mla kodali nani
-
ఎంపీ సీటు రూ.150 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు సీట్లు అమ్ముకుంటున్నారని, రూ.150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేసిన కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. గుడివాడలో కూడా రూ.100 కోట్లు ఇచ్చినోడికి సీటిచ్చారని తెలిపారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రేవంత్‌ను కలవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో మేం ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. ఆ రాష్ట్ర సీఎం గురించి ఇక్కడ చర్చ అనవసరం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సీఎం. ఆయనది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? ఆయన ఏమైనా సుప్రీమా? ఆయనకు ఏందీ ఫోన్ చేసేది. రేవంత్ ముఖ్యమంత్రి అయినందుకు సీఎం వైఎస్ జగన్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు అయితే ఎవరు సీఎం అవుతారా అని చూస్తుంటారు. రేవంత్‌రెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా ఎందుకు కలుస్తారు. తుంటి ఎముక విరిగినందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. రేవంత్‌ను పరామర్శించడానికి ఆయనకు తుంటి ఎముక విరగలేదు కదా?. ఏపీలో సీట్లు ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుంది. రేవంత్ చెప్తే ఇక్కడ సీట్లు ఇవ్వరు. ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలి అనుకుంటే తెలంగాణలో సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో పోటీ చేయాలి. ఆయనే ఆంధ్రాలో పీసీసీ అధ్యక్షుడు అయినా మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబును గెలిపించేందుకే షర్మిలను వినియోగించుకుంటున్నారు. మా సీఎంను కలిసేందుకు మాకు సమయం సరిపోవడం లేదు. పక్క రాష్ట్రం సీఎంను కలసి మేం ఏం చేస్తాం. పక్క రాష్ట్రాల రాజకీయాలు పట్టించుకునే స్థితిలో మా నాయకుడు, మేము లేం. ఏబీఎన్ రాధాకృష్ణవి అన్నీ వెకిలి ప్రోగ్రాములు. ముగ్గురిని కంటే రూ.45 వేలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. అదే రూ.45 వేలు ఇచ్చి వాళ్ల పప్పుగాడిని పిల్లలను కనమని చెప్పాలి. వాడినే ఐదారుగురుని కనమని చెప్పాలి. కృష్ణా జిల్లాలో పార్టీని ఎవరూ వీడటంలేదు కారణాలు చెప్పి వైఎస్సార్సీపీ సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఏ సీటు మార్చుతున్నారో వారినే సీఎం పిలిచి మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎవరూ పార్టీ నుంచి వెళ్లడం లేదు. పార్థసారథికి సీటు ఇవ్వడంలేదని సీఎం ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది లిస్టు పెట్టుకుని సీఎం చర్చిస్తున్నారు. నా నియోజకవర్గంలో సమస్యలపై సీఎంను కలిసి మాట్లాడా. -
గుడివాడ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: కొడాలి నాని
-
రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలాడారు
-
గుడివాడలో నేడు భారీ బహిరంగసభ
గుడివాడ : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. సోమవారం ఉదయం గుడ్లవల్లేరు మండలంలోని కవిరాజ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమై గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ స్టాండ్ వద్ద మధ్యాహ్నం బస ఉంటుందని చెప్పారు. అక్కడ నుంచి మార్కెట్ యార్డు పెద్దకాలువ సెంటర్ మీదుగా గుడివాడ చేరుకుని గుడివాడ నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
‘చంద్రబాబు పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావు’
గుంటూరు : రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం చేతిలో దారుణమైన మోసానికి గురవుతున్నవారికి అండగా ఉండేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన మంగళవారం రైతుదీక్ష ప్రాంగణంలో మాట్లాడుతూ ...దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే వైస్ జగన్ దీక్షకు పూనుకున్నారని అన్నారు. రైతు దీక్ష చేస్తే ప్రభుత్వానికి కదలిక వచ్చి గతంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దొంగ వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన దొంగ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేస్తారని వైఎస్ జగన్ ...రెండురోజుల పాటు దీక్ష చేపట్టారన్నారు. అలాంటి జగన్‌పై తన మంత్రులు, చెంచాలు, పకోడి గాళ్లను పెట్టించి చంద్రబాబు నాయుడు తిట్టించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సిగ్గు,శరం ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొడాలి నాని హెచ్చరించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు ఆక్రమించుకుంటే, కాంగ్రెస్ విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత అయ్యారన్నారు. టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి మంత్రిని చేశారని, ఆ మంత్రి నీటి సమస్యను పరిష్క్రరించడం కాదు, సృష్టిస్తారని చెప్పడం బాధాకరమన్నారు. టీడీపీ నేతలతో పాటు కొంతమంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని, జగన్ సీఎం అయితే చంద్రబాబు ఇక్కడ నుంచి పారిపోతారని, అలాంటి అధికారులు ఆత్మపరిశీలన చేసుకొని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని అన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
