నాని నాన్నయ్యాడు
లైఫ్లో ఎప్పటికీ మరువలేని తీపి గుర్తును ఈ ఉగాది నానీకి అందించింది. పండగనాడు నాని సతీమణి అంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2012లో నాని, అంజనల వివాహం జరిగింది. అంతకు ముందు ఫేస్బుక్లో మొదలైన వీళ్లిదరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
నూతన తెలుగు సంవత్సరాదిన బుల్లి నాని ఇంట అడుగు పెట్టడంతో నాని, అంజనల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు నానీకి శుభాకాంక్షలు తెలిపారు.