Mullaperiyar dam
-
‘మేం ఎలాంటి సాయం ప్రకటించలేదు’: యూఏఈ
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ముళ్లపెరియార్ డ్యాం నీటిమట్టంపై కేరళ, తమిళనాడు మధ్య వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. కేరళలో వరద నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని డ్యాం నీటిమట్టాన్ని 139.99 అడుగులు కొనసాగించాలని తమిళనాడును ఆదేశించింది. ఆగస్టు 31 వరకూ ఈ ఉత్తర్వులు అమలు చేయాలని పేర్కొంది. ముళ్లపెరియార్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ ఆదేశాలు జారీచేస్తున్నామని కోర్టు శుక్రవారం తెలిపింది. డ్యాం నీటిమట్టాన్ని 139 అడుగుల వరకే కొనసాగించాలని ఆగస్టు 23న సమావేశమైన సబ్ కమిటీ తమిళనాడును ఇప్పటికే ఆదేశించినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. డ్యాం గరిష్ట నీటిమట్టాన్ని 142 అడుగుల వరకూ కొనసాగించవచ్చని 2014లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం గమనార్హం. తాజా తీర్పుపై తమిళనాడు తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వివాదాన్ని విపత్తు నిర్వహణ అంశంగానే పరిగణిస్తున్నామని, కేరళలోని భారీ వరదను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టు స్పష్టంచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేస్తూ.. ఆలోగా అభ్యంతరాల్ని వెల్లడించాలని కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు కోర్టు సూచించింది. రాష్ట్రంలో వరద ముప్పు పెరగడానికి ముళ్లపెరియార్ డ్యాం నుంచి ఒక్కసారిగా నీటిని వదలడం కూడా ఒక కారణమని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం తెల్సిందే. కేరళ ఆరోపణను తమిళనాడు తోసిపుచ్చింది. కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కడీ సమీపంలో నిర్మించిన ముళ్లపెరియార్ డ్యాం నిర్వహణ బాధ్యతల్ని ఒప్పందంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం చూస్తోంది. సాయంపై నిర్ణయంకాలేదు: యూఏఈ వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఎంత మేర ఆర్థిక సాయం చేయాలన్నదానిపై అధికారికంగా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) శుక్రవారం స్పష్టంచేసింది. యూఏఈ రూ. 700 కోట్ల సాయం ప్రకటించిందని, ఆ సాయాన్ని భారతసర్కారు నిరాకరిస్తోందని వార్తలురావడం తెల్సిందే. కేరళ వరద బాధితుల సాయం కోసం తమ ప్రభుత్వం కేవలం జాతీయ అత్యవసర కమిటీని మాత్రమే ఏర్పాటు చేసిందని యూఏఈ రాయబారి అహ్మద్ అల్బనమ్ చెప్పారు. వరద బాధితులకు సాయంపై రాబోయే రోజుల్లో తన ప్రణాళికను యూఏఈ వెల్లడించవచ్చని ఆయన తెలిపారు. కాగా కేరళకు రూ. 700 కోట్ల సాయం చేస్తానని ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేశారంటూ ఆ రాష్ట్ర సీఎం విజయన్ చెప్పడం తెల్సిందే. కేరళకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ 6 లక్షల డాలర్ల(రూ. 4.2 కోట్లు) అత్యవసర మొత్తాన్ని సాయంగా ప్రకటించింది. దీనిని వరద సాయం, పునరావాసం కోసం యునిసెఫ్‌కు అందచేస్తామని పేర్కొంది. కేరళలోని స్థానిక ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్న యునిసెఫ్‌కు ఈమొత్తం ఎంతో ఉపకరిస్తుందని అందులో ఆకాంక్షించింది. శిబిరాల్లోనే 10 లక్షల మంది బాధితులు కేరళలో వరద దాదాపుగా తగ్గుముఖం పట్టినా.. దాదాపు 10.40 లక్షల మంది బాధితులు 2,770 శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా 5 లక్షల మంది శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇళ్లు పూర్తినేలమట్టమైన బాధితులు పునరావాసం కోసం క్యాంపుల్లో ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 37 వేల బావులు, 60 వేల ఇళ్లను ఇంతవరకూ శుభ్రం చేశామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. వరద బాధితులకు సాయం చేయడం ద్వారా ఓనం పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెను విపత్తు నేపథ్యంలో ఈసారి ఓనం వేడుకల్ని కేరళ ప్రభుత్వం, వివిధ సంస్థలు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరద విలయంలో భారీ నష్టపోయిన కేరళలో ప్రత్యేకంగా పరిగణించాలని.. ఇతర రాష్ట్రాల విపత్తులతో దీనిని పోల్చవద్దని పరోక్షంగా కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళను ఆదుకునేందుకు ముందుకొస్తోన్న యూఏఈ, ఖతర్ తదితర దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళ వరదలు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముళ్లపెరియార్ డ్యామ్‌లో ఈనెల 31 వరకూ నీటిమట్టాన్ని 139 అడుగులు నిర్వహించాలని సుప్రీం కోర్టు తమిళనాడును ఆదేశించింది. కేరళ వరదలను దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు, కేరళ పరస్పర సహకారంతో ప్యానెల్ ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించింది. ముళ్లపెరియార్ డ్యామ్ సబ్‌కమిటీ ఈనెల 23న భేటీ అయిన సందర్భంగా సుప్రీం కోర్టు అనుమతించిన పరిమితికి రెండు అడుగులు తక్కువగా 139 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిందని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి తమిళనాడు ఒక్కసారిగా నీటిని విడుదల చేయడం వల్లే వరదలు సంభవించాయని కేరళ సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కడి వద్దనున్న ముళ్లపెరియార్ డ్యామ్‌ను తమిళనాడు నిర్వహిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. -
ముళ్లపెరియార్ ముప్పును తగ్గించండి!!
