బెంగళూరు బంద్ వాయిదా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ వాయిదా పడింది. ఇదే కార్యక్రమాన్ని ఈ నెల 31న చేపట్టాలని నిర్ణయించినట్లు కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ బుధవారం ఇక్కడ తెలిపారు. కన్నడ సంఘాలతో పాటు చలన చిత్ర పరిశ్రమ, రచయితలు, సాహితీవేత్తలు, పౌర సంఘాలు సహా అందరూ బంద్ విజయం కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.