అసెంబ్లీపై కేసీఆర్కు గౌరవం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యం, శాసనసభ, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీస గౌరవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అతి తక్కువ కాలం శాసన సభను నిర్వహించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారంటూ ఎద్దేవా చేశారు. పథకాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని కేవలం మాటల్లోనే అమలు చేస్తున్నారని, ప్రజలను ఊహాలోకాల్లో విహరింపజేస్తున్నారని విమర్శించారు. కేవలం హోర్డింగుల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నారంటూ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. దరఖాస్తు చేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలైనట్టని చెప్పారు.