గుడివాడ టౌన్ : ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మరోసారి అవమానం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత నేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దుండగుల చేతుల్లో ధ్వంసమైంది. రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఖండన.. భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో జీవిస్తున్నామంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమేనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్నివేళల్లో అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆయనను అవమాన పరిచామనుకుంటే భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచినట్లేనన్నారు. ఈ విధమైన చర్యలకు స్వస్తి పలకాలని ఆయన హితవుపలికారు. ఎమ్మెల్యే నానితో పాటు కౌన్సిలర్ గొర్ల శ్రీను, కో–ఆప్షన్ సభ్యుడు సర్ధార్‌బేగ్, వైఎస్సార్ సీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఖర్చులతో విగ్రహం నిర్మిస్తాం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయ డం నీచమైన చర్యని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంఘటన స్థలం వద్ద దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ మున్సిపల్ నిధులతో ఇక్కడే భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ దళిత నాయకులు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నుంచి నెహ్రూచౌక్ వరకు దోషులను శిక్షించాలి, నిందితులను అరెస్టు చేయాలి, జోహార్ అంబేడ్కర్ అంటూ ర్యాలీ కొనసాగింది. స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటాం సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యని నిందితులు ఎంతటి వారైనా సాధ్యమైనంత త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చామని, అది సంఘటన సమీపంలోని కొన్ని స్థలాల్లో సంచరించిందని తెలిపారు. తమకున్న సమాచారంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
సిగ్గుమాలిన పనిచేసి కొనసాగుతారా?
- గుడివాడ మున్సిపల్ చైర్మన్‌పై వైఎస్సార్సీపీ సభ్యుల ఆగ్రహం - పార్టీకి రాజీనామా చేసేవరకు కౌన్సిల్‌కు రానివ్వబోమన్న కొడాలి గుడివాడ: వైఎస్సార్సీపీ తరఫున గెలుపొంది, గుడివాడ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టి ఇటీవల టీడీపీలో చేరిన యలవర్తి శ్రీనివాసరావుపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిగ్గుమాలిన పనిచేసి ఏ ముఖం పెట్టుకుని చైర్మన్‌గా కొనసాగుతాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నిలదీశారు. తమ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు రాజీనామా చేసేవరకు వారిని కౌన్సిల్‌కు రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. పార్టీ ఫిరాయించిన చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సమావేశ మందిరంలోకి ప్రవేశించడం చూసిన వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ చోరగుడి రవికాంత్ ఆవేశానికి లోనయ్యారు. బూటుతో కొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ.. పార్టీ మారి నీతిమాలిన రాజకీయాలు చేసినవారిని చెప్పుతో కొట్టాలన్నారు. కౌన్సిల్ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత మాట్లాడుతూ.. ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బవంటిదని ఆయన వ్యాఖ్యానించారు. యలవర్తికి దమ్ముంటే రాజీనామా చేసి పార్టీ మారాలని అన్నారు. -
తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు
-
తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు
తాను ఏ తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోడానికి వీల్లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. తమకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, వీడియో ఫుటేజిలో ఎక్కడా తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు లేదని నాని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారిపై ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారు. -
పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలిl
బంటుమిల్లి : బంటుమిల్లి కాలువ శివారు భూములకు సాగునీరు అందాలంటే ప్రభుత్వం వారబంది పేరుతో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని నాని డిమాండ్ చేశారు. సోమవారం బంటుమిల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వందల ఏళ్లుగా కృష్ణానది నీటితోనే జిల్లా రైతులు వ్యవసాయం చేస్తున్న విషయాన్ని మరచి ఇప్పుడు కొత్తగా గోదావరి జలాలతో కృష్ణాజిల్లా సస్యశ్యామలం అయ్యిందని మంత్రి దేవినేని ఉమా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న పులిచింతల ప్రాజెక్టును టీడీపీ పాలకులు విస్మరించారని అన్నారు. పులిచింతల పూర్తిచేస్తే కృష్ణా డెల్టా పరిరక్షించబడుతుందన్నారు. కానీ దోపిడీ జరిగిందంటూ చంద్రబాబు, ఉమాలు దానిని విస్మరిస్తున్నారన్నారు. అడ్డగోలుగా దోచుకునేందుకే పట్టిసీమను తెరపైకి తెచ్చి పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తున్నారని విమర్శించారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనలేకనే టీడీపీ పంచకు.. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నానీ విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరిని చంద్రబాబు రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా పెడన ప్రజలంతా వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలవాలన్నారు. నీటిపారుదలా శాఖా మంత్రి దేవినేని ఉమా తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యాపారాలపై దాడులు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్ల లొంగి వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పాల రాము, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, పెడన మండలాల అధ్యక్ష, కార్యదర్సులు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతి, బాబు, దావు భైరవలింగం, పట్టపు బుజ్జి, పల్లెకొండ శివ, బీసీ సెల్ జిల్లా కన్వీనరు తిరుమాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు బొర్ర రమేష్, పిన్నింటి మహేష్, జిల్లా కార్యదర్సులు బండారు చంద్రశేఖర్, కందుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలి
