ఆధిపత్యం భరించలేకే చంపేశాం
యువకుడి హత్య కేసులో నిందితుల వెల్లడి
స్నేహితులే హంతకులు నలుగురికి రిమాండు
కేసు వివరాలను వెల్లడించిన ఏసీపీ సురేందర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: యువకుడి హత్య మిస్టరీ వీడింది. స్నేహితులే అతడిని చంపేశారు. తరుచూ మద్యం తాగించమని, డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ తమపై ఆధిపత్యం ప్రదర్శించడంతో చంపేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. ఏసీపీ సురేందర్‌రెడ్డి శనివారం స్థానిక ఠాణాలో కేసు వివరాలు వెల్లడించారు. నగరంలోని బడంగ్‌పేట మిధాని టౌన్షిప్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీకి చెందిన కోయలకొండ అర్జున్ కుమారుడు అభిమన్యు(19) ఐటీఐ చదువుతూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతడికి బాలాపూర్‌కు చెందిన అడ్ల రమేశ్ అలియాస్ రాకి (19), గొట్టిముక్కల రాఘవాచారి అలియాస్ రఘు(19), మెగావత్ లక్ష ్మణ్ నాయక్ (19), వరియోగి సాయితేజ (19), లష్కర్ శివానంద్ అలియాస్ శేఖర్(19), కంసల కిట్టు అలియాస్ కార్తిక్(19) స్నేహితులు. వీరంతా తమ ఆర్థిక అవసరాల కోసం స్థానికంగా పనులు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అభిమన్యు తరచూ మద్యం తాగించమని, డబ్బులు ఇవ్వమని స్నేహితులను బెదిరిస్తూ వారిపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు.
ఇది భరించలేని అతడి మిత్రులు ఎలాగైనా అభిమన్యును చంపేయాలని పథకం పన్నారు. ఈక్రమంలో ఈనెల 1న అభిమన్యుతో కలిసి మద్యం తాగారు. అభిమన్యు మత్తులోకి జారుకున్నాక రాత్రి 10 గంటల ప్రాంతంలో బడంగ్పేట్ నుంచి ఆటోలో నాదర్గుల్ మీదుగా ఆదిబట్ల సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ అంతా కలిసి మళ్లీ మద్యం తాగారు. రమేశ్ కత్తితో అభిమన్యు గొంతు కోశాడు. రాఘవాచారి బండరాళ్లతో మోదాడు. మిగిలిన వాళ్లు అభిమన్యును కదలకుండా పట్టుకున్నారు.
అభిమన్యు చనిపోయాడని నిర్ధారించుకున్నాక తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు రమేశ్, రాఘవాచారి, సాయిలు కలిసి తిరుపతి వెళ్లారు. మిగతా వారు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు హత్య విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకొని వివరాలు సేకరించారు. లభించిన ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సా యంతో అభిమన్యు స్నేహితులపై నిఘా ఉం చారు.
శనివారం ప్రధాన నిందితులు రమేష్, రాఘవాచారి మినహా మిగతా వారు బడంగ్పేట్ చౌరస్తాలో ఉండగా అదుపులోకి తీసుకొ ని విచారించగా నేరం అంగీకరించారని ఏసీపీ తెలిపారు. అనంతరం వారిని రిమాం డుకు త రలించారు. నిందితులపై గతంలో పలు కేసు లు కూడా న మోదయ్యాయని తెలిపారు.