Majlis Bachao Tehreek
-
వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరంతా ఒక దారయితే ఉలిపి కట్టెది మరో దారి’ అన్నట్లు ఉంది హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ రాజకీయ పరిస్థితి. అధికార పక్షం కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ సెగ్మెంట్‌ను గాలికి వదిలేశాయి. ప్రతీ లోక్‌సభ సీటును ప్రతిష్టాత్మకంగా భావించి..విజయబావుటా కోసం రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల ఆదిలాబాద్ వరకు వెళ్లి ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాల ముఖ్య నేతలు మహానగరం నడిమధ్య ఉన్న హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ వైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు.ఎన్నికల ప్రచార గడువు ముగింపు మూడు రోజులున్నా.. ఆ రెండు పక్షాల అభ్యర్థుల ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవంగా హైదరాబాద్ అంటే మజ్లిస్ కంచుకోట. ఇక్కడ గత పది పర్యాయాలుగా మజ్లిస్ వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా తయారైంది. ఫలితంగా ప్రతి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా పక్షాలు హైదరాబాద్‌పై ఆశలు వదులుకున్నాయి.. రెండు పక్షాలదే జోరు.. హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మజ్లిస్, బీజేపీ పక్షాలదే జోరు సాగుతోంది. వాస్తవంగా మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడ కేవలం ముస్లిం– హిందూ సామాజిక ఎజెండాలు మాత్రమే పనిచేస్తుండటంతో మజ్లిస్–బీజేపీ మధ్య పోరు కొనసాగుతూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఎన్నికల ప్రచారంలో మజ్లిస్, బీజేపీలు పోటాపోటీగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ పక్షాన సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తుండగా, బీజేపీ పక్షాన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు అగ్రనేతలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అధికారంలో ఉన్నా... రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనకబడినట్లే కన్పిస్తోంది. లోక్‌సభ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం సైతం హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కని్పంచడం లేదు. మొక్కుబడిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను రంగంలోకి దింపి చేతులు దులుపుకొంది. నామినేషన్ కార్యక్రమం సైతం సాదాసీదాగా సాగింది. కేవలం మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాత్రమే పాల్గొన్నారు. ఇక ప్రచారం పర్వంలో అభ్యర్థి సమీర్ వలీవుల్లాతో పాటు స్థానిక నేతలకే పరిమితమైంది. ఇప్పటి వరకు పార్టీ అగ్రనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు సైతం అంతంత మాత్రంగానే కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల గాం«దీభవన్‌లో జరిగిన సమావేశంలో కార్వాన్ నియోజకవర్గంలో ప్రచారం అంశంపై ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు. వాస్తవంగా ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆదిలో వరుసగా కాంగ్రెస్ హవా కొనసాగినా.. మజ్లిస్ శకం ప్రారంభంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కనుమరుగైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైత్రి బంధం కారణంగా మొక్కుబడిగా బరిలో దిగే అభ్యర్థికి కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో సైతం అదే సీన్ పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పట్టని బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటేందుకు అన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్రలు, రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తోంది. కానీ హైదరాబాద్ సెగ్మెంట్‌ను మాత్రం గాలికి వదిలేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వంటి అగ్రనేతలు కనీసం కన్నెత్తి చూడక పోగా, లోక్‌సభ పరిధిలోనే నివాసం ఉండే మాజీ హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు సైతం ప్రచారంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ముందుకు రాకపోవడంతో ప్రచారం మొక్కుబడిగా తయారైంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిలబడగా.. ఆయనే తన అనుచరులు, లోకల్ లీడర్లతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బరిలో ఉన్న మిగతా చిన్నా చితక పార్టీలు, ఇండిపెండెంట్ల పరిస్థితి కూడా అదేవిధంగా మారింది. -
పాతబస్తీలో పతంగేనా?
హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని భూతద్దంలో చూపిస్తుండటంతో హైదరాబాద్ లోక్‌సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్ ఇండియా–మజ్లిస్–ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్‌సైడ్‌గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్ టూ డోర్ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్ శకం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో తొలిసారిగా 1984లో మజ్లిస్ బోణీ కొట్టింది. అప్పటి నుంచి సుల్తాన్సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అనుకూల అంశాలు » అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు » అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం » బలమైన ముస్లిం సామాజిక ఎజెండా » హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు » నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్ » లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం » ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం ప్రతికూల అంశాలు» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు » పాతబస్తీ వెనుకబాటుతనం » తక్కువగా నమోదయ్యే పోలింగ్ శాతం మాధవీలత దూకుడు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీ¯Œ ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు. ఒక నేషనల్ టీవీ చానల్ నిర్వహించిన ‘ఆప్‌కి అదాలత్’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్ ఎంపీ టార్గెట్‌గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్‌రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్ చందర్జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకూల అంశాలు » బలమైన హిందుత్వ ఎజెండా » ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం » పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు » ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు » మజ్లిస్ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం » ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ప్రతికూల అంశాలు» మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం » ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్లోనే ప్రాతినిధ్యం » స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం » బలమైన పార్టీ కేడర్ లేకపోవడం » స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్‌తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో పెట్టింది. అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్ దక్కడం కష్టంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పాతికేళ్లలో కనీసం డిపాజిట్ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ వస్తోంది. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
గోల్కొండ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలు»ొమ్మ అయిన బీజేపీ దళితులు, ముస్లింలకు పక్కా వ్యతిరేకి అని విమర్శించారు. మంగళవారం గోల్కొండ ఎండిలైన్స్ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ ఒకొక్కటిగా తమ ఎజెండాను అమలు చేస్తూ దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారని నిందించారు. గత పదేళ్ల పాలనలో దళితులు, ముస్లింల సంక్షేమానికి ఏమీ చేయని పీఎం మోదీ ఇప్పుడు వారి రిజర్వేషన్లను సైతం రద్దు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం నాయకుల హత్యాకాండ నేరుగా అక్కడి ప్రభుత్వాల కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు. ముస్లిం నేతలు అరెస్టయి జైలుకు వెళ్లే వారు సజీవంగా తిరిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం నేతలను పోలీసులే చంపారని ఆయన గుర్తు చేశారు. నన్ను ఓడించేందుకు మోదీ, అమిత్ షా పాట్లు హైదరాబాద్‌లో అరాచక వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ స్థానం నుంచి తనను ఓడించేందుకు మోదీ, అమిత్ షాలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మతసామరస్యానికి పెట్టిన పేరైన హైదరాబాద్ ఓటర్లు ఎంతో వివేకవంతులనీ, శాంతిభద్రతలు నగర అభివృద్ధి కోరుకుని తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్, కార్పొరేటర్ నసీరుద్దీన్, మహ్మద్ గౌస్ తదితరులున్నారు. -
హైదరాబాద్‌పై ఎగిరిన ‘పతంగి’