గుడివాడ : ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, ఇప్పటికైనా చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హితవు పలికారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి హోదా కావాలని తమ వాణిని బంద్ ద్వారా వినిపించారన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి దద్దమ్మ చంద్రబాబు తన డ్రామాలు మానుకోవాలని సూచించారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి మోదీ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు. హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికే.. పోలీసులతో నాలుగు బస్సులు బలవంతంగా నడిపించి రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికి చంద్రబాబు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నాడని నాని మండిపడ్డారు. రాజకీయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు రాష్ట్ర ప్రజలకు తన స్వప్రయోజనాలకోసం వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా అవసరంలేదు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని అడిగిన చంద్రబాబు.. ఆడబ్బు వస్తే తండ్రీ కొడుకులు దోచుకోవచ్చని అనుకున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ నేతలు పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అవినీతి, ఆయన చిల్లర రాజకీయాల గురించి చూపిస్తారని సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్‌ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. తాము తలచుకుంటే రాష్ట్రంలో ఏ చానెల్ కూడా రాదని హెచ్చరించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను అడ్డుకోవడం దారుణమని కొడాలి నాని విమర్శించారు. పేదలకోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఆయన బతికుండగానే చంద్రబాబు మెడపట్టి గెంటేసి పదవి లాక్కున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారకులైన సన్నాసులు టీడీపీలో ఉంటే, వైఎస్ కుటుంబం కోసం పదవులు త్యాగం చేసిన నేతలు వైఎస్ఆర్ సీపీలో ఉన్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదిరించి వైఎస్ జగన్ జైలుకెళితే, ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. -
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..?
ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం పమిడిముక్కల : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ప్రతిపక్షపార్టీల నాయకులను అరెస్టు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. విజయవాడలో ధర్నా చేస్తున్న వంగవీటి రాధా, పైలా సోమినాయుడును పోలీసులు అరెస్టుచేసి పమిడిముక్కల స్టేషన్‌కు తరలిం చారు. ఈ సమాచారం తెలిసిన పార్టీ నాయకులు తరలివచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్ ఉయ్యూరు నుంచి అనుచరులతో తరలివచ్చి రాధాకు మద్దతు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్టేష న్కు వెళ్లి రాధాను పరామర్శించారు. అనంతరం నాని మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో పేదలు 50 ఏళ్లుగా నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి కలెక్టర్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చేసినా నాయకులను అరెస్టుచేయడం అక్రమమన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పడు చంద్రబాబు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం
► దమ్ముంటే తెగదెంపులు చేసుకో.. ► లేదంటే బీజేపీలో విలీనం చెయ్.. గుడివాడ: రాష్ట్రానికి చుక్కనీరు రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని.. కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాలేని సీఎం అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కేంద్రంలో అధికారం పంచుకుంటూ.. కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాలంటే టీడీపీని బీజేపీలో విలీనం చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని, లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రాజెక్టులు ఆపేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి పోరాటం చేయాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షను రాజకీయంగా అభివర్ణించటం సరికాదన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దని హితవు పలికారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే మన రాష్ట్రం భవిష్యత్ ఎడారిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారు
ఎమ్మెల్యే కొడాలి నాని నందివాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రామాపురంలో దళితుల మధ్య చీలిక తీసుకురావటం కోసం అధికార పార్టీ నాయకులు గ్రామంలో గొడవలు పెడుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఆరోపించారు. రామాపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. దీంతో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు గాయపడి వారిని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కొడాలి నాని గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ఎమ్మెల్యే నాని విలేకర్లతో మాట్లాడుతూ మా పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ మొండ్రు వెంకటేశ్వరరావు వర్గానికి చెందిన కార్యకర్తల ఇళ్లపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారని తెలిపారు. గతంలో అధికార పార్టీ వ్యక్తులు మా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే పోలీసులు మాపై 307 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని, టీడీపీ వారిని 327 సెక్ష న్ నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వారి దాడిలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించినట్లు వివరించారు. దీనిపై జిల్లా ఎస్పీ, డీఐజీతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఇలాగే అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడితే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పెయ్యల ఆదాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీటిసీ సభ్యుడు మీగడ ప్రేమ్‌కుమార్, సీనియర్ నాయకులు దూక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, కో-ఆప్షన్ సభ్యుడు బండి సుబ్బారావు, పూనూరి బుద్దారెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు. -
గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద పోలీసుల హైడ్రామా..
