నాలాలపై ఆక్రమణలు తొలగించాలి
అందులో పేదలుంటే ప్రత్యామ్నాయం చూపండి
నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలి
ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్
హన్మకొండ అర్బ¯ŒS :
నగరంలో నాలాల అక్రమణల వల్ల తీవ్ర నష్టం జరుతోందని, ఈ విషయంలో అధికారులు ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగించాలని ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ ఆదేశించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాకు ఆయనను ప్రత్యేకాధికారిగా ప్రభు త్వం నియమించింది. దీంతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ నాలాల అక్రమణల వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటోందని అన్నారు. ఆక్రమితుల్లో పేదలు ఉంటే వారికి ప్రభుత్వ పరిధిలో ప్రత్యామ్నా యం చూపించాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అంచనా వేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వాలన్నారు. పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితి ఏర్పడేంతవరకూ సహాయక చర్యలు కొనసాగించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న చోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. వ్యాధులు ప్రబలే ప్రమా దం ఉన్నం దున వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జేసీ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలకు ఒక వీఆర్వోతోపాటు మొత్తం నలుగురు మృతిచెందారని తెలిపారు. పునరావాస కేం ద్రాల్లో భోజన సదుపాయం కోసం పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండు ప్రధాన నాలాలు అక్రమణకు గురయ్యాయని చెప్పారు. సమావేశంలో డీఆర్వో శోభ, డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.