మ్యాచ్ అయ్యాక వీళ్లంతా ఏం చేశారో తెలుసా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ కాని, ఫుట్ బాల్ మ్యాచ్ కానీ చూశామా? ఎంజాయ్ చేశామా? వెళ్లామా? అన్నట్టే ఉంటారు ప్రేక్షకులు. స్టేడియంను డస్టు బిన్ లా మార్చేసే తాము వేసే వ్యర్థాల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ శనివారం షిల్లాంగ్ లో జరిగిన దేశంలోనే అతిపెద్ద పురుషుల ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వచ్చిన ప్రేక్షకులు చేసిన స్వచ్ఛమైన పని సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. మిజోరాం ఐజ్వాల్ ఎఫ్సీ తన తొలి మ్యాచ్ ను గెలువగానే, ఆ టీమ్ ఫ్యాన్స్ దాదాపు 23వేల మంది వెంటనే స్టేడియంను క్లీన్ చేయడం ప్రారంభించారు. తమ టీమ్ గెలుపును స్వచ్ఛ్ భారత్ తో సెలబ్రేట్ చేసుకున్నారు.
''మ్యాచ్ అయిపోగానే డస్ట్ నంతా క్లీన్ చేసినందుకు ఐజ్వాల్ ఫుట్ బాల్ ప్యాన్స్ కు ధన్యవాదాలు. మాతో పాటు మిగతవారందరూ మీ దగ్గరనుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది'' అని ఓ ఫ్యాన్ వారి క్లీనింగ్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతను ఈ మెసేజ్ ను రాస్తున్నంత సేపట్లోనే ఆ ఫోటోగ్రాఫ్ కు 840 షేర్లు, 1800 లైక్స్ వచ్చాయి. అంతేకాక ఈ మెసేజ్, ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటు ఫేస్ బుక్ మాత్రమే కాక, మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ సైతం ఫుట్ బాల్ ప్యాన్స్ ను పొగడ్తలో ముంచెత్తుతోంది. దీనిపై యువజన వ్యవహారాల, క్రీడా సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా స్పందించారు.
'' ఐ-లీగ్ గెలుపు, ఐజ్వాల్ ఎఫ్సీ ప్యాన్స్ షిల్లాంగ్ స్టేడియమంతటిన్నీ క్లీన్ చేయడం నిజంగా మా హృదయాలను గెలుచుకుంది. ఇదే నిజమైన స్వచ్ఛ్ భారత్ కు ఉదాహరణ. అందరూ వీరిని చూసి నుంచి నేర్చుకోవాల్సి ఉంది'' అని ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఒకే స్థలంలో జరిగే మ్యాచ్ లతో స్టేడియంలలో ఎక్కువ ఘన వ్యర్థ్యాలను ఉత్పత్తి అవుతాయి. మ్యాచ్ అయిన తర్వాత స్టేడియమంతా ఓ డస్టు బిన్ లా మారిపోతుంది. 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే సమయంలో మొత్తం 40వేల మంది ప్రేక్షకులు దీనిలో పాలుపంచుకుంటున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంచనావేసింది. దీంతో ఒక్కో మ్యాచ్ జరినే సమయంలో 10మెట్రిక్ టన్నుల వ్యర్థ్యాలు జనరేట్ అవుతాయని ఆందోళన కూడా వ్యక్తంచేసింది.