గుడివాడ : స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో జూదం ఆడుతున్నారనే సమాచారంతో గుడివాడ పోలీసులు క్లబ్‌పై దాడి చేశారు. క్లబ్ సభ్యులు పోలీసు అధికారులపట్ల దురుసుగా మాట్లాడటంపై కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగింది. స్వాతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈసంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ఆఫీసర్సు క్లబ్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం జిల్లా ఎస్పీకి చేరింది. దీంతో స్పందించిన ఎస్పీ స్థానిక డీఎస్పీకి సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ మూర్తి, ఇద్దరు ఎస్సైలతో అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారు. కాగా క్లబ్ సభ్యులు ఎదురు తిరిగి పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ అంకినీడు ప్రసాద్ అక్కడికి చేరుకుని అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీలోని ఒక వర్గానికి చెందిన వారు కావటంతో జిల్లాలో ఉన్న మంత్రిని వీరు ఆశ్రయించారు. పేకాట ఆడుతూ దొరికిన వారిలో క్లబ్ కార్యవర్గంలో ఉన్న ప్రముఖులు, పట్టణానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. స్టేషన్ వద్ద హైడ్రామా... ఈసంఘటన జరిగిన వెంటనే స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగింది. కాగా పేకాట ఆడుతూ దొరికిన వారి పేర్లు మార్పుచేయాల్సిందిగా పోలీసులపై తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చారు. ఒకా నొక దశలో దొరికిన వారి స్థానంలో వేరొకరిని మార్పుచేసే ప్రయత్నాలు జరిగాయి. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించటంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. కష్టపడి క్లబ్‌పై దాడిచేసి పట్టుకుంటే ఇటువంటి అపవాదులు ఏమిటనే ఆలోచనతో కనీసం కొందరినైనా అసలు వారిని ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నలుగురి అరెస్టు, 1720 నగదు స్వాధీనం ఆఫీసర్సు క్లబ్‌పై జరిపిన దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసామని వన్‌టౌన్‌సీఐ మూర్తి పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.1720 నగదు స్వాధీన పర్చుకున్నట్లు వివరించారు. అదుపులోకి తీసుకున్న వారిలో గొట్టిపాటి రవి, పొట్లూరి వెంకటేశ్వరరావు (ఎర్రబుజ్జి), కాట్రగడ్డ అప్పారావు, సోడాబత్తుల వెంకటేశ్వరరావులు ఉన్నట్లు చెప్పారు. పార్టీలో ఉన్న వారి మధ్య విబేధాలే కారణం? గుడివాడ క్లబ్‌కు వారం క్రితం నూతన కార్యవర్గం ఎన్నికైంది. గుడివాడ క్లబ్లో దాదాపు పది సంవత్సరాలుగా పేకాట ఆడకుండా స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన వారిలో కొందరు తాము పేకాట ఆడిస్తామని ప్రగల్భాలు పలికినట్లు తెలిసింది. అయితే కొత్తగా కార్యవర్గం ఎన్నికైన తరువాత శనివారం కార్యవర్గం మొదటి సమావేశం జరుగుతుంది. ఈసమావేశం సందర్భంగా వచ్చిన సభ్యుల్లో కొందరు పేకాట ఆడేందుకు ప్రయత్నించారు. ఈవిషయం అధికార పార్టీలోని ఒక వర్గం పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించటంతో ఈ రగడ ఏర్పడిందనేది తెలిసింది. దీంతో మరోవర్గం వారు. మంత్రిని ఆశ్రయించారు. అయితే మంత్రి చొరవతో పేర్లు మార్పిడికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.