సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు సీట్లు అమ్ముకుంటున్నారని, రూ.150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేసిన కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. గుడివాడలో కూడా రూ.100 కోట్లు ఇచ్చినోడికి సీటిచ్చారని తెలిపారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
రేవంత్‌ను కలవాల్సిన అవసరం ఏముంది?
తెలంగాణలో మేం ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. ఆ రాష్ట్ర సీఎం గురించి ఇక్కడ చర్చ అనవసరం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సీఎం. ఆయనది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? ఆయన ఏమైనా సుప్రీమా? ఆయనకు ఏందీ ఫోన్ చేసేది. రేవంత్ ముఖ్యమంత్రి అయినందుకు సీఎం వైఎస్ జగన్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అయితే ఎవరు సీఎం అవుతారా అని చూస్తుంటారు. రేవంత్‌రెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా ఎందుకు కలుస్తారు. తుంటి ఎముక విరిగినందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. రేవంత్‌ను పరామర్శించడానికి ఆయనకు తుంటి ఎముక విరగలేదు కదా?. ఏపీలో సీట్లు ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుంది. రేవంత్ చెప్తే ఇక్కడ సీట్లు ఇవ్వరు. ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలి అనుకుంటే తెలంగాణలో సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో పోటీ చేయాలి.
ఆయనే ఆంధ్రాలో పీసీసీ అధ్యక్షుడు అయినా మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబును గెలిపించేందుకే షర్మిలను వినియోగించుకుంటున్నారు. మా సీఎంను కలిసేందుకు మాకు సమయం సరిపోవడం లేదు. పక్క రాష్ట్రం సీఎంను కలసి మేం ఏం చేస్తాం. పక్క రాష్ట్రాల రాజకీయాలు పట్టించుకునే స్థితిలో మా నాయకుడు, మేము లేం. ఏబీఎన్ రాధాకృష్ణవి అన్నీ వెకిలి ప్రోగ్రాములు. ముగ్గురిని కంటే రూ.45 వేలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. అదే రూ.45 వేలు ఇచ్చి వాళ్ల పప్పుగాడిని పిల్లలను కనమని చెప్పాలి. వాడినే ఐదారుగురుని కనమని చెప్పాలి.
కృష్ణా జిల్లాలో పార్టీని ఎవరూ వీడటంలేదు
కారణాలు చెప్పి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఏ సీటు మార్చుతున్నారో వారినే సీఎం పిలిచి మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎవరూ పార్టీ నుంచి వెళ్లడం లేదు. పార్థసారథికి సీటు ఇవ్వడంలేదని సీఎం ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది లిస్టు పెట్టుకుని సీఎం చర్చిస్తున్నారు. నా నియోజకవర్గంలో సమస్యలపై సీఎంను కలిసి మాట్లాడా.
Comments
Please login to add a commentAdd a comment