న్యూఢిల్లీ : కేరళలో వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో ముళ్ల పెరియార్ డ్యామ్ వివాదంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొండిగా ప్రవర్తించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికే నీటి మట్టం142 అడుగులకు చేరుకుంది. దీంతో కేరళలోని 14 జిల్లాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ- తమిళనాడు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించింది. నీటి మట్టం 139 అడుగులకు తగ్గించండి.. కేరళలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ ముళ్లపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించండి. అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. శుక్రవారం ఉదయం తమిళనాడు, కేరళ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయండి. వారు అందుబాటులో లేనట్లయితే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరుగుతోంది. -
కేరళ అతలాకుతలం.. ముళ్లపెరియార్ ముప్పు!
కొచ్చి: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఇప్పటికే 45మంది మృతిచెందారు. రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజాగా 12 జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద నీటితో దాదాపు 30 డ్యాములు నిండిపోయి.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. మరోవైపు పురాతన ముళ్లపెరియార్ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చిచేరడంతో పూర్తిగా నిండిపోయి.. ప్రమాదస్థాయికి చేరుకుంది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరదను కిందకు వదులుతున్నారు. వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతం భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే.. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంతగా స్లిప్‌వేస్ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. నాలుగు రోజులు ఎయిర్‌పోర్టు మూసివేత కొచ్చి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో నాలుగు రోజులపాటు విమానాశ్రయాన్ని నిలిపివేశారు. మొదటగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. వరద నీరు మరింగా నిలిచిపోవడంతో వరద నీటిని తరలించేందుకు ఇదమలయార్, చెరుతోని డ్యామ్ గేట్లను ఎత్తివేసిన అనంతరం పెరియార్ నదీ తీరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేశారు. -
కేరళ కుట్రకు చెక్
ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారంలో తమిళనాడుకు మరో విజయం చేకూరింది. కేరళ కుట్రలకు చెక్ పెట్టే విధంగా సుప్రీం కోర్టు స్పందించింది. పునః పరిశీలన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేరళ చర్యలకు కళ్లెం వేసింది. సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని ఇటీవల 142 అడుగులు పెంచిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల అనంతరం ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ మట్టానికి నీళ్లు చేరాయి. అయితే, ఈ మట్టానికి నీళ్లు నిల్వ ఉంచిన పక్షంలో తమ ప్రజలకు భద్రత లేదని, డ్యాం బలహీనంగా ఉందని ఆరోపిస్తూ పలు రకాల కుట్రలకు కేరళ సర్కారు వ్యూహ రచనలు చేసింది. సుప్రీం కోర్టు తీర్పును పునః పరిశీలించే విధంగా ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. డ్యాంకు వ్యతిరేకంగా కేరళ దాఖలు చేసిన పునః పరిశీలన పిటిషన్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని రాజకీయ శాసనాల బెంచ్ ముందుకు వచ్చింది. అయి తే, ఈ విచారణకు తమిళనాడు, కేరళ అధికారులను అనుమతించలేదు. దీంతో విచారణ వివరాలు బయటకు రాలేదు. డ్యాం వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పు పునఃసమీక్షకు సుప్రీం కోర్టు నిర్ణయించిందా? లేదా తిరస్కరించిందా? అన్న ఉత్కంఠ బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో విచారణలో వెల్లడించిన తీర్పు వివరాల్ని బుధవారం సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ప్రకటించడంతో తమిళనాడుకు మరో విజయం చేకూరినట్టు అయింది. తమ తీర్పులో కేరళ కుట్రలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరిందని, డ్యాం పటిష్టంగా ఉందని తాము నియమించిన కమిటీ సైతం స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. తాము ఇది వరకే స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇందులో పునః పరిశీలించాల్సిన అవసరం లేదని బెంచ్ తేల్చింది. డ్యాం వ్యవహారంలో పునః పరిశీలించాల్సిన అవసరం లేని దృష్ట్యా, ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తోసి పుచ్చడంతో తమిళనాడు హక్కుల్ని మళ్లీ సుప్రీం కోర్టు రక్షించింది. ఇక ఆ ఉత్తర్వులను తేని, దిండుగల్, శివగంగై, రామనాధపురం, మదురై జిల్లాల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రత : సుప్రీం కోర్టు మళ్లీ డ్యాం విషయంలో తమిళనాడుకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడంతో ఇక, ఆ డ్యాం భద్రతా వ్యవహారాల్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రం తమ చేతిలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ను అన్నదాతలు తెరమీదకు తెచ్చారు. డ్యాం వైపుగా తమిళ అధికారుల్ని వెళ్లనీయకుండా కేరళ పోలీసులు అడ్డుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీనిని పరిగణనలోకి తీసుకుని, డ్యాం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. లేదా కేంద్ర రిజర్వు బలగాలకు ఆ డ్యాం భద్రతను అప్పగించాలని కోరారు. ఆ డ్యాం భద్రత వ్యవహారాలు కేరళ చేతిలో ఉన్న పక్షంలో మరేదేని కుట్రలు జరిగే అవకాశం ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకుని డ్యాం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. -
‘సుప్రీం’కు వెళతాం
సాక్షి, చెన్నై: ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టం తగ్గింపు లక్ష్యంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని కేరళ సీఎం ఉమన్ చాందీ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం కుదరదని ఎన్నడూ తాము చెప్పలేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని సూచించారు. ఈ మేరకు సోమవారం చెన్నైలో ఉమన్ చాందీ మీడియాతో మాట్లాడారు. ములై్ల పెరియార్ డ్యాంకు వ్యతిరేకంగా కేరళ అనేక కుట్రలు చే స్తున్న విషయం తెలిసిందే. ఆ డ్యాం నీటిమట్టం పెంపును అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాల్లో ఉన్న కేరళ సర్కారు, ఇక సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధం అయింది. తమ ప్రజల భద్రతను అస్త్రంగా చేసుకుని నీటి మట్టం తగ్గించి తీరుతామన్న ధీమాను చెన్నై వేదికగా ఉమన్ చాందీ వ్యక్తం చేయడం గమనించాల్సిందే. సుప్రీంకు వెళతాం: పూందమల్లి రోడ్డులోని కేరళ సమాజంలో ఉదయం పలు ప్రారంభోత్సవాలు, సామూహిక వివాహ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల నిమిత్తం ఉదయాన్నే కేరళ సీఎం చెన్నైకు ఉమన్ చాందీ వచ్చారు. ఆయనకు కేరళ సమాజం నేతలు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు నుంచి కేరళకు ఖనిజ సంపదల అక్రమ రవాణా వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అక్రమార్కుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినశిక్ష తప్పదని హెచ్చరించారు. అక్కడి నుంచి నేరుగా కేరళ సమాజం చేరుకున్నారు. అక్కడ నూతన భవన ప్రారంభోత్సవం అనంతరం, పది జంటలకు సామూహిక వివాహాల్ని జరిపించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ములై్ల పెరియార్ వ్యవహారం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా ప్రజల భద్రతమే ముఖ్యం : ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని తగ్గించాలని మాత్రమే తాము కోరుతూ వస్తున్నామని వివరించారు. అయితే, నీటిని ఇవ్వబోమని ఎక్కడా, ఏ సందర్భంలోనూ తాము చెప్పింది లేదన్నారు. తమిళనాడులోని ఆరు జిల్లాల ప్రజల నీటి అవసరాల గురించి తనకు తెలుసునని, ఆ ప్రజలకు నీళ్లు ఇవ్వం అని తాము చెప్పే ప్రసక్తే లేదన్నారు. అయితే, తమ ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకుని డ్యాం నీటి మట్టాన్ని తగ్గించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. ఆ డ్యాం నిర్మించి 117 ఏళ్లకు పైగా కావస్తున్నదని, అప్పటి టెక్నాలజీ వేరు అని వివరించారు. ప్రస్తుతం ఆ డ్యాం పటిష్టత గురించే తాము ప్రస్తావిస్తూ వస్తున్నామని, ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎప్పుడో నిర్మించిన ఈ డ్యాంపై తమకు అనేక అనుమానాలు ఉండడం సహజం అని పేర్కొంటూ, ఈ డ్యాం రూపంలో ఎక్కడ తమ ప్రజలకు ప్రమాదం ఎదురవుతుందోనన్న ఆందోళన వెంటాడుతోందన్నారు. తమిళనాడులో పెద్ద సంఖ్యలో మలయాళీయులు ఉన్నారని గుర్తు చేస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము డ్యాం వ్యవహారంలో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తమిళ ప్రజల నీటి ఆవశ్యకతను తాము గుర్తించామని, వారికి అన్యాయం తలబెట్టడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమ ప్రజల భద్రతే ముఖ్యం అని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు వివరిస్తామని, ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని తగ్గించే విధంగా తమ వాదనల్ని వినిపిస్తామన్నారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మరో కుట్ర
