ఎమ్మెల్సీ బోస్‌ను కలిసిన ముద్రగడ
హస¯ŒSబాద(రామచంద్రపురం రూరల్) :
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం హస¯ŒSబాదలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఆయన స్వగృహంలో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ముద్రగడ మాట్లాడుతూ తనకు మంచి స్నేహితుడైన ఎమ్మెల్సీ బోస్‌ను స్నేహపూర్వకంగానే కలిశానన్నారు. ఆయన వెంట కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, తొగరు మూర్తి, అనిశెట్టి సత్యం కాపు, నల్లా దుర్గారావు, సూరిబాబు తదితరులున్నారు.