నిజాయితీగా పనిచేయండి
వెదురుకుప్పం : రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పేదలకు అన్యాయం చేయవద్దని, బదిలీలకు భయపడకుండా నిజాయితీగా పనిచేయాలని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి అధికారులకు హితవుపలికారు. ఆదివారం వెదురుకుప్పం స్త్రీ శక్తి భవన్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెదురుకుప్పం మండల తహశీల్దార్ ఇంద్రసేనపై ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కా రం కోసం వచ్చిన ప్రజల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయన్నారు.
అధికార పార్టీకి చెందిన నాయకుల అండ చూసుకునే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని, రాజకీయా లు ఎన్నికల వరకే ఉండాలని తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు కట్టుబడాల ని సూచించారు. ఫిర్యాదులపై కలెక్టర్ స్పందించి ఆమెను బదిలీ చేసేందుకు ప్రయత్నించినా మంత్రి నుంచి ఫోన్ రా వడంతో ఆ ఫైల్‌ను పక్కన పడేసినట్లు ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇలాకాలోనే అవినీతి అధికారులును ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేయడం చూస్తుం టే వారి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రెవెన్యూ అధికారుల తీరు మారాలని ఆరు నెలలుగా చెబుతున్నా ఫలితం కనిపించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు రాజకీయ దురుద్దేశంతోనే రేషన్ డీలర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకుని నిజాయితీగా పనిచేయాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరి ణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎస్.మాధవరావు, ఎంపీపీ పురుషోత్తం, పలువురు నాయ కులు పాల్గొన్నారు.