సాక్షి,సిటీబ్యూరో: అందరూ అనుకున్నట్టే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపై మజ్లిస్ పార్టీ మరోసారి తన జెండా ఎగురవేసింది. ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వరసగా ఆయన నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ లోక్‌సభ స్థానంలో మజ్లిస్ వరసగా పదిసార్లు విజయదుందుభి మోగిస్తూ వస్తోంది. 1984 ఎన్నికలతో మజ్లిస్ శకం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరసగా సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరుసార్లు ఎన్నికవగా, తర్వాత ఆయన వారసుడిగా అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఎన్నికతో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి కొంత మెజార్టీ తగ్గింది. వికసించని ‘కమలం’ హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా లక్ష్యం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి విజయావకాశాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఆదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఆలే నరేంద్ర బరిలో దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం చేజిక్కించుకోలేక పోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి బరిలోకి దిగిగట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓటమి తప్పలేదు. ఒకసారి పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలోకి దిగినా కేవలం ప్రత్యర్థిగా పరిమితం కావల్సి వచ్చింది. తర్వాత వరసగా రెండు పర్యాయాలు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే మిగిలింది. అనంతరం సుభాష్ చంద్రాజీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ఇక టీడీపీ కూడా ఇక్కడ పరాభవమే ఎదురైంది. రెండు ఎన్నికల్లో టీడీపీ పక్షాన సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహిద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చినా రెండో స్థానానికి పడిపోయారు. వాస్తవంగా టీడీపీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజీపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగినా పరాజయమే మిగిలింది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి నామమాత్రపు పోటికే పరిమితమైంది. మొన్నటి వరకు మజ్లిస్‌కు దెబ్బపడకుండా బలహీన అభ్యర్థిని రంగంలోకి దింపినా కాంగ్రెస్ ఈసారి గట్టి అభ్యర్థిని పోటీకి దింపినా పరాభవమే మిగిలింది. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఇలా.. ఎన్నికలు విజేత పార్టీ సమీప ప్రత్యర్ధి పార్టీ విజేత మెజార్టీ 2004 అసదుద్దీన్ మజ్లిస్ సుభాష్ చందాజీ బీజేపీ 100145 2009 అసదుద్దీన్ మజ్లిస్ జహిద్అలీఖాన్ టీడీపీ 113865 2014 అసదుద్దీన్ మజ్లిస్ డాక్టర్ భగవంతరావు బీజేపీ 302454 2019 అసదుదీన్ మజ్లిస్ డాక్టర్ భగవంతరావు బీజేపీ 2,82187 -
మజ్లిస్‌తో ఢీ
సాక్షి, సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీ కంచుకోట హైదరాబాద్ లోకసభ స్థానాన్ని బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌తో బద్ధ శత్రువైఖరి అవలంబిస్తున్న మజ్లిస్‌ను సొంత గడ్డపైనే ఓడించాలని పకడ్బందీ వ్యూహం పన్నుతోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని గట్టిగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలున్న బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలోని సుమారు 39 మంది పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ ఇప్పటికే దరఖాస్తులను వడపోసి ముగ్గురు పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం విస్తరించి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మినహా ఆరు నియోజకవర్గాలకు మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. గట్టిపట్టు కూడా ఉంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ పోటీ చేయనున్నారు. దీంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అసద్‌ను ఢీ కొట్టేదెవరు..? మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే...ఈ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ బరిలోకి దింపితేనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. గతేడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. 