తొమ్మిదో ఎడిషన్ వేడుకలకు చైనా అతిథి దేశంగా హాజరుకానుండగా..గుజరాతీ భాషా సాహిత్యాన్ని ఈ ఏడాది భారతీయ భాషగా ఎంపిక చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాది కావడంతో ఆయన తత్వ్త చింతన, సిద్ధాంతాలు, ఆయనపై రూపొందిన సినిమాలపై ఈ వేడుకల్లో చర్చలు, సదస్సులు జరగనున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఆధార్ గుర్తింపు, ‘మీ టూ’ఉద్యమం, సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు, తదితర అంశాలపైన ఈ వేడుకల్లో లోతైన చర్చలు జరగనున్నాయి. చైనా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తం మూడు వేదికలపైన 30 వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ‘కావ్యధార’కు శ్రీకారం ఈ ఏడాది హైదరాబాద్ సాహిత్యోత్సవంలో సరికొత్తగా ‘కావ్యధార’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కావ్యధారలో ప్రతిరోజూ 12 గంటల పాటు నిరంతర కవితా పఠనం ఉంటుంది. ఈ కవి సమ్మేళనంలో తమ కవిత్వాన్ని చదవడమే కాకుండా దానికి వివిధ కళారూపాలను జోడించి ప్రదర్శించడం ఈ కావ్యధార ప్రత్యేకత. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలకు చెందిన కవులు ఈ వేదికను పంచుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కవిత్వానికి సైతం ఇక్కడ చోటు ఉంటుంది. ఈ కావ్యధారలో ఆచార్య ఎన్.గోపీ, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, యాఖూబ్, షబానా ఆజ్మీ, మంగళాభట్, రాజ్‌రావు, ఈల అరుణ్, చైనా రచయిత బైటా తదితరులు పాల్గొంటారు. అలాగే ‘జోష్ – జోష్–ఇ–హైదరాబాద్’పేరుతో దక్కనీ, హిందూస్తానీ కవిత్వ ప్రదర్శనతో పాటుగా లక్నోకు చెందిన కళాకారుల గ్రూపు ‘లక్నవీ కల్చర్’పై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ‘మీ టూ’, గాంధీయిజంపై చర్చలు... గత ఏడాది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ‘మీ టూ’ఉద్యమంపై హెచ్ఎల్ఎఫ్లో మరోసారి చర్చ జరగనుంది. వైరముత్తు నుంచి ఎదురైన వేధింపులను బయటపెట్టిన చిన్మయి శ్రీపాద, ఎంజే అక్బర్ లైంగిక వేధింపులను బహిర్గతం చేసిన దీదీ’పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్టు షుతపాపల్, బెంగళూర్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ లైంగిక వేధింపులను బయటి ప్రపంచానికి చెప్పిన సంధ్య మీనన్‌లు తమ అనుభవాలను ఆవిష్కరించనున్నారు. ‘గాంధీ ఇంపాజిబుల్–పాజిబిలిటీ’, ‘ది మహాత్మా అండ్ మూవీస్’పై పలువురు ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని ప్రసంగిస్తారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ప్రభావం అనే అంశంపైన చర్చ ఉంటుంది. ప్రముఖ రచయిత సుధీర చంద్ర, నిర్మాత సురేశ్ జిందేల్, గోవింద్ నిహ్లానీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ‘పెద్దనోట్ల రద్దు’పై చాల్స్ ఎస్సెస్సీ, రామ్మనోహర్రెడ్డి (ఈపీడబ్ల్యూ) ప్రసంగిస్తారు. ‘ది ఆధార్ స్టోరీ’పైన చాల్స్ ఎస్సెస్సీ, కళలు, కళాకారులు, రచయితలు, మేధావులు, తదితర వర్గాలపైన కొనసాగుతున్న దాడులు, వివిధ వర్గాల్లోంచి వస్తోన్న ఆందోళనలపైన నిఖిలా హెన్సీ (హిందూ), రష్మీ సక్సేనా, తదితరులు ప్రసంగిస్తారు. ముస్కాన్‌కు సన్మానం హెచ్ఎల్ఎఫ్, ఫుడ్ ఫర్ థాట్ ఆధ్వర్యంలో భోపాల్‌లో ‘బాల పుస్తకాలయ’గ్రంథాలయాన్ని నడిపిస్తున్న 11 ఏళ్ల చిన్నారి ముస్కాన్‌ను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. జగర్నాట్ పబ్లిషింగ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఆకాష్జోషి రచనకు పుస్తక ప్రచురణ అవకాశం కల్పిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా 12 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. పదేళ్ల చిన్నారి కృతి మునగాల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనుంది. కైఫే ఆజ్మీ, మృణాళిని సారాభాయిల శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా వారిపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడు వేదికలు–ముప్పై వర్క్‌షాపులు ఈ వేడుకల్లో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక వేదిక ప్రత్యేకంగా కవిత్వం కో సం కేటాయించగా మిగతా రెండు వేదికలపైన చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో 30 వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చె ప్పారు. మట్టి వస్తువుల తయారీ, స్టోరీ టెల్లింగ్, హౌ టూ రైట్ ఏ ఫిల్మ్, క్విజ్ పోటీలు, సినిమా దర్శకత్వంపై చర్చలు, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చైనా నుంచి ఎనిమిది మంది రచయితలు - అతిథి దేశంగా పాల్గొంటున్న చైనా నుంచి 8 మంది రచయితలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. చైనాకు చెందిన ప్రముఖ రచయిత ఎలాయ్ సమకాలీన చైనా సాహిత్యంపై ప్రసంగిస్తారు. - చైనా సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శిస్తారు. - మొదటి రోజు ప్రారంభోత్సవంలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత సితాన్షు యశస్చంద్ర కీలకోపన్యాసం చేస్తారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొంటారు.