వినోదం, అశ్లీలాల కలబోత బాలీవుడ్
ఇతర నగరాలతో పోలిస్తే భారతదేశంలో అత్యంత ఉదార ప్రాంతంగా పేరున్న ముంబైలోనే అశ్లీలాన్ని అధికస్థాయిలో సహిస్తున్నారు. అలాగే పొరుగు దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే అశ్లీలాన్ని అధికంగా భరిస్తున్నారు. కళాత్మక నాణ్యత కంటే విశాల దృష్టి, సహనభావమే బాలీవుడ్ అత్యుత్తమ లక్షణం.
కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ పాకిస్తానీ రచయిత్రి మోని మొహ్సి న్ భారత్ సందర్శించారు. ‘ది ఫ్రైడే టైమ్స్’ పత్రికలో ఆమె కాలమ్ ఆధారంగా ప్రచురించిన ‘టెండర్ హుక్స్’ పుస్త కాన్ని విడుదల చేయడం నాటి సందర్భం. ముంబైలో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నేను నా స్నేహితుడు, అంతకు కొద్ది నెలల క్రితమే బుకర్ ప్రైజ్‌కు నామినేట్ అయిన నవలా రచయిత నీల్ ముఖర్జీ హాజరయ్యాము. మోని పుస్తకాన్ని ఆనాడు సామాజిక వ్యంగ్య రచనగా పేర్కొన్నాను. ఆ సభలో మోనీ, పాకిస్తాన్ సమాజం గురించి వాగ్ధాటితో ప్రసంగించారు. ఆ శైలిలో ఆ పుస్తకాన్ని ఎందుకు రాయవలసివచ్చిందో తెలిపారు. అది లాహోర్ సంపన్న గృహిణి రాసుకున్న దినచర్యలా ఉండేది. పాకిస్తాన్, భారత్‌లను సరిపోల్చినప్పుడు ఆమె బాలీవుడ్‌పై ప్రతికూల వ్యాఖ్య చేశారు. బాలీవుడ్ సినిమాల నాణ్యత నాసిర కమనీ, అవి మనకు అవసరం లేదని, బాలీవుడ్ లేకున్నా మనం బతకగలమని ఆమె వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇరాన్ సినిమాలే మరింత ఉత్త మంగా ఉంటాయని ఆమె అభిప్రాయం.
ఆనాడు ఆమె చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు తెచ్చుకుని రాస్తున్నాను. కానీ ఆమె మాటల సారాంశాన్ని ఖచ్చితంగా ఇక్కడ పొందుపర్చాను. ఇరానీ సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, డిసెంబర్లో జరిగిన బెంగళూరు చిత్రోత్స వంలో చూపించిన నాసర్ జమిరి చిత్రం ‘విత్ అదర్స్’తోపాటు కొన్ని విసుగుతెప్పించే ఇరాన్ సిని మాలను నేను చూసి ఉన్నాను. కానీ బాలీవుడ్ గురించి ఆమె ఏమన్నారన్న విషయంపై నేను ఆసక్తి చూపించాను. చాలా సంవత్సరాల క్రితం సాదత్ హసన్ మం టో గురించి కూడా ఇలాగే చెప్పుకున్నారు. మంటో కాల్పనికేతర రచనలను నేను అనువదించాను. వాటిలో బాలీవుడ్ తొలి 25 సంవత్సరాల చరిత్రపై వ్యాసం ఒకటి. ‘హిందుస్తానీ సనత్ ఇ ఫిల్మ్సజి పార్ ఏక్ నజర్’ అనేది మూల వ్యాసం పేరు. దాంట్లో మంటో బాలీవుడ్ కళా నైపుణ్యం గురించి చర్చిస్తూ ఇలా రాశారు. ‘మనకు మంచి సినిమాలు రావాలి. ఇతర దేశాల నుంచి వచ్చిన సినిమాలకు పోటీ పడే స్థాయిలో మనకూ గొప్ప సినిమాలు కావాలి. భారత దేశానికి సంబంధించిన ప్రతిదీ ప్రకాశించాలని మనం కోరుకుంటున్నాం.
కానీ గత 25 సంవత్సరాలను అంటే 9,125 రోజులను పరి శీలిస్తే మనం ఏం ప్రదర్శించాం? మన దర్శకులను ఘనంగా చూపగలిగామా? ఇకపోతే, ఇతరుల రాత లకు కాస్త పూత పూసి బతుకు సాగించే మన రచయి తల మాటేమిటి? మన సినిమాలను ఇతరులకు చూపగలమా? (అవన్నీ అమెరికా సినిమాలకు నకళ్లే). అస్సలు చూపలేం’. నా అభిప్రాయంలో భారత్‌కు బాలీవుడ్ ప్రాముఖ్యత అనేది దాని కళాత్మక నాణ్యతకు సంబంధించినది కాదు. దీనిపై తర్వాత చర్చిస్తాను. ప్రభుత్వం ఇటీవల చిత్ర నిర్మా త పహలాజ్ నిహలానీని కొత్త సెన్సార్ బోర్డు చీఫ్ గా నియమించిందని వార్తలు చూసినప్పుడు ఈ అంశంపై నాకు ఆలోచన తట్టింది. గోవిందాతో అం ఖేన్, అక్షయ్ కుమార్‌తో తలాష్ వంటి సినిమాలు తీసిన రికార్డు ఉన్న నిహలానీని ఈ పదవికి ఎంపిక చేయడం రెండు విషయాలను తెలుపుతోంది. తాను బీజేపీకి చెందిన వాడిననీ, ప్రధానే తన యాక్షన్ హీరో అని నిహలానీ ప్రకటించాడు.