2009లో ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అజహరుద్దీన్ గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టోంక్ సవాయి మదోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అధిష్టానం హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపాలని భావిస్తుండగా, ఆయన మాత్రం సికింద్రాబాద్‌లోక్ సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. మరోవైపు ముంబయి సెంట్రల్ నుంచి బరిలో దిగుతారని అక్కడి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ అభ్యర్థిత్వం కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఇప్పటికే నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ముచ్చటగా మూడు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలోకి నాంపల్లి నియోజకవర్గం రానప్పటికీ పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. తాజాగా టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పేరు కూడా వినవస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్‌పై సోహెల్ బరిలో దిగుతారని సోషల్ మీడియా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. సోహెల్ అభ్యర్థిత్వం ఖాయమని, అధికారిక ప్రకటనే తరువాయి అని ప్రచారం కొనసాగుతోంది. అయితే అధిష్టానవర్గం బరిలో ఎవరిని దింపనుందో వేచిచూడాల్సిందే. -
మజ్లిస్‌కు ఎమ్మెల్సీ చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో మరోమారు ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ఎమ్మెల్యే కోటాలో మిత్రపక్షమైన మజ్లిస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధికార పక్షమైన టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమెల్సీ అవకాశం లభించడం ఇదే తొలిసారి. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సహకారంతో ఎమ్యెల్యే కోటాలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. తాజాగా ఐదుగురు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి మిగిలిన ఒక స్థానంలో మజ్లిస్‌కు అవకాశం కల్పించింది. అభ్యర్థి ఖరారు బాధ్యత మజ్లిస్ పార్టీకి వదిలివేసింది. దీంతో మజ్లిస్ పార్టీ ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో సయ్యద్ అమీన్ జాప్రీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఆయన వరసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ వస్తున్నారు. వైఎస్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే కోటాలో మజ్లిస్ పార్టీకి తొలిసారిగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. అప్పట్లో మజ్లిస్ ఎమ్మెల్సీగా సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ ఎన్నికయ్యారు. తిరిగి 2011లో కూడా రెండోసారి ఆయన ఎన్నికయ్యారు. 2017తో ఆయన పదవీ కాలం పూర్తయినా తిరిగి మజ్లిస్ పార్టీ ఎమ్మెలే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేయలేదు. తాజగా ఖాళీ అవుతున్న ఐదు స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అధికార పక్షమైన టీఆర్ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఒక స్థానాన్ని మజ్లిస్‌కు అవకాశం ఇవ్వనుంది. కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపిన అసద్ మజ్లిస్‌పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్–మజ్లిస్ కలిసి 17 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. -
వార్ వన్ సైడ్
హైదరాబాద్ పాత నగరం.. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రాచీన నగరంలో హిందూ ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచారార్భాటాలు ఇక్కడ నడడవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్’గా అందరి నోళ్లలో నానే మజ్లిస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నాయి. పాత నగరం మనోగతం ⇒ నిజాం కాలం నాటి అంతర్గత డ్రైనేజీ, నీటి పైప్లైన్ల ఆధునీకరణ.. వర్షపు నీరు రోడ్లు, బస్తీలను ముంచెత్త్తకుండా నివారణ చర్యలు ⇒ ఇరుకైన రోడ్లు, బ్రిడ్జిల విస్తరణ, అంతర్గతడ్రైనేజీ, ఓపెన్ కాల్వల శుద్ధి.. ⇒ శిథిలావస్థలోని పురాతన కట్టడాల తొలగింపు ⇒ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు ⇒ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల తొలగింపు ⇒ నిరుపేదలకు ఉచితంగా కేజీ టూ పీజీ విద్య, పేదల సౌకర్యార్థం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన ⇒ చిరు వ్యాపారులకు బ్యాంక్ లింకేజీ లేకుండా రుణాలు, ఆర్థిక చేయూత ⇒ వృత్తి నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు ⇒ పాతబస్తీలో రోడ్డు రవాణా సౌకర్యాల మెరుగు.. మెట్రో పొడిగింపు ⇒ హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ కేంద్రం నెలకొల్పాలి ⇒ ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానా విధానాన్ని రద్దు చేయాలి. చార్మినార్: అహ్మద్‌ఖాన్ ఆరోసారి.. చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ అడ్డా. ఇక్కడ ఐదు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉంది. యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు గెలుపొందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఆరోసారి ఇక్కడి నుంచి పోటీకి దిగారు. ఇంకా మహ్మద్ గౌస్ (కాంగ్రెస్), ఉమా మహేందర్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఇక్కడ మజ్లిస్‌కు పోటీ అంతంతే. గత ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి 36 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీపై గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గౌస్ మజ్లిస్ మాజీ కార్పొరేటర్. