మరోసారి కోలీవుడ్‌పై ఆశలు
మరోసారి కోలీవుడ్‌పై ఆశలు పెట్టుకుంటోంది నటి లావణ్య త్రిపాటి. ఉత్తారాఖాండకు చెందిన అమ్మడు ఆ రాష్ట్ర అందాలరాశిగా కిరీటాన్ని కూడా పొందింది.అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించిన లావణ్య త్రిపాది బ్రహ్మ చిత్రం ద్వారా శశికుమార్‌కు హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దాంతో లావణ్య త్రిపాటికి పెద్దగా గుర్తింపు లభించలేదు. అవకాశాలు రాలేదు. ఇక చేసేదేమీలేక టాలీవుడ్‌పై దృష్టి సారించింది.అక్కడ కొన్ని అవకాశాలు రావడంతో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని భావించింది.ఇటీవల నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించిన లావణ్య త్రిపాదికి నిరాశే మిగిలింది.ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది.నిర్మాతగా పలు విజయాలను సాధించిన యువ నిర్మాత సీవీ.కుమార్ తొలిసారిగా దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కిస్తున్న చిత్రం మాయన్.ఇందులో యారడామహేశ్ చిత్రం ఫేమ్ సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.ఆయనకు జంటగా నటించే అవకాశం లావణ్య త్రిపాటిని వరించింది.
చాలా కాలం తరువాత తమిళంలో లభించిన అవకాశం కావడంతో లబక్కున ఒప్పేసుకుందట. హారర్ నేపధ్యంలో సాగే ఈ మాయన్ చిత్రాన్ని సీవీ.కుమార్ స్వీయ దర్శకత్వంలో సొంత సంస్థ శ్రీకుమరన్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై భారీ ఎత్తున రూపొందిస్తున్నారు.చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మాయన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.ఈ చిత్రంపై నటి లావణ్య త్రిపాటి చాలా ఆశలనే పెట్టుకుందట.