ముల్లై పెరియార్ డ్యామ్ నీటి మట్టం పెంపును అడ్డుకునే విధంగా కేరళ సర్కారు మరో కుట్రకు సిద్ధమైంది. కుంటి సాకులతో ఆ డ్యామ్‌లో నిల్వ ఉన్న నీటి ని బయటకు విడుదల చేయించే విధంగా కోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఈ కుట్రలపై ఆ డ్యామ్ ఆధారిత జిల్లాల్లోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చెన్నై : ముల్లైపెరియార్ డామ్ నీటి మట్టాన్ని తగ్గించేందుకు కేరళ సర్కారు కుట్రపన్నుతోంది. దీనిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యామ్‌పై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉంది. ఈ డ్యామ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ సర్కారు పలు కుట్రల్ని చేసింది. ఈ డ్యామ్ బలహీనంగా ఉందంటూ కపట నాటకాల్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తమిళుల పక్షాన నిలబడడంతో ఆ డ్యామ్ నీటి మట్టం 142 అడుగులకు పెంచే పనిలో అధికారులు పడ్డారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆ డ్యామ్‌లోకి నీటి రాక పెరిగింది. మరి కొద్ది రోజుల్లో నిర్ణీత స్థాయికి నీటి మట్టం చేరనుంది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆ డ్యామ్‌ను పరిశీలిస్తూ, నీటి మట్టాన్ని పెంచే పనిలో పడింది. అయితే, ఈ నీటి మట్టం 142 అడుగులకు చేరిన పక్షంలో డ్యామ్ పటిష్టతను ఎత్తి చుపుతూ 152 అడుగులకు పెంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించ వచ్చన్న భావనలో కేరళ సర్కారు పడ్డట్టుంది. దీంతో నిర్ణీత స్థాయికి నీటి మట్టం చేరకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇదో పెద్ద కుట్ర బుధ, గురువారాల్లో కేరళ నీటి పారుదల శాఖ అధికారులు ఆ డ్యామ్ పరిసరాల్లో రహస్య పరిశీలన జరిపి తమ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అందులో కొత్త కుట్రకు తెరలేపారు. ఆ డ్యామ్‌లోని రెండు గేట్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు, వాటికి మరమ్మతులు అనివార్యం అన్నట్టుగా వివరించారు. ఈ దృష్ట్యా, డ్యామ్‌లో నీటి మట్టాన్ని పెంచకుండా, నీటి శాతాన్ని అధికంగా నిల్వ ఉంచకుండా, బయటకు విడుదల చేయాల్సిన అవశ్యం ఉందని సూచించారు. అందుకే బుధవారం నుంచి ఆ డ్యామ్ నుంచి లక్షా 22 వేల గణపుటడుగుల నీటిని విడుదల చేయించే పనిలో పడ్డట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలకు సమాచారం అందింది. అన్నదాతల ఆగ్రహం ముల్లై పెరియార్ డ్యామ్ పరిసరాలు ప్రకృతి రమణీయతకు నిలయలుగా ఉన్నాయని, ఈ పరిసరాల్ని ఆక్రమించి ప్రైవేటు రిసార్ట్స్‌లు, కేరళ పర్యాటక కేంద్రాలు వెలసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ డ్యామ్ నీటి ఆధారిత తేని, విరుదునగర్, రామనాథపురం, శివగంగై, మదురై అన్నదాతల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డ్యామ్ నీటి మట్టం క్రమంగా పెరిగిన పక్షంలో ఆక్రమణల్లో వెలసిన రిస్టార్స్లకు ఇబ్బందులెదురయ్యేప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించే కేరళ కొత్త కుట్రకు తెరలేపిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడు వేల ఎకరాల్లో ఈ రిసార్ట్స్‌లు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వీటిని త్వరితగతిన అడ్డుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నీటిని లక్షల గణపుటడుగుల మేరకు విడుదల చేయడం వలన డ్యామ్ నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గురువారానికి డ్యామ్ నీటి మట్టం 138 అడుగుల్ని దాటింది. అందుకే, కొత్త కుట్రతో కోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో కేరళ ఉందని మండి పడుతున్నారు. కేరళ చర్యల్ని అడ్డుకునే విధంగా రాష్ట్ర ప్రజా పనుల శాఖ చర్యల్ని వేగవంతం చేయాలని, ముల్లై పెరియార్ పరిసరాల్లో కేరళ చెక్ పోస్టుల్ని తొలగించి, తమిళ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయాలని, ఆక్రమణకు గురైన ప్రాంతాల్ని తిరిగి తమిళనాడు గుప్పెట్లోకి తీసుకురావాలని అక్కడి అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేరళ కుట్రల్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజా పనుల శాఖ అధికారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అమరావతి డ్యామ్‌కు నీళ్లు రాకుండా ఆ పరిసరాల్లో కొత్త డ్యామ్ ప్రయత్నాల్లో కేరళ ఉన్నట్టు వచ్చిన సమాచారంతో ఆ విషయంగా లోతైన పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. ఈ పనులు పూర్తి కాగానే, ముల్లై పెరియార్ వ్యవహారంపై కేరళతో ఢీ కొట్టేందుకు కసరత్తులు చేపట్టబోతున్నారు. -
‘ముల్లై’ లక్ష్యం 152 అడుగులు
ముల్లైపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 152 అడుగులకు పెంచడమే తన లక్ష్యమని సీఎం జయలలిత స్పష్టం చేశారు. తమిళుల హక్కుల పరిరక్షణ, జీవనాభివృద్ధి, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంత ఉద్యమాలకు తాను సిద్ధమని ప్రకటించారు. మదురైలో శుక్రవారం జరిగిన ముల్లైపెరియార్ డ్యామ్ విజయోత్సవ సభలో సీఎంను రైతు సంఘాల నేతలు పొగడ్తలతో ముంచెత్తారు. సాక్షి, చెన్నై : ముల్లైపెరియార్ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు చేర్చే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ పనులు వేగవంతమయ్యాయి. ఈ విజయం ముఖ్యమంత్రి జే.జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వ శ్రమకు ఫలితంగా చెప్పవచ్చు. జయలలితను సత్కరించే విధంగా, విజయోత్సవాన్ని జరుపుకునేందుకు ఆ డ్యామ్ నీటి ఆధారిత జిల్లాలు తేని, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, మదురై, దిండుగల్ రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందు కోసం మదురై వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురైకు వెళ్లారు. అక్కడ సీఎంకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ప్రత్యేక హెలీకాఫ్టర్లో మదురై పాండి కోవిల్రింగ్ రోడ్డులోని మైదానానికి చేరుకున్నారు. అక్కడ ముల్లై పెరియార్ డ్యామ్ నమూనాలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం జయలలితను రైతు సంఘాల నాయకులు, మంత్రుల బృందం అభినందనలతో ముంచెత్తింది. నిలువెత్తు పూల మాలను, విజయోత్సవానికి కానుకగా ముల్లైపెరియార్ నమూనాతో సిద్ధం చేసిన భారీ జ్ఞాపికను, వీర కత్తిని బహూకరించారు. 152 అడుగులే లక్ష్యం తన ప్రసంగంలో ఇది అభినందన సభ కాదని, తమిళ ప్రజలు, అన్నదాతలు సాధించిన విజయోత్సవానికి ప్రతీక అని సీఎం జయలలిత అభివర్ణించారు. 37 ఏళ్ల పోరటానికి లభించిన విజయం 142 అడుగులకు నీటి మట్టం పెంచడం అని గుర్తుచేశారు. తమిళుల హక్కుల పరిరక్షణకు తాను అధికారంలో ఉన్నా, లేకున్నా, అహర్నిశలు శ్రమించినట్టు గుర్తుచేశారు. సుప్రీం కోర్టులో తమిళుల హక్కులు పరిరక్షించ బడ్డాయని వివరించారు. అయితే డీఎంకే హయాంలో తమిళుల హక్కులు కాలరాయడం లక్ష్యంగా, ఈలం తమిళులు సర్వనాశనం లక్ష్యంగా ప్రయత్నాలు జరిగాయని ధ్వజమెత్తారు. గత డీఎంకే ప్రభుత్వ పుణ్యమా అని కరుణానిధి వ్యక్తిగత స్వలాభం కారణంగా తమిళ ప్రజలు, రాష్ట్రం సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులు, రాష్ట్రంలోని డీఎంకే కలసికట్టుగా తమిళుల హక్కులన్నింటినీ తాకట్టుపెట్టే యత్నం చేశారని శివాలెత్తారు. తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్త శుద్ధితో తేని, దిండుగల్, మదురై, శివగంగై, రామనాథపురం జిల్లాల ప్రజల జీవనాధారం లక్ష్యంగా, తన వ్యక్తిగత సమస్యగా ఈ డ్యామ్ వివాదాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కిందని, 142 అడుగులకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. ఆనకట్టులు, డ్యామ్ తీరాన్ని మరింత బలపరచుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు తమిళనాడుకు ఇచ్చిందన్నారు. ఈ ప్రక్రియ ముగియగానే, ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 152 అడుగులకు చేర్చడం లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు తనకు సంపూర్ణ సహకారం ఇచ్చారని, ఈ విజయంలో వారికి, అన్నదాతలకు భాగం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, సెల్లూరు కే.రాజు, గోకుల ఇందిర, సుందరరాజ్, ఆర్పీ ఉదయకుమార్, ఫార్వడ్ బ్లాక్ ఎమ్మెల్యే కదిరవన్, కంబం, పల్లతాక్కు, పెరియార్, వగైై, తమిళనాడు వ్యవసాయ సంఘాల నాయకులు వీ.కృష్ణమూర్తి, ఇవి అరుల్ ప్రకాశం, మదురై వీరన్, పనయూరు ఏ అలగు సెర్వై, ఆలత్తూరు గోవిందన్ తదితరులతో పాటుగా అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్నదాతలు తరలివచ్చారు. -
కల సాకారం