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాను లబ్ధి పొందవచ్చనేది బీజేపీ అంచనా. అహ్మద్ఖాన్ఉమా మహేందర్మలక్పేట: కొట్టేనా హ్యాట్రిక్! మలక్‌పేట నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అహ్మద్ బీన్ అబ్దుల్ బలాల (మజ్లిస్).. హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో బలాల 23 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్రపై గెలుపొందారు. జితేంద్ర.. దివంగత నేత టైగర్ నరేంద్ర కూమారుడు. గతంలో గౌలిపురా కార్పొరేటర్‌గా పనిచేసిన రాజకీయానుభవం ఉంది. హిందుత్వ ఎజెండాతో ఈయన ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రజాకూటమి పక్షాన పోటీ చేస్తున్న ముజఫర్ (టీడీపీ).. ముస్లిం ఓట్లు చీలి లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సతీష్ కూడా పోటీలో ఉన్నారు.-అబ్దుల్ బలాల, ఆలె జితేంద్ర బహదూర్‌పురా: పోటీ ఎవరు? బహదూర్‌పురా మజ్లిస్‌కు కంచుకోట. గత మూడు దఫాలుగా ఆ పార్టీదే ఇక్కడ ప్రాతినిధ్యం. ఇక్కడి ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ముస్లింలే. తాజా మాజీ ఎమ్మెల్యే మౌజం ఖాన్ (మజ్లిస్) ప్రధాన పోటీదారు కాగా, ఇనాయత్‌అలీ బక్రీ (టీఆర్ఎస్), మహ్మద్ కలీం (కాంగ్రెస్), హనీఫ్ అలీ (బీజేపీ) పోటీలో ఉన్నారు. మజ్లిస్‌కు పోటీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో మౌజంఖాన్ 95 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారీ తిరిగి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.-మౌజం ఖాన్, హనీఫ్ అలీ ‘నాంపల్లి’ సెగ్మెంట్ కాడ.. ఇక్కడ పాత ప్రత్యర్థులే మళ్లీ బరిలో నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ (మజ్లిస్) అప్పటో టీడీపీ నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఫిరోజ్‌ఖాన్ కాంగ్రెస్‌లో చేరి ప్రజాకూటమి పక్షాన కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి తలపడుతున్నారు. రెండుసార్లు ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్‌పై సానుభూతి వ్యక్తమవుతుండటం మజ్లిస్‌ను కొంచెం కలవరపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో నెలకొన్న హోరాహోరీ పోటీపై పాత నగరంలో ఉత్కంఠ నెలకొంది.-జాఫర్ హుస్సేన్, ఫిరోజ్‌ఖాన్ గోషామహల్: కాంగ్రెస్–బీజేపీ హల్చల్ గోషామహల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ), మాజీ ఎమ్మెల్యే ఎం.ముఖేష్‌గౌడ్ (కాంగ్రెస్), ప్రేమ్‌సింగ్ రాథోడ్ (టీఆర్ఎస్) తలపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నడుమ నువ్వానేనా అన్నట్టుంది. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన రాజాసింగ్.. ముఖేష్‌గౌడ్‌పై 46 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. హిందుత్వ ఎజెండాపై రాజాసింగ్, ప్రజాకూటమి బలం, మైనారిటీ ఓట్లు కలిసి వస్తాయని ముఖేష్ ఆశ పెట్టుకున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.- రాజాసింగ్, ఎం.ముఖేష్‌గౌడ్, ప్రేమ్‌సింగ్ రాథోడ్ కార్వాన్.. కేరాఫ్ కౌసర్? కార్వాన్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ (మజ్లిస్) మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన కౌసర్.. బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై 37 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఇంకా ఇక్కడ జీవన్‌సింగ్ (టీఆర్ఎస్), అమర్‌సింగ్ (బీజేపీ) ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ (కాంగ్రెస్) పోటీలో ఉన్నా.. మజ్లిస్‌కు పోటీ అంతంతగానే ఉంది. హిందుత్వ ఎజెండా ఇక్కడ బలంగానే ఉన్నా.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోవడం మజ్లిస్‌కు కలిసివస్తుందని అంచనా.-కౌసర్, అమర్‌సింగ్ ‘గుట్ట’లోన మొనగాడు! చాంద్రాయణగుట్ట తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (మజ్లిస్) ఐదో సారి గెలుపు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గం ఆది నుంచీ మజ్లిస్‌కు కంచుకోట. బీజేపీ ఇక్కడి నుంచి ముస్లిం మహిళ సయ్యద్ షాహజాది (బీజేపీ)ని రంగంలోకి దింపింది. అయితే, గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ ఇసాబిన్ ఉబేర్ మిస్రీ (కాంగ్రెస్), సీతారాంరెడ్డి (టీఆర్ఎస్) పోటీలో ఉన్నారు. గత నాలుగు పర్యాయాలుగా మజ్లిస్‌తో ఎంబీటీ తలపడినా ఫలితం లేకపోతోంది. గత ఎన్నికల్లో ఎంబీటీకి చెందిన ఖయ్యూంఖాన్పై 59 వేల పైచిలుకు ఓట్లతో అక్బరుద్దీన్ విజయం సాధించారు. రెండేళ్ల క్రితం ఖయ్యూంఖాన్ చనిపోవడంతో పాటు కేడర్ కాస్తా ఎంఐఎంలో చేరడంతో ఎంబీటీకి పట్టు సడలింది. నియోజకవర్గంలోని హిందూ ఓట్లు అధికంగా గల ప్రాంతం పునర్విభజనలో మూడు ముక్కలైంది. దీంతో మజ్లిస్‌కు ఇక్కడ నల్లేరుపై నడకే.