చాలా బాగుంది. ఇది రాజకీయ నియామకమే. అయితే టెలివిజన్‌లో చాలా అధికంగా నగ్నత్వం ప్రదర్శిస్తున్నారని, దీన్ని తప్పకుండా నియంత్రిం చాలని నిహలానీ చెప్పారు. కాని నేను కొన్ని తప్పు చానళ్లను చూసినప్పటికీ టీవీలో ఎలాంటి నగ్న త్వాన్నీ నేను చూసి ఉండలేదు. నిహలానీ దృష్టిలో అశ్లీలం అంటే ఏమిటని నేను ఆలోచిస్తు న్నాను. అందుకే బాలీవుడ్ నాణ్యతపై పై వ్యాఖ్యలను దీంతో ముడిపెట్టాలని భావిస్తున్నాను.
వాస్తవమేమిటంటే ఇరాన్ చిత్ర నిర్మాతలకు ప్రజానురంజక వినోదాన్ని అందించడానికి అను మతి లేదు కాబట్టే ఆ దేశం కొన్ని మంచి, కళాత్మక సినిమాలను నిర్మించగలిగింది. మంచి సినిమాలు రావాలంటే కొన్నింటిని నిషేధించ పనిలేదు కానీ అశ్లీల పునాదినుంచే జనరంజక వినోద చిత్రాలను నిర్మిస్తున్నారన్నది వాస్తవం. ఇతర నగరాలతో పోలిస్తే భారతదేశంలో అత్యంత ఉదారప్రాంతంగా పేరున్న ముంబైలోనే అశ్లీలాన్ని అధికస్థాయిలో సహిస్తున్నారు. అలాగే పొరుగు దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే అశ్లీలాన్ని అధికంగా భరిస్తు న్నారు. అందుకే మొత్తం దక్షిణాసియా వినోద పరి శ్రమకే బాలీవుడ్ కేంద్రమై నిలుస్తోంది. లాహోర్, నేటి పాకిస్తాన్‌లోని ఇతర నగరాలకు చెందిన వ్యక్తు లు బాలీవుడ్‌పై ఆధిపత్యం చలాయించి చాలా కాలం కాలేదు. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ, బాలీ వుడ్ స్థాయిని కలిగిన చిత్ర పరిశ్రమను లాహోర్ నిర్మించలేకపోయింది. లాహోర్‌లో ఈనాటికీ కళా త్మక ప్రతిభ చావలేదని నా దృఢనమ్మకం. జన రం జకమైన వినోదాన్ని రూపొందించడానికి లాహోర్‌కు అనుమతి లేదన్నదే అసలు విషయం.
ఒక జాతిని జాగృతపర్చడానికి అనేక మార్గాలు న్నాయని, వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది సినిమా అనే విషయంలో ఏకాభిప్రాయం ఉందని సాదత్ మంటో తన వ్యాసంలో రాశారు. ఎంత సంక్లిష్టమైనదైనా సరే సినిమాల ద్వారా సం దేశాన్ని ప్రతిభావంతంగా కమ్యూనికేట్ చేయటం సుల భం.. మనస్సును జాగృతపర్చి, పదునుబెట్టి కొత్త భావాలను, కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టగల వినో దాత్మక సినిమాల అవసరం భారత్‌కు ఎంతైనా ఉం దని మంటో చెప్పారు.
ఈ మాటల్ని మంటో 1938లో రాశారు. అప్ప టికి ఆయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. చిత్రపరిశ్రమలో తన కెరీర్ తొలినాళ్లలో ఆయన ఇలా రాశారు. అయితే తన రచనల్లో నిర్దిష్ట విష యాంశాలను ఆయన స్పృశించనప్పటికీ, అశ్లీలం పట్ల సమాజానికి ఉండవలసిన సహనభావంపై ఆయన ఆలోచనలు ఏమిటనేది మనం మంటో కథానికలలో చూడగలం. బాలీవుడ్ పనిచేసే తీరును మంటో అర్థం చేసుకున్నారు. దాని కళాత్మక నాణ్యత కంటే దాని విశాల దృష్టి, సహనభావమే బాలీవుడ్ అత్యుత్తమ లక్షణమని ఆయన గుర్తించారు.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
Aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్