సాక్షి, చెన్నై: కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ డ్యామ్‌పై సర్వ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వం కలిగి ఉంది. ఈ నీటి మీద రాష్ట్రంలోని తేని, శివగంగై, రామనాథపురం, మదురై, విరుదునగర్ జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలరాయడమే లక్ష్యంగా కేరళ సర్కారు కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో తరచూ రెండు రాష్ట్రాల సరిహద్దులో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన డ్యామ్ బలహీనంగా ఉందన్న కుంటి సాకుతో నీటి మట్టాన్ని క్రమంగా తగ్గించే పనిలో కేరళ సర్కారు పడింది. ఆ డ్యామ్ నీటి సామర్థ్యం తొలినాళ్లలో 152 అడుగులు. కేరళ కుట్రలతో 1979లో నీటి మట్టం 136 అడుగులకు తగ్గించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచుకునేలా ఆదేశించడం శుభ పరిణామం.రంగంలోకి కమిటీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ ఎల్ఏవీ నాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రజా పనుల శాఖ కార్యదర్శి సాయికుమార్, కేరళ నీటి పారుదల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కురియన్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం రంగంలోకి దించింది. ఈ కమిటీ నీటి మట్టం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. డ్యామ్ సామర్థ్యం, పటిష్టతను పూర్తిగా పరిశీలించిన ముల్లైపెరియార్ డ్యామ్ పర్యవేక్షణ కమిటీ కేరళ వేదికగా రెండుసార్లు సమావేశమైంది. చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ డ్యామ్‌ను పరిశీలించేందుకు కమిటీ చైర్మన్ ఎల్ఏవీ నాథన్ నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ఉదయం ఇడిక్కి నుంచి బోటులో ముల్లై పెరియార్ డ్యామ్‌ను పూర్తిగా పరిశీలించారు. నీటి నిల్వ, గేట్ల పటిష్టత, డ్యామ్ పరిసరాల్లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇక మీదట చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ఆ డ్యామ్ గేట్లను కిందకు పైకు దించుతూ, నీటి ఉద్ధృతిని పరిశీలించారు. చివరకు గేట్లను 136 అడుగుల నుంచి 146 అడుగులకు పెంచడం తమిళుల్లో ఆనందాన్ని రెకెత్తించింది. 36 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఫలితం దక్కనుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ గేట్లను 146 అడుగులకు చేర్చిన దృష్ట్యా నీటి నిల్వ ఆ మట్టానికి చేర్చే ఉత్తర్వులు ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం కుములి వేదికగా ఈ కమిటీ రాత్రి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానంతరం నీటి పెంపుపై ఉత్తర్వులు వెలువడొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అలాగే డ్యామ్ నీటి మట్టం పెంపు ఉత్తర్వులు వెలువడగానే అందుకు తగ్గ పనుల్ని రాష్ర్ట ప్రజా పనుల శాఖ సిద్ధం చేయడం విశేషం. -
‘ముల్లై’ కమిటీ
సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం పర్యవేక్షణా కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఆ డ్యాంలోకి 142 అడుగుల మేరకు నీటి మట్టం చేరుతుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని సర్వత్రా స్వాగతించారు. పీఎం మోడీకి సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలియజేశారు. నీటి కోసం అటు కర్ణాటక, ఇటు కేరళతో తమిళనాడు పెద్ద సమరమే చేస్తూ వస్తోం ది. కావేరి వివాదం కర్ణాటకతో సాగుతోంటే, ముల్లై పెరియార్ డ్యాం వివా దం కేరళతో ఎదుర్కోవాల్సిన పరి స్థితి. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కులు తమిళనాడుకే ఉన్నాయి. అయితే, ఈ హక్కులను కాలరాసే రీతిలో కేరళ సర్కారు తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దీంతో ఈ నీటిపై ఆధార పడ్డ తేని, రామనాధపురం, శివగంగై, దిండుగల్, మదురై జిల్లాల్లో తరచూ ఆందోళనలు జరగడం సాధారణమైపోయింది. అన్నదాతలు ఓ వైపు, తమిళనాడు ప్రభుత్వం మరో వైపు కేరళతో తరచూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణలు సాగాయి. ఎట్టకేలకు గత నెల విచారణ ముగింపు దశకు చేరింది. ఆ డ్యాంను పరిశీలించి సమగ్ర నివేదికను సుప్రీం కోర్టు కమిటీ సిద్ధం చేసింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ముల్లై పెరియార్ డ్యాం పటిష్టంగా ఉందని, ఆ డ్యాం నీటి మట్టాన్ని 142 అడుగుల వరకు నిల్వ ఉంచుకోవచ్చంటూ తీర్పు వెలువరించింది. ఇది తమిళులు సాధించిన విజయం. అదే సమయంలో ఆ డ్యాం పర్యవేక్షణకు కేంద్రం, తమిళనాడు, కేరళ అధికారులతో ప్రత్యేక కమిటీకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జాప్యం...