- అక్బరుద్దీన్, షాహజాది యాకుత్‌పురా: మజ్లిస్–ఎంబీటీ ఢీ యాకుత్‌పురా నియోజకవర్గంలో మజ్లిస్‌తో ఎంబీటీ తీవ్రంగా తలపడుతున్నా పోటీ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఇక్కడ మజ్లిస్‌కు గట్టి పట్టుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్టపై దృష్టి పెట్టిన ఎంబీటీ ఈసారి ఇక్కడ గట్టెక్కేందుకు శతవిధాల ప్రయత్నిసోంది. మజ్లిస్‌తో పోటీపడి పాదయాత్రలు, కార్నర్ మీటింగ్‌లు, బహిరంగసభలు, మహిళ గ్రూప్ మీటింగ్‌లు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి అహ్మద్ పాషాఖాద్రీ (మజ్లిస్), రాజేంద్రరాజు (కాంగ్రెస్), రూప్‌రాజ్ (బీజేపీ) తలపడుతున్నారు. ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండటంతో మజ్లిస్ ఆయనను చార్మినార్‌కు పంపించింది. అయితే, పాత ఎమ్మెల్యేపై గల వ్యతిరేకత కలిసి వస్తుందని ఎంబీటీ భావిస్తోంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. గత పర్యాయం రూప్‌రాజ్ 32 వేల ఓట్లు సాధించారు. ఎంఐఎం–ఎంబీటీ మధ్య ముస్లిం ఓట్లు చీలి, తాను లాభపడతానని బీజేపీ ఆశ.- అహ్మద్ పాషాఖాద్రీ, రూప్‌రాజ్ ఆ రెండు స్థానాల్లోనే ‘పోటీ’ పాతబస్తీలోని నియోజకవర్గాలన్నీ మజ్లిస్‌కు కంచుకోటలే. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాతనగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను బద్ధలు కొట్టి పాగా వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎంబీటీ కూడా మజ్లిస్‌తో ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే, ఇవి ఆయా ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికలప్పుడు స్నేహ పూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్‌కు కలిసివస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్, తాజాగా టీఆర్ఎస్తో మజ్లిస్ దోస్తీ చేస్తోంది. కాంగ్రెస్ .. నాంపల్లి మినహా మిగతా చోట్ల «ధీటైన అభ్యర్థులను నిలపలేదు. ఇది మజ్లిస్‌కు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్, బహుదూర్‌పురా స్థానాల్లో మజ్లిస్ గెలుపొందింది. గోషామహల్లో పోటీకి దూరంగా ఉంది. ఈసారి చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహుదూర్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్‌గా కనిపిస్తుండగా, నాంపల్లిలో కాంగ్రెస్, యాకుత్‌పురాలో ఎంబీటీ గట్టి పోటీ ఇస్తున్నాయి. గోషామహల్లో మజ్లిస్ పోటీలో లేదు. పేదల గూడు చినబోతోంది.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారడం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో భరోసా ఇస్తారు. ఆపై మరిచిపోతారు. మాకు కష్టపడితే కానీ కడుపు నిండదు. వచ్చిన సొమ్ము కడుపు నింపుకునేందుకు సరిపోతుంది. తలదాచుకోను గూడు లేక అవస్థలు తప్పట్లేదు. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ప్ర«భుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ మహబూబ్, పండ్ల వ్యాపారి, ఫలక్‌నుమా చిరు వ్యాపారులకు రుణాలు చిరు వ్యాపారులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు బ్యాంక్ లింకేజీతో పని లేకుండా రుణాలివ్వాలి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకొంటూ, సంచారం చేస్తూ వ్యాపారాలు చేసే వారికి లైసెన్స్‌లిచ్చి రుణ సహాయం అందించాలి.– రాజేందర్, టిఫిన్ బండి వ్యాపారి, ఫూల్‌బాగ్ -
ఎంఐఎంకు దీటైన పోటీ.. అక్బర్‌పై పహిల్వాన్ సై..!
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఎంఐఎంను ఎదుర్కొనేందుకు ఎంబీటీ (మజ్లిస్ బచావో తెహ్రీక్) పార్టీని కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. ఓల్డ్ సిటీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై భక్తచరణ్ దాస్ కమిటీతో కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. పొత్తులో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ పహిల్వాన్ కొడుకు గురువారమే భక్తచరణ్ దాస్ కమిటీని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్‌సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫక్రుద్దీన్‌కు షాక్ కాంగ్రెస్ మైనారిటీ నేత ఫక్రుద్దీన్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. టీపీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఫక్రుద్దీన్‌ను తొలగించి.. ఆయన స్థానంలో షేక్ అబ్దుల్లా సోహైల్‌ను అధిష్టానం నియమించింది.