వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన పొంగులేటి
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో మిని వాటర్ ఫ్లాంట్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆదివారం నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అంగన్వాడీ కేంద్రానికి నిధులు కేటాయిస్తామని పొంగులేటి చెప్పారు. పాఠశాల భవనం మరమ్మత్తు, చర్చికి చుట్టుగొడ ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని హామినిచ్చారు.