అడ్డంకులు : సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు నీటి పారుదల శాఖ అధికారులు నీటి మట్టం పెంపు పరిశీలన పర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పనులకు అడుగడుగున కేరళ సర్కారు అడ్డు తగులుతూ రావడంతో పనుల్లో జాప్యం నెలకొంది. సుప్రీం కోర్టు ఆదే శాల మేరకు కమిటీ ప్రకటనలోను జాప్యం తప్పలేదు. కేరళ చర్యలను వివరిస్తూ పదే పదే ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలిలత లేఖాస్త్రాల్ని సంధించారు. ఇందుకు ప్రతి ఫలం బుధవారం దక్కింది. కమిటీ : ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముల్లై పెరియార్ డ్యాం పర్యవేక్షణా కమిటీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిటీలో తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని కావేరి నదీ జలాల సాంకేతిక కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న సుబ్రమణియన్‌ను ఎంపిక చేశారు. కేరళ తరపున ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి సూర్యన్ను నియమించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తరపున అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అదే సమయంలో త్వరితగతిన కమిటీ అధ్యక్షుడి ప్రకటన చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పుడే కేరళ ఆగడాలకు పూర్తి స్థాయిలో కళ్లెం వేయగలిగే అవకాశాలు ఉంటాయి. ఇది వరకు కేంద్ర నీటి పారుదల శాఖలో పనిచేసిన అధికారులు తద్వా, మోహత, కోషాల పేర్లు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కృతజ్ఞతలు : కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడులో హర్షాతి రేకాలు వెల్లువెత్తాయి. పధానంగా తేని, దిండుగల్, మదురై, శివగంగై, రామానాథపురం జిల్లాల అన్నదాతలు తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు. 142 అడుగులకు నీటి మట్టం ఎప్పుడెప్పుడు చేరుతుందోనన్న ఎదురు చూపుల్లో అన్నదాతలు ఉన్నారు. కేరళలో కురుస్తున్న వర్షాలతో ముల్లై పెరియార్ డ్యాంకు నీటి రాక పెరుగుతోంది. ఈ దృష్ట్యా త్వరితగతిన కమిటీ అధ్యక్షుడిని నియమించిన పక్షంలో నీటి మట్టం పెంపుకు దోహద కారి అవుతుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముల్లై పెరియార్ డ్యాం భద్రతా కమిటీ అధ్యక్షుడు రంజిత్‌కుమార్ పేర్కొంటూ, కేంద్రం నిర్ణయం ఆనందాన్ని కల్గిస్తున్నదన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ముల్లై పెరియార్ డ్యాంపై తమిళులకు పూర్తి హక్కులు ఉన్నాయన్న విషయాన్ని ఇప్పుటికైనా కేరళ సర్కారు గుర్తించి, అడ్డుతగలడం మానుకోవాలని హితవు పలికారు. ఇక, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే అధినేత విజయకాంత్, రాష్ట్ర బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, పీఎంకే అధినేత రాందాసు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, ఐజేకే నేత పారివేందన్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ పంపించారు. ముల్లై పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేసినట్టుగానే, కావేరి బోర్డు, కమిటీ ఏర్పాట్లుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డెల్టా అన్నదాత లు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..?
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలోనే లింగా చిత్రం తెరకెక్కిందని కోలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడైయాన్ తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం లింగా. ఇందులో రజనీ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మల యాళ దర్శకుడు రూపొందిస్తున్న డ్యామ్ 999 చిత్రానికి పోటీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. పెరియార్ డ్యామ్ ను బెన్ని క్విక్ అనే ఆంగ్లే య ఇంజినీర్ నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా పలు భూములు సాగులోకి వచ్చారుు. ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది. నీటి ఒత్తిడి పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో సాగే లింగా చిత్రంలో రజనీ ఆంగ్లేయ ఇంజినీర్ బెన్ని క్విక్‌గా నటిస్తున్నారని, వ్యవసాయ సాగు కోసం డ్యామ్‌ను నిర్మించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆయన కొడుకుగా మరో పాత్రను నవతరం యువకుడిగా రజనీ నటిస్తున్నారట. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న డ్యామ్‌ను పునర్నిర్మించడానికి పోరాడే పాత్ర ఇదని తెలుస్తోంది. ఈ చిత్రం లో హాస్యనటులు వడివేలు, సంతానం ఇద్దరు రజనీ కాంత్‌లతో నటిస్తున్నట్లు సమాచారం. -
‘ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు పెంచుకోండి’
న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా నలుగుతున్న ముళ్లపెరియార్ డ్యామ్ వివాదంలో కేరళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 120 ఏళ్ల నాటి ఈ డ్యామ్ సురక్షితమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో నీటిమట్టాన్ని 142 అడుగుల ఎత్తుకు పెంచుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. డ్యామ్‌ను మరింత పటిష్టపరిచాక నీటిమట్టాన్ని అంతిమంగా 152 అడుగులకు కూడా పెంచుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, న్యాయమూర్తులు హెచ్ఎల్ దత్తు, సీకే ప్రసాద్, మదన్ బి.లోకూర్, ఎంవై ఇక్బాల్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తమిళనాడును అడ్డుకోరాదని కేరళను ఆదేశించింది. అంతేగాక, డ్యామ్ సురక్షితం కాదని, కనుక నీటిమట్టాన్ని 136 అడుగులకే పరిమితం చేయాలని పేర్కొంటూ కేరళ సర్కారు 2006లో చేసిన చట్టాన్ని కొట్టేసింది. తమ గత తీర్పును ఉల్లంఘిస్తూ అలాంటి చట్టం చేసినందుకు అక్షింతలు వేసింది. తమ రాష్ట్ర ప్రజల భద్రత కోసమే ఆ చట్టం చేయాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది. -
‘ముల్లైపెరియార్’కల సాకారం
చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై ప్రావిన్స్-తిరువాన్గూరు సంస్థానాల మధ్య 999 ఏళ్లకు చేసుకున్న ఒప్పందం మేరకు ముల్లైపెరియార్ రిజర్వాయరు నిర్మాణం 1895లో పూర్తయింది. రిజర్వాయరు మొత్తం ఎత్తు 152 అడుగులు. తమిళనాడులోని తేనీ, రామనాథపురం, శివగంగై, దిండుగల్లు, మధురై జిల్లాల రైతులు ఈ రిజర్వాయరు ద్వారా విడుదలయ్యే సాగునీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రిజర్వాయరు నిర్వహణ బాధ్యతలను ప్రజాపనుల శాఖ నిర్వహిస్తుండగా, ముల్లైపెరియార్ కేరళ సరిహద్దులో ఉన్నకారణంగా ఆ ప్రభుత్వం తరచూ సమస్యలు సృష్టిస్తోంది. రిజర్వాయరులోని నీటి మట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగులకు పెంచాలని కొన్ని దశాబ్దాలుగా కేరళను రాష్ట్రం కోరుతోంది. రిజర్వాయరు బలహీనంగా ఉందనే నెపంతో కేరళ ప్రభుత్వం నిరాకరించింది దీంతో తమిళనాడు ప్రభుత్వం 2006లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అనుకూలమైన తీర్పు వచ్చింది. అయినా ఈ తీర్పును అమలుచేసేందుకు కేరళ ససేమిరా అనడంతోపాటూ కొత్త రిజర్వాయరు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంలో అప్పీల్ చేసింది. తమిళనాడుకు చెందిన రిైటైర్డు న్యాయమూర్తి లక్ష్మణన్, కేరళకు చెందిన రిటైర్డు న్యాయమూర్తి థామస్తోపాటూ ఇద్దరు రిటైర్డు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని సుప్రీం కోర్టు నియమించింది. ఈ బృందం 2010లో రిజర్వాయరును పరిశీలించి సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది. అప్పటి నుంచి గత ఏడాది ఆగస్టు 20వ తేదీ వరకు రెండు రాష్ట్రాల వాదోపవాదాలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వుచేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లోథాతోపాటూ మరో ఐదుగురు న్యాయమూర్తులు బుధవారం తీర్పును ప్రకటించారు. ముల్లైపెరియార్ రిజర్వాయరులో నీటి మట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగుల ఎత్తుకు పెంచాలని, కేరళ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వాయర్ రక్షణ చట్టం చెల్లదని వారు తీర్పు చెప్పారు. హర్షాతిరేకాలు ముల్లైపెరియార్ రిజర్వాయరులో నీటిమట్టం పెంపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం తీర్పుతో ప్రధానంగా లాభం చేకూరే ఐదు జిల్లాలైన తేనీ, రామనాథపురం, శివగంగై, దిండుగల్లు, మధురైలకు చెందిన అనేక రైతు సంఘాలు రోడ్లలో బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నాయి. ఐదు జిల్లాల్లో 73 లక్షల మందికి వ్యవసాయమే జీవనాధారం. సుప్రీం కోర్టు ప్రతికూలంగా వచ్చి ఉంటే లక్షలాది మంది రైతుల బ్రతుకు ప్రశ్నార్థకమయ్యేది. సాగునీటి కొరత కారణంగా ఈ ఐదు జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు గాను 1.75 లక్షల ఎకరాలను మాత్రమే సాగు చేస్తున్నారు. కనీసం ఒక పంట కూడా సమృద్ధిగా చేతికందడం లేదు. డ్యాంలో నీటిమట్టం పెంపుపై తమిళనాడు రైతుల్లో భయాందోళనలు కలగజేసేందుకు కేరళ ప్రభుత్వం ఁడ్యాం 999రూ. అనే సినిమాను తీసింది. నీటిమట్టం పెంపుతో బలహీనమైన ముల్లైపెరియార్ డ్యామ్ బద్ధలైనట్లు, వేలాది మంది ప్రజలు ప్రాణాలు విడిచినట్లు అందులో చూపారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధం విధించింది. ఇటువంటి బెదిరింపులకు తాము భయపడబోమని కేరళను హెచ్చరించింది. సీఎం జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, పీఎంకే అధ్యక్షుడు రాందాస్ తమ హర్షాన్ని వెలిబుచ్చారు. రిజర్వాయరులో నీటిమట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగులకు పెంచడం వల్ల అదనంగా లక్ష ఎకరాలకు లబ్ధి చేకూర్చేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని రైతులు ఆనందం వెలిబుచ్చారు.