ఉద్యోగాలు
సెయిల్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆపరేటర్ కం టెక్నీషియన్ - ట్రైనీ
విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్.
అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
అటెండెంట్ కం టెక్నీషియన్
విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్.
అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26
వెబ్సైట్: www.sail.co.in
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ
పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
లైబ్రరీ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 2
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
చివరి తేది: అక్టోబర్ 8
వెబ్సైట